Kurnool

News May 2, 2024

బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కార్యాలయంలో సాధారణ ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను పరిశీలించిన గురువారం జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ డా జి.సృజన కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి భార్గవ తేజతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇచ్చిన సమయం గడువులోగా ముద్రణ ముగించాలని ఆదేశించారు.

News May 2, 2024

శ్రీశైలం: ఇక నుంచి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం

image

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని దేవస్థాన ఈఓ పెద్దిరాజు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. దేవస్థానం చెక్‌పోస్టు వద్ద ప్లాస్టిక్ బాటిళ్లను క్షేత్ర పరిధిలోకి రాకుండా తనిఖీలు చేపడుతామన్నారు. స్థానిక వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News May 2, 2024

నంద్యాల: నేడు, రేపు జాగ్రత్తలు తీసుకోవాలి

image

నంద్యాల జిల్లా నిప్పుల కుంపటిలా మారుతున్న విషయం తెలిసిందే. గురు, శుక్రవారాల్లో వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 31 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 234 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. బనగానపల్లె మండలంలో నిన్న 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News May 2, 2024

కర్నూలు: బాలికపై యువకుడి లైంగిక వేధింపులు

image

బాలికపై ఓ యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన చిప్పగిరి మండలంలో జరిగింది. ఎస్సై మహమ్మద్ రిజ్వాన్ వివరాల మేరకు.. నాగరాజు అనే 30 ఏళ్ల యువకుడు ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను కట్టేసి, నోటిలో గడ్డలు కుక్కి లైగింక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు రావడంతో నిందితుడు పారిపోయాడని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని గాలించి ఆదపులోకి తీసుకుంటామన్నారు.

News May 2, 2024

కర్నూలు: పోలీసు స్టేషన్‌లోని నగదు చోరీ చేసిన హోంగార్డు

image

పోలీసు స్టేషన్‌లోని నగదును హోంగార్డు స్వాహాచేసిన ఘటన ఆదోనిలో జరిగింది. DSP శివనారయణస్వామి వివరాలు..టూ టౌన్ PSలో మనోజ్ హోంగార్డుగా పనిచేస్తున్నారు. PSలో విలువైన వస్తువులు భద్రపరిచే గది, బీరువా తాళాలు నకిలీవి తయారు చేయించాడు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన రూ.5,53,605 నగదును చోరీచేశాడు. కొద్ది రోజులకు విషయం బయటపడడంతో.. ఆ చోరీ తానే చేశానని మనోజ్ ఒప్పుకున్నాడు. అరెస్ట్‌చేసి నగదు స్వాధీనం చేసుకున్నారు.

News May 2, 2024

ప్రశాంత ఎన్నికలే ధ్యేయం: ఎస్పీ

image

మండల కేంద్రమైన వెలుగోడులో బుధవారం కేంద్ర సాయుధ బలగాలు, పోలీసులతో కలిసి ఎస్పీ కవాతు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసుల ధ్యేయం అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించడం కోసం కవాతు నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News May 1, 2024

నంద్యాల: వడదెబ్బతో యువతి మృతి

image

వడదెబ్బతో యువతి మృతిచెందిన ఘటన చాగలమర్రి మండల పరిధిలోని పెద్ద బోధనం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన రాజా, శివమ్మ దంపతుల కుమార్తె డొంక సంధ్య(22) వడదెబ్బ కారణంగా విరోచనాలు, వాంతులతో అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమించడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News May 1, 2024

ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా మేనిఫెస్టో: ఎంపీ అభ్యర్థి

image

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగాపడిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసేలా కూటమి మేనిఫెస్టో ఉందని, యువతీ యువకుల కలలను సాకారం చేసేలా మేనిఫెస్టో రూపొందించిన ఘనత కూటమి పార్టీలకే దక్కిందని నంద్యాల లోక్ సభ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాలలో ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయనున్నారని, యువతకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.

News May 1, 2024

నంద్యాల జిల్లాలో 20,509 మందికి హోం ఓటింగ్ అవకాశం

image

హోం ప్రక్రియ ఓటింగ్ పకడ్బందీగా నిర్వహించాలని మైక్రో అబ్జర్వర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.శ్రీనివాసులు ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో సుమారు 15,509 మంది దివ్యాంగులు, 5వేల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు వెల్లడించారు. వారికి ఎన్నికల కమిషన్ ఇంటి వద్ద ఓటు హక్కు కల్పించిన నేపథ్యంలో హోం ఓటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో 45మంది మైక్రో అబ్జర్వర్లను కేటాయించామన్నారు.

News May 1, 2024

వైసీపీ నేతల నుంచి నాకు రక్షణ కల్పించండి: కర్నూలు స్వతంత్ర అభ్యర్థి

image

వైసీపీ నాయకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని కర్నూలు స్వతంత్ర అభ్యర్థి ఎస్.ఇంతియాజ్ బాష ఆరోపించారు. రాత్రి 12 గంటల సమయంలో వైసీపీకి చెందిన ఇద్దరూ గరీబ్ నగర్‌లోని తన ఇంటికి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకోవాలని బెదిరించారని అన్నారు. ఈ విషయమై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం బాధితుడు ఫిర్యాదు చేశారు.