Kurnool

News April 27, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈనెల 28,29 తేదీల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి మల్లెల రాజశేఖర్ తెలిపారు. 28న గూడురులో బహిరంగసభలో పాల్గొని రాత్రి అక్కడే బస చేస్తారు. 29న నంద్యాల జిల్లాలోని డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల్లో పర్యటిస్తారని తెలిపారు.

News April 27, 2024

కర్నూలు జిల్లాలో ఎన్ని నామినేషన్లు తిరస్కరించారంటే..?

image

కర్నూలు జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం సంబంధిత ఆర్వోల ఆధ్వర్యంలో పరిశీలన జరిగింది. కర్నూలు MP స్థానానికి 27 నామినేషన్లలో 7 నామినేషన్లు తిరస్కరించారు. ఎమ్మెల్యే స్థానాల వారీగా కర్నూలు 41 నామినేషన్లలో.. 14 తిరస్కరించారు. ఇలా పాణ్యం 24కు 9, కోడుమూరు 21లో 5, ఆదోని 15లో 4 నామినేషన్లను తిరస్కరించారు. మంత్రాలయం 12కు 2, ఆలూరు 15కు2, పత్తికొండ 14కు3, ఎమ్మిగనూరు 15కు5 తిరస్కరించారు.

News April 27, 2024

కర్నూలు: 13 మంది నామినేషన్ల తిరస్కరణ

image

కర్నూలు అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన నామినేషన్ల స్క్రూటినీలో 13 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ పేర్కొన్నారు. 40 మంది అభ్యర్థుల నుంచి అందుకున్న 56 నామినేషన్ల పత్రాలను పరిశీలించామన్నారు. సవ్యంగా పత్రాలు సమర్పించిన 27 మంది అభ్యర్థుల సభ్యత్వాన్ని ఆమోదించామన్నారు. లోపాలు ఉన్న 13 మంది అభ్యర్థుల సభ్యత్వాన్ని తిరస్కరించామని తెలిపారు.

News April 27, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ కర్నూలు తాలుకా పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్.కొంతలపాడు, తొలిశాపురం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి ఆరా తీశారు.

News April 26, 2024

ఎన్నికల కోడ్ పక్కాగా అమలు: కలెక్టర్

image

జిల్లాలో ఎన్నికల కోడ్ పక్కాగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జీ.సృజన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించిన 32 మంది వాలంటీర్లను తొలగించామన్నారు. ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన 9 మంది రేషన్ డీలర్లతో పాటు ఇతరులపై చర్యలు తీసుకున్నామన్నారు.

News April 26, 2024

నంద్యాల: కౌలు రైతు ఆత్మహత్య

image

అవుకు మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన కౌలు రైతు పుల్లయ్య(34) అప్పుల బాధతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. పుల్లయ్య అదే గ్రామానికి చెందిన రైతు వద్ద 4 ఎకరాలు కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. ఈ ఏడాది మిరప పంట ధర పూర్తిగా పతనం కావడంతో సుమారు రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లింది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

News April 26, 2024

కర్నూలు అసెంబ్లీ బరిలో 27 మంది అభ్యర్థులు

image

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి శుక్రవారం జరిగిన నామినేషన్ స్క్రూటినీ ప్రక్రియ ముగిసిందని రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ ప్రకటించారు. మొత్తం 40 నామినేషన్లు పరిశీలించగా.. అందులో 13 నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు ప్రకటించారు. 27 మంది అభ్యర్థుల నామినేషన్లను అనుమతించామని ప్రకటించారు.

News April 26, 2024

నంద్యాల: ఓటు హక్కును ప్రాధాన్యత తెలియజేసే కార్టూన్ చిత్రం

image

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ చిత్రకారుడు విజయ్ తమ కుంచె నుంచి వ్యంగ్య కార్టూన్‌ను రూపొందించారు. సామాజిక స్పృహ కలిగిన ఓటర్లు అందరూ నోటుకో , మద్యానికో .. తమ ఓటు అమ్ముకోకుండా ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే సరైన నాయకుడిని ఎంచుకోవాలని ఆర్టిస్ట్ విజయ్ తమ కార్టూన్ రూపంలో తెలిపారు. ఈ చిత్రం పలువురిని ఆలోచింపజేస్తుంది.

News April 26, 2024

రేపు పాలిసెట్ ప్రవేశ పరీక్ష

image

ఈనెల 27న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు నంద్యాల ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5,460 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

News April 26, 2024

నంద్యాల: రైలు ప్రయాణికులకు శుభవార్త

image

రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. గుంటూరు సెక్షన్‌లో భద్రతాపరమైన పనుల వల్ల ఈ ఏడాది ఏప్రిల్ వరకు రద్దు చేసిన డోన్-గుంటూరు-డోన్ (17227/28) రైలును పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది. డీఆర్సీసీ మెంబర్ జుబేర్ బాషా కృషి ఫలితంగా ఈరైలును పునరుద్ధరించనున్నట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఓ ప్రకటన విడుదల చేశారు.