Kurnool

News June 3, 2024

కర్నూలు: మైక్రో అబ్జర్వర్లకు కలెక్టర్ శిక్షణ

image

కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సాధారణ ఎన్నికలు-2024 కౌంటింగ్ నిర్వహణపై జనరల్ అబ్జర్వర్స్ జాఫర్, మీర్ తారిఖ్ అలీ, బిపుల్ సైకియా సమక్షంలో మైక్రో అబ్జర్వర్లకు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఆర్జే మధుసూదన్ రావు, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారులు సోమశేఖర్ రెడ్డి, మారుతి ప్రసాద్, సిద్ధలింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

News June 3, 2024

కర్నూలు: కాలువలోకి దూసుకెళ్లిన బస్సు.. తప్పిన పెను ప్రమాదం

image

గడివేముల నుంచి కర్నూలుకు వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం కాల్వ గ్రామం వద్ద బస్సు డ్రైవర్ ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కండక్టర్ ప్రయాణికులను ఇంకో బస్సులో తరలించారు.

News June 3, 2024

ఆత్మకూరు: కుక్కల దాడిలో అడవి దుప్పి మృతి

image

ఆత్మకూరు మండలం ముష్టెపల్లె గ్రామంలోకి వచ్చిన అడవి దుప్పులపై వీధి కుక్కలు దాడి చేశాయి. దీంతో ఒక దుప్పిమృతి చెందగా మరొక దుప్పి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది .కుక్కల దాడి నుండి తప్పించుకొని మరో మూడు దుప్పులు స్వల్పగాయాలతో అడవిలోకి వెళ్లిపోయాయి. దుప్పులుతరచూ అడవులను వదిలి గ్రామాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శలొస్తున్నాయి.

News June 3, 2024

KNL: మరో 24 గంటల్లో ప్రారంభం… తీవ్ర ఉత్కంఠ!

image

రాజకీయ ప్రజా ప్రతినిధులను మొదలుకొని ప్రజల వరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సమయం ఆసన్నమైంది. ఈసీ ఆదేశాలతో మరో 24 గంటల్లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం కానున్నాయా! లేక ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు మారనున్నాయా? అనే దానికై రేపటి వరకు వేచి చూడాల్సిందే.

News June 3, 2024

కర్నూలు: ఒక్కరోజే రూ.5కోట్ల మద్యం అమ్మకాలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బార్లు, మద్యం దుకాణాలు ఆదివారం కిటకిటలాడాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 175 ప్రభుత్వ మద్యం దుకాణాలు, 49 బారులు ఉన్నాయి. ఈ నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో 3, 4వ తేదీల్లో విక్రయాలు ఆపేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆదివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో రూ.5కోట్లకుపైగా అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా. కలెక్టర్ ఆదేశాలమేరకు ఆదివారం రాత్రి మద్యం దుకాణాలు బంద్ చేశారు.

News June 3, 2024

సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలను కలెక్టర్ డా.సృజన తనిఖీ చేశారు. నాల్గో తేదీ జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

News June 2, 2024

రెండు వేల మందితో పటిష్ఠ భద్రత: ఎస్పీ కృష్ణకాంత్

image

జూన్ 4న రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు సందర్భంగా రెండు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ కృష్ణకాంత్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 2, 2024

తుగ్గిలి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన తలారి శ్రీరాములు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం రాత్రి ఆర్ఎస్ పెండేకలుకు వెళ్లే దారిలో ఉన్న తోట వద్దకు వెళ్లిన తలారి ఆదివారం మృతి చెంది కనిపించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

News June 2, 2024

కర్నూలు జిల్లా ప్రజలకు కలెక్టర్ హెచ్చరికలు

image

ఎన్నికల్లో గెలుపోటమలు సహజమని ఎవరు వ్యక్తి గతంగా తీసుకోవద్దని కలెక్టర్ సృజన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఎవరన్న అతిక్రమిస్తే తగిన చర్యలు ఉంటాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News June 2, 2024

కర్నూలు: రేపు, ఎల్లుండి మద్యం అమ్మకాలు బంద్

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ 4న జరగనున్న నేపథ్యంలో 3, 4వ తేదీల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని కలెక్టర్ డాక్టర్ సృజన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కేవలం 4వ తేదీ మాత్రమే మూసివేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు మద్యం అమ్మకాలు మూసివేయాలని ఆదేశిస్తూ కలెక్టర్ మరో ఉత్తర్వు జారీ చేశారు.