Kurnool

News May 1, 2024

కర్నూలు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం

image

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని ఖైరతాబాద్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాలు..బేతంచెర్ల(M) మెుద్దవరానికి చెందిన మధు రెండేళ్ల కిందట ఓ యూట్యూబ్ ఛానల్‌లో కెమెరామెన్‌గా పనిచేశాడు. అక్కడ రైటర్‌గా పనిచేస్తున్న యువతిని పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లికి ఏర్పాట్లు చేశాక పారిపోయాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

News May 1, 2024

నంద్యాల జిల్లాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారంటే..?

image

నంద్యాల జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్ల తుది జాబితాను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. జిల్లాలో మొత్తం 13,89,307మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 6,80,402మంది, మహిళలు 7,08,647 మంది, ఇతరులు 258 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా నంద్యాల నియోజకవర్గంలో 2,73,938 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,96,116మంది ఓటర్లు ఉన్నారు.

News May 1, 2024

నంద్యాల: ఈ నియోజకవర్గాల్లో రెండేసి ఈవీఎంలు

image

నంద్యాల జిల్లాలో ఎన్నికల నిర్వహణలో 16మంది అభ్యర్థుల కంటే ఎక్కువ ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు కేటాయించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కె.శ్రీనివాసలు తెలిపారు. నంద్యాల ఎంపీ స్థానానికి 31, ఎమ్మెల్యే స్థానాల్లో నందికొట్కూరు 16, బనగానపల్లి 28, శ్రీశైలం 18, ఆళ్లగడ్డ 18, నంద్యాల 28, డోన్ 16మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నందికొట్కూరు, డోన్ మినహ అన్ని స్థానాల్లో రెండేసి ఈవీఎంలు కేటాయించనున్నారు.

News May 1, 2024

ఓటర్ స్లిప్‌లను 4 రోజులలోపు పంపిణీ చేయాలి : కర్నూలు జిల్లా

image

ఓటర్ స్లిప్‌లను 4 రోజులలోపు పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత అధికారులను టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. మంగళవారం ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్, పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు, ఈవిఎమ్ కమిషనింగ్, పెన్షన్ పంపిణీ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 30, 2024

5న అండర్ 19 క్రికెట్ ఎంపిక పోటీలు:దేవేందర్ గౌడ్

image

కర్నూలు నగరంలోని బి క్యాంపు లో ఉన్న కర్నూలు డీఎస్సీ స్టేడియంలో మే 5న అండర్ 19 బాలుర క్రికెట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి దేవేందర్ గౌడ్ తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. 2005 తర్వాత జన్మించిన వారు మాత్రమే ఈ పోటీలకు అర్హులని వెల్లడించారు.

News April 30, 2024

దేవస్థానం సిబ్బంది రాజకీయ పార్టీల నాయకులతో కలవడం నిషేధం

image

శ్రీశైలం దేవస్థానం రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు రాజకీయ పార్టీల నాయకులను కలవడం, ఫోటోలు దిగటం నిషేధమని ఈవో డి.పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా క్షేత్ర పుర వీధులలో, వసతి భవనముల వద్ద, దుకాణముల సముదాయము వద్ద, ప్రైవేటు సత్రముల వద్ద రాజకీయ పార్టీలకు సంబందించిన కండువాలు, టోపీలు పెట్టుకుని
ఎన్నికల ప్రచారము చేయుట నిషేధమన్నారు.

News April 30, 2024

మహానంది: ఎండలకు అల్లాడుతున్న ప్రజలు

image

మహానంది మండలంలో గాజులపల్లె గ్రామంలో ఎండలకు తట్టుకోలేక పూరిళ్లలో నివసిస్తున్న వారు నీటితో ఇంటి పైకప్పుపై నీళ్లు చల్లుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉక్కపోత ఎక్కువగా ఉండటం, ఎండాకాలంలో చిన్న నిప్పురవ్వపడితే ఉండే ఇళ్లు కూడా కాలిపోతుందనే భయంతో ఇంటిపై నీళ్లు చల్లుకుంటున్నామని తెలిపారు. సూర్యతాపానికి నిలువుటద్దంగా ఈ ఫొటో నిలుస్తుందని పేర్కొంటున్నారు.

News April 30, 2024

ఆత్మకూరులో సూర్య తాండవం

image

కర్నూలు జిల్లాలో సూర్యుడు తాండవం చేస్తున్నాడు. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సోమవారం అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఆత్మకూరు వేడెక్కింది. ఇక బనగానపల్లి, డోన్‌లో 45.4, కోడుమూరులో 44.8, కల్లూరు, బండి ఆత్మకూరులో 44.7, మహానందిలో 44.7, పాములపాడులో 44.6, గూడూరులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతతో సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News April 30, 2024

నంద్యాల: బ్యాంక్ అకౌంట్ ద్వారా ఫించన్ల పంపిణీ

image

ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫించన్ లబ్ధిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా నగదు జమవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన లబ్ధిదారులకు డోర్ టు డోర్ పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విభిన్న ప్రతిభావంతులు, మంచానికే పరిమితమైన వారు, అస్వస్థతతో ఉన్నవారు, వృద్ధ మహిళలకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే అందిస్తారని చెప్పారు.

News April 30, 2024

నంద్యాల: ‘నూతన ఖాతాల నుంచే ఖర్చులను వినియోగించాలి’

image

ఎన్నికల ఖర్చుకు సంబంధించి అసెంబ్లీ అభ్యర్థికి రూ. 40లక్షలు, పార్లమెంట్ అభ్యర్థికి రూ.95 లక్షలు దాటకూడదని ఎన్నికల వ్యయ పరిశీలకులు మణికందన్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఖర్చులకు సంబంధించి అన్ని రకాల రిజిస్టర్లను రూపొందించాలన్నారు. అభ్యర్థులు నూతనంగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించి ఆయా ఖాతాల నుంచే ఎన్నికల ఖర్చుకు వినియోగించాలని సూచించారు. వచ్చే నెల ఖర్చు రిజిస్టర్లను తనిఖీ చేస్తామన్నారు.