Kurnool

News May 10, 2024

కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే విధంగా జగన్ వ్యాఖ్యలు: తిక్కారెడ్డి

image

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందని ఎంపీ సంజీవ్ కుమార్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి, మంత్రాలయం ఇన్‌ఛార్జ్ తిక్కారెడ్డి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా జగన్ మాట్లాడడం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలకుల ఇసుక దోపిడీ వల్ల సుంకేసుల జలాశయంలో నీటి కొరత ఏర్పడిందని ఆరోపించారు.

News May 10, 2024

మహానంది: ఈ మార్గంలో ప్రయాణించే వారు జాగ్రత్త

image

నంద్యాల-గాజులపల్లె మార్గంలో చలమ రేంజ్ అటవీశాఖలోని పెద్ద పులులు, ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో ప్రయాణీకులు జాగ్రత్తలు పాటించాలని చలమ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ మార్గంలో ప్రయాణం చేసేవారు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేశారు.

News May 10, 2024

కర్నూలు: మరో 3 రోజుల్లో ఎన్నికల సమరం

image

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మరో 3 రోజుల్లో ప్రజాస్వామ్యంలో కీలక ఘట్టమైన ఓట్ల పండుగను మే 13న ఈసీ నిర్వహించనుంది. రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుండటంతో అభ్యర్థులు ఈ 2 రోజుల పాటు తమ ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మరోవైపు కర్నూలు, నంద్యాల జిల్లాల కలెక్టర్లు డాక్టర్ జీ.సృజన, డాక్టర్ కే.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

News May 10, 2024

వేసవికి ప్రత్యేక రైలు ఏర్పాటు

image

వేసవి సెలవులు దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పింది. ఆదోని మీదుగా సికింద్రాబాబ్-తిరుపతి(07489) ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మే 11వ తేదీ నుంచి రైలు అందుబాటులో ఉంటుందన్నారు. సికింద్రాబాద్‌లో రాత్రి 10:05 గంటలకు బయలుదేరి గద్వాల, రాయచూర్ మీదుగా ఆదోనికి రాత్రి 3:10 గంటలకు చేరుకుంటుందన్నారు.

News May 10, 2024

11వ తేదీ సాయంత్రం ప్రచారం సమాప్తం

image

11వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుందని ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ సృజన పేర్కొన్నారు. ఆ తర్వాత ఎవరూ ప్రచారం చేయకూడదని, ప్రచారం చేసినా, ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు సంబంధం లేని ఇతర జిల్లాల ఓటర్లు వెంటనే జిల్లా నుంచి వెళ్లిపోవాలన్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేస్తామన్నారు.

News May 10, 2024

ఫోన్లకు అనుమతి లేదు: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్ల అనుమతి లేదని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ జీ.సృజన పేర్కొన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ వెంట సెల్ ఫోన్లు తీసుకురావొద్దని సూచించారు. ఎన్నికల కేంద్రంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ)కు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ఓటర్లు గమనించాలని కోరారు.

News May 10, 2024

కర్నూలు: ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

image

కర్నూలు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్లలో 4 రోజులుగా నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ గురువారం ముగింసింది. పోలింగ్ సిబ్బంది, పోలీసులు, వయో వృద్ధులు, వికలాంగులు.. ఇలా అందరూ కలిపి 23,612 మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకోగా.. 20,733 (81.87శాతం) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News May 10, 2024

నంద్యాల జిల్లాకు విచ్చేసిన 9మంది ట్రైనీ ఐపీఎస్‌లు

image

ట్రైనింగ్‌లో భాగంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి భద్రత పరమైన చర్యలను గురించి తెలుసుకునేందుకు తొమ్మిదిమంది ట్రైనీ ఐపీఎస్‌లకు జిల్లాకు విచ్చేశారు. వారు ఎస్పీ రఘువీర్ రెడ్డిని గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారికి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలు, బందోబస్తు ఏర్పాట్ల గురించి ఎస్పీ వివరించారు.

News May 9, 2024

కర్నూలు జిల్లాలో 11వ తేదీ నుంచి మద్యం దుకాణాలు బంద్

image

ఎన్నికల దృష్ట్యా కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.సృజన సంబంధిత అధికారులను గురువారం ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి అధికారులు మద్యంపై నిఘా ఉంచాలన్నారు.

News May 9, 2024

48 గంటల ముందు నుంచే మద్యం దుకాణాలు బంద్:  కలెక్టర్

image

ఎన్నికల దృష్ట్యా ఈనెల 11వ తేదీ నుంచి 13వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.