Kurnool

News April 25, 2024

వైసీపీ కర్నూలు పార్లమెంట్ పరిశీలకుడిగా గోరంట్ల మాధవ్

image

వైసీపీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కురువ సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను ఇప్పటికే ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా నియమించింది. తాజాగా ఇదే సామాజిక వర్గానికి చెందిన మాధవ్‌ నియామకంతో పార్టీకి కలిసి వస్తుందని అధిష్ఠానం భావిస్తోంది.

News April 25, 2024

కర్నూలు: నిరుద్యోగి నామినేషన్ దాఖలు

image

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బోయ రంగస్వామి అనే నిరుద్యోగి బుధవారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రంగస్వామి మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్ష పార్టీలు అవలంబిస్తున్న నిరుద్యోగ విధానాలకు వ్యతిరేకంగా యువత నడుం బిగించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేసినట్లు తెలిపారు. యువత మేలుకోవాలని, భవిష్యత్తును మనమే మార్చుకోవాలని అన్నారు.

News April 25, 2024

రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ ఎలక్షన్ కోఆర్డినేటర్‌గా జై కాంత్

image

రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాల ఎలక్షన్ కోఆర్డినేటర్ల బృందంలో జిల్లాకు చెందిన ఎస్.జై కాంత్‌ను నియమించినట్లు YCP కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొంది. క్రిస్టియన్ మైనార్టీ వ్యవహారాలు ఎలక్షన్ నిబంధనలో వ్యవహరించాల్సిన తీరును కోఆర్డినేటర్లు పరీక్షిస్తారని తెలిపింది. ఈ బృందంలో ఐదుగురు రాష్ట్రస్థాయి సభ్యులు ఉన్నారు.

News April 25, 2024

26న స్క్రూటినీ ప్రక్రియకు హాజరు అవ్వండి: జేసీ

image

ఈ నెల 26న జరిగే నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియకు రాజకీయ పార్టీ ప్రతినిధులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలని పాణ్యం రిటర్నింగ్ అధికారి/జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్‌లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

News April 25, 2024

కర్నూలు జిల్లాలో 180 నామినేషన్లు దాఖలు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లాలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. తొలి రోజు నుంచి నేటి వరకు జిల్లాలోని పార్లమెంట్‌తో పాటు 8 నియోజకవర్గాలకు 180 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలిపారు. పాణ్యం, కర్నూలు, కోడుమూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సంబంధించి 161 మంది అభ్యర్థులు 180 నామినేషన్ పత్రాలను అందజేశారన్నారు.

News April 25, 2024

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టో విడుదల

image

సూపర్ రేంజర్స్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర బుధవారం విడుదల చేశారు. కుటుంబానికి రూ.లక్ష, యువతులకు మొబైల్ ఫోన్, మహిళలకు కొత్త గ్యాస్ కనెక్షన్, యువకులకు ఉచితంగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వారికి రూ.2 లక్షల అందజేస్తామన్నారు. కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించిన 5 ఏళ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.

News April 25, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా విధులు నిర్వహించాలని
సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

News April 25, 2024

కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తి విలువ రూ.278.27 కోట్లు

image

కర్నూలు టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. టీజీ భరత్ మెుత్తం ఆస్తుల విలువ రూ.278.27 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరస్తుల విలువ రూ.83.08కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.195.19 కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు రూ.19.38 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

News April 25, 2024

పాణ్యంలో గెలుపునకు వారే కీలకం

image

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్‌లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.

News April 25, 2024

REWIND: ఆలూరు ఏకైక మహిళా ఎమ్మెల్యే నీరజారెడ్డి

image

ఆలూరు నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఎన్నికయ్యారు. 1955 నుంచి 2019 వరకు ఎన్నికల వరకు అందరూ పురుషులే ఎమ్మెల్యేలు కాగా నీరజారెడ్డి మాత్రమే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంపై విజయం సాధించారు. 2004లో మసాల పద్మజ, 2014లో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్, 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు