India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
* బైరెడ్డిపై హత్య కేసు కొట్టివేత
* ఇసుక డిపోల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం: నంద్యాల కలెక్టర్
* సైబర్ నేరాల పట్ల అప్రమత్తం: కర్నూలు ఎస్పీ
* ఓంకార పుణ్యక్షేత్రంలో ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి
* గవర్నర్‌ను కలిసిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్
* మంత్రాలయంలో ఈ నెల 15న పుణ్యనది హారతి
* ఆదోని: YCP సోషల్ మీడియా కార్యకర్తలపై కేసు
* ఆళ్లగడ్డలో బైక్‌ల చోరీ దొంగ అరెస్ట్
బండి ఆత్మకూరు మండలం ఓంకారం పుణ్యక్షేత్రంలో విషాదం నెలకొంది. బుధవారం ఓంకారం పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి ట్రాక్టర్ వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి, శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురికి గాయాలైనట్లు తెలిపారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కర్నూలు మీదుగా శబరిమలకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నెల 14, 21, 28 తేదీలలో సాయంత్రం 5:50 నిమిషాలకు కర్నూలు మీదుగా కొట్టాయం వెళుతుంది. తిరిగి ఈ నెల 15, 22, 29 తేదీలలో రాత్రి 8:30 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6:00 గంటలకు కర్నూలు చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మరో రెండు దారుణాలు వెలుగు చూశాయి. బేతంచెర్ల మండలంలో 2వ తరగతి చిన్నారికి ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి తల్లి ఇంట్లో లేని సమయంలో అత్యాచారం చేయబోయాడు. చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో పరారయ్యాడు. గూడూరు మండలంలోని ఓ మహిళ పొలం పనులకు వెళ్లగా గోపాల్ అనే వ్యక్తి అత్యాచారం చేయబోగా తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోస్గి మండలంలో బాలికపై <<14596443>>సర్పంచ్ <<>>ఇలాగే వ్యవహరించిన విషయం తెలిసిందే.
బాలికపై సర్పంచ్ అత్యాచారయత్నం చేసిన ఘటన కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. ఆమె తండ్రి వివరాల మేరకు.. కోసిగి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఫ్యామిలీ పత్తి పనులకు కర్ణాటక వెళ్లింది. 8వ తరగతి చదివే కుమార్తె(13)ను తాత వద్ద వదిలి వెళ్లారు. గత నెల 30న ఆమె ఇంటి బయట నిద్రిస్తుండగా ఇద్దరి సహకారంతో స్థానిక సర్పంచ్ అత్యాచారం చేయబోయాడు. అలికిడి విని తాత నిద్రలేవగా వాళ్లు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలు అన్నది వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి కల్పించిన కట్టు కథ అని పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు వ్యాఖ్యానించారు. మంగళవారం అమరావతిలోని శాసనసభ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పటికీ యురేనియం తవ్వకాలపై వైసీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. యురేనియం తవ్వకాలు జరిగే ప్రసక్తి లేదని తేల్చిచెప్పేశారు.
ఆస్పరి: రైతులకు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా పశుగ్రాసాల సాగు చేయటానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని జేడి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం గ్రామ పశు వైద్య కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఎన్ఎల్ఎం ద్వారా గొర్రెల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. రైతులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యురేనియం తవ్వకాలను తక్షణమే ఆపేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఆందోళనల దృష్ట్యా ఇప్పటికే తవ్వకాలు నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లాలోని 86 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మౌలిక వసతుల ఏర్పాటుపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని వెల్ఫేర్ సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు.
నంద్యాల: పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలలో శంకుస్థాపన చేసిన రోడ్ల నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జి.రాజకుమారి అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో కలెక్టరేట్‌లో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. దాదాపు రూ.86 కోట్లతో జిల్లాలో 1023 సీసీ రోడ్లు, 3 బీటీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.