Kurnool

News May 14, 2024

నంద్యాల జిల్లాలో ఫైనల్ పోలింగ్ శాతం ఇదే..

image

నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి వరకు 80.92 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 83.12 శాతం, అత్యల్పంగా నంద్యాల నియోజకవర్గంలో 75.00 శాతం నమోదైంది. బనగానపల్లె 82.28, డోన్ 82.91, నందికొట్కూరు 81.69, శ్రీశైలం నియోజకవర్గంలో 81.70 శాతం ఓటింగ్ పోలైంది. కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 14, 2024

కర్నూలు జిల్లాలో ఫైనల్ పోలింగ్ శాతం ఇదే..

image

కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం కలిపి) పరిధిలో నిన్న రాత్రి వరకు 75.83 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ సృజన తెలిపారు. అత్యధికంగా మంత్రాలయం నియోజకవర్గంలో 84.51, అత్యల్పంగా ఆదోని 63.51 శాతం శాతం నమోదైంది. కర్నూలు 63.87, పాణ్యం 74.09, పత్తికొండ 84.14, కోడుమూరు 76.50, ఎమ్మిగనూరు 81.80, ఆలూరు 82.77 శాతం నమోదైనట్లు ఆమె తెలిపారు.

News May 13, 2024

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్: కలెక్టర్

image

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసిందని కలెక్టర్/ఎన్నికల అధికారి జీ.సృజన తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. పోలింగ్ ప్రక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

News May 13, 2024

ఎమ్మెల్యే అభ్యర్థిపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అనుచరుల దాడి

image

డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అనుచరులతో తనపై దాడి చేశారని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పీఎన్ బాబు ఆరోపించారు. ఎన్నికల పరిశీలనలో భాగంగా బేతంచెర్లకు వెళ్తుండగా అదే సమయంలో అటుగా వెళ్తున్న బుగ్గన తన కారు ఆపి అనుచరులతో దాడిచేసి, కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దీనిపై బేతంచెర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు.

News May 13, 2024

BREAKING: రాష్ట్రంలో అత్యధిక పోలింగ్ నమోదు నంద్యాల జిల్లాలోనే..

image

ఏపీలో ఉదయం 11 గంటల వరకు 24 శాతం పోలింగ్ నమోదు. కాగా నంద్యాల జిల్లాలో 27.19 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మన జిల్లాలోనే అత్యధికంగా నమోదైంది. తరువాతి స్థానంలో బాపట్ల జిల్లాలో 26.88 శాతం నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో 22.05 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు.

News May 13, 2024

మొరాయిస్తున్న ఈవీఎంలు.. మీ ఊరిలో ఓటింగ్ ఎలా జరుగుతోంది?

image

ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అయితే కర్నూలు, నంద్యాల జిల్లాలలోని పలు గ్రామాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కర్నూలులోని 78, మహానందిలోని 195, హాలహర్విలోని 74, బాపురంలోని 22, బంధార్ల పల్లెలోని 28వ, తదితర పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వెంటనే సరిచేరయడంతో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. మీ ఊరిలో ఓటింగ్ సరళి ఎలాఉందో తెలపండి.

News May 13, 2024

ఓటు హక్కును వినియోగించుకున్నాం: హిజ్రాలు

image

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని హిజ్రాలు పేర్కొన్నారు. మహానంది మండలంలోని తిమ్మాపురం, అబ్బీపురంలో జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాల్లో హిజ్రాలు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు మాట్లాడుతూ.. ఓటు హక్కును వినియోగించుకోవడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

News May 13, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలైన మాక్ పోలింగ్

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాక్ పోలింగ్ మొదలైంది. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పోలింగ్ సమయానికి 90 నిమిషాల ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. కొన్నిచోట్ల ఏజెంట్లు రాకపోవడంతో మాక్ పోలింగ్‌ ఆలస్యమైంది. ఈ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 13, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3,915 పోలింగ్ స్టేషన్లు

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 34.5 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,915 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో 50 మంది అభ్యర్థులు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 228 మంది అభ్యర్థులు
బరిలో ఉన్నారు.

News May 13, 2024

7 గంటలకు కచ్చితంగా పోలింగ్ ప్రారంభం కావాలి: కర్నూలు కలెక్టర్

image

మే 13వ తేదీన ఉదయం 7 గంటలకు పోలింగ్ కచ్చితంగా ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. ఆదివారం పోలింగ్ సన్నద్ధతపై రిటర్నింగ్ అధికారులతో, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో, ఎంపీడీవోలు, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రేపు ఉదయం 5.30 గంటలకు మాక్ పోల్ ప్రారంభం కావాలని ఆదేశించారు.