Kurnool

News April 26, 2024

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆస్తి వివరాలు

image

కర్నూలు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి డా. సృజనకు అందజేశారు. బీవై రామయ్య కుటుంబం పేరిట రూ.2.98కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రామయ్యకు అప్పు రూ.30.78లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయనపై అస్పరి పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది ఒక కేసు నమోదైంది.

News April 26, 2024

కర్నూలుకి 56 నామినేషన్లు: ఆర్వో

image

నామినేషన్ల స్వీకరణకు 25వ తేదీ చివరి గడువు కావడంతో నామినేషన్లు వెల్లువలా దాఖలు అయ్యాయి. కర్నూలు ఆర్వో కార్యాలయమైన మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఒకేరోజు 21 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. నామినేషన్లు ముగిసే నాటికి మొత్తం కలిపి 56 నామినేషన్లు దాఖలు అయ్యాయని కర్నూలు మున్సిపల్ కమిషనర్, ఆర్వో ఏ.భార్గవ తేజ తెలిపారు.

News April 25, 2024

నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల నిబంధనలు ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ పరిధిలో 08514-293917, ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 08514-293910, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ అబ్జర్వర్ హిమాన్సు శంకర్, 08514-293913 నంబర్లకు ఫిర్యాదులు అందించాలని విజ్ఞప్తి చేశారు.

News April 25, 2024

పాణ్యం అభ్యర్థిగా నిరుద్యోగి నామినేషన్

image

పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిరుద్యోగి అయ్యన్న నామినేషన్ వేశారు. రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP) తరఫున ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారమే ఎజెండాగా ప్రజల ముందుకు వస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

News April 25, 2024

కుంభోత్సవం వేడుకలకు ముస్తాబవుతున్న శ్రీశైలం

image

కుంభోత్సవం సందర్భంగా శ్రీశైలం ఆలయం ముస్తాబవుతుంది. ఈ మేరకు శ్రీశైలం ఆలయ ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇప్పటికే కుంభోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆలయాన్ని వివిధ రకాల ద్రవ్యాలతో విశేషంగా అలంకరిస్తున్నారు. ఆలయ పరిధిలో పక్షి, జంతుబలులు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

News April 25, 2024

కడిమెట్లలో 40 ఏళ్ల తర్వాత తొలిసారి ప్రచారం

image

ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల MLA చెన్నకేశవ రెడ్డి స్వగ్రామం. 40 ఏళ్లుగా ఈ ఊరును MLA తన కంచుకోటగా మార్చుకున్నారు. ఇక్కడ ప్రతిసారి ఏకపక్షంగా ఓట్లు పడేవి. ఈ ఊరిలో ప్రత్యర్థులు ప్రచారం చేసేవాళ్లు కాదు. దాదాపు 40 ఏళ్ల తర్వాత తొలిసారి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవీ జయనాగేశ్వర రెడ్డి ఆ గ్రామంలో ప్రచారం చేశారు. కడిమెట్లతో పాటు పరిసర గ్రామాల్లో 12 వేల ఓట్లు ఉండగా.. ఈసారి ఓటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది.

News April 25, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కర్నూలు ఎస్పీ జీ.కృష్ణకాంత్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా చేసుకుని విధులు నిర్వహించాలని ఆదేశించారు. కొత్త వ్యక్తులు వస్తే ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు.

News April 25, 2024

రేపు శ్రీశైలంలో కుంభోత్సవం

image

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా క్షేత్రంలో శుక్రవారం కుంభోత్సవం నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. భ్రమరాంబ దేవికి సాత్విక బలి, స్వామివారికి అన్నాభిషేకం, కుంభ హారతి, (స్త్రీ వేషంలో పురుషులు అమ్మవారికి హారతి) సమర్పిస్తారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం, ఏకాంత సేవ, అన్ని ఆర్జిత సేవలు నిలుపివేశారు.

News April 25, 2024

కర్నూలు: రానున్న మూడు రోజులు భగ భగలే..!

image

రానున్న రెండు, మూడు రోజుల పాటు 46-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. బుధవారం మహానందిలో 44.2 డిగ్రీలు, బనగానపల్లె, డోన్‌లో 44.1, కోడుమూరులో 43.9, కర్నూలులో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంత్రాలయం, కోడుమూరు, గూడూరు, దేవనకొండ, డోన్, చాగలమర్రి, గడివేముల, దొర్నిపాడు, రుద్రవరం మండలాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.

News April 25, 2024

కర్నూలు: కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదల

image

కర్నూలు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను బుధవారం డీసీసీ అధ్యక్షుడు కే.బాబురావు విడుదల చేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా షేక్ జిలానీ బాషా, ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎం.కాశీం వలి, మంత్రాలయం అసెంబ్లీ స్థానానికి పీఎస్ మురళీకృష్ణ రాజు పేర్లను ఖరారు చేసినట్టు ఆయన వెల్లడించారు.