Kurnool

News May 3, 2024

చంద్రబాబు మాటలు నమ్మొద్దు: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

image

చంద్రబాబు నాయుడు గతంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రిగా కొనసాగారని, మళ్లీ కొత్త అబద్ధాలు చెబుతూ మీ ముందుకు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మొద్దని, మీ కుటుంబాలలో మంచి జరిగి ఉంటే వైసీపీకి ఓటు వేయాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం పాములపాడు మండలంలోని వాడాల, మద్దూరు, వేంపెంట, బానకచర్ల, భానుముక్కల, గ్రామాల్లో ప్రచారం చేశారు.చంద్రబాబు అబద్ధాల కోరు అని విమర్శించారు.

News May 3, 2024

బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ఆర్ఓకు ఫిర్యాదు

image

ఈ నెల 1వ తేదీన బుధవారం ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి వేల్పనూరు రోడ్డు షోలో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేసేలా ప్రసగించారని ఎమ్మెల్యే తనయుడు శిల్పా కార్తీక్ రెడ్డి ఎన్నికల ఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థి అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డిని అసభ్యకర పదజాలంతో దూషించారని అన్నారు. మెజారిటీ తగ్గితే.. బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News May 3, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లదే పైచేయి

image

జిల్లాలోని 14 నియోజవర్గాల్లో 34,48,382 మంది ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అందుల్లో పురుషులు 16,98,607, మహిళలు 17,49,199, ఇతరులు 576మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే 50,592మంది మహిళా ఓట్లర్లదే పైచేయి. అందులో 11 నియోజకవర్గాల్లో మహిళ ఓటర్లు అధికంగా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. నియోజకవర్గాల వారీగా పాణ్యం 3.32 లక్షల ఓటర్లతో అత్యధికం, 2.08 లక్షల ఓటర్లతో మంత్రాలయం ఓటర్లు అత్యల్పం.

News May 3, 2024

నేడు నంద్యాలకు నారా లోకేశ్

image

నంద్యాలలో శుక్రవారం నిర్వహించనున్న యవగళం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారని నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తెలిపారు. నంద్యాల పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ వెనుకభాగంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లాలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.

News May 3, 2024

నంద్యాల: 8 మండలాల్లో 46 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు

image

నంద్యాల జిల్లాలోని 8 మండలాల్లో 46 డిగ్రీలపైన, 10 మండలాల్లో 45 డిగ్రీలకు పైన, 4 మండలాల్లో 44 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బనగానపల్లి, డోన్‌లో 46.7, ఆళ్లగడ్డలో 46.6, మహానందిలో 46.4, నందికొట్కూరు, సంజామలలో 46.3, దొర్నిపాడు, కోవెలకుంట్లలో 46.1, పాణ్యంలో 45.9, మిడుతూరులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News May 3, 2024

KNL: డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

image

రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహించే డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్ థియరీ పరీక్షలను మే 13న ఎన్నికల నేపథ్యంలో కర్నూలు కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశాల మేరకు వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. 16వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

News May 3, 2024

బ్యాంకు లావాదేవీలపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు నివేదికలు అందజేయాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు అన్ని బ్యాంకుల రీజినల్ మేనేజర్లను సూచించారు గురువారం ఆయన చాంబర్లో ఛాంబర్‌లో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒకరి కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిపినట్లయితే సంబంధిత వివరాల డేటాను ఇవ్వాలన్నారు.

News May 2, 2024

కర్నూలు: రైలు కింద పడి వ్యక్తి మృతి

image

రైలు కింద‌ప‌డి వ్య‌క్తి మృతిచెందిన ఘ‌ట‌న ఆదోని మండ‌లం ఇస్వీ-కుప్ప‌గ‌ల్ ఆర్ఎస్ కి.మీ 508/08 డౌన్ లైన్ ట్రాక్ వ‌ద్ద‌ జ‌రిగింది. గురువారం రైల్వే ఎస్ఐ కే.గోపాల్ తెలిపిన వివ‌రాల మేర‌కు.. కౌతాళం మండ‌లం తోవి గ్రామానికి చెందిన ఆదోని తిక్క‌య్య అనే వ్య‌క్తి గూడ్స్ రైలు కిందప‌డి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య‌, ఇద్ద‌రు మ‌గ, ఇద్ద‌రు ఆడ పిల్ల‌లు ఉన్నారన్నారు. కేసు న‌మోదు చేశామన్నారు.

News May 2, 2024

ఆదోనిలో స్వల్పంగా తగ్గిన పత్తి ధర

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి క్వింటా గరిష్ఠ ధర రూ.7,587 పలికింది. మంగళవారంతో పోలిస్తే ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ఠ ధర రూ.4,711, వేరుశనగ గరిష్ఠ ధర రూ.7,311, కనిష్ఠ ధర రూ.3,819 పలికింది. ఆముదాలు గరిష్ఠ ధర రూ.5,400, కనిష్ఠ ధర రూ.4,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News May 2, 2024

నంద్యాల: వైసీపీని వీడిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు.. టీడీపీలో చేరిక..!

image

నంద్యాలకు చెందిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు డాక్టర్ రవికృష్ణ వైసీపీని వీడారు. గురువారం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను దారికి తెచ్చే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని రవికృష్ణ తెలిపారు.