Kurnool

News April 25, 2024

కాటసాని కుటుంబం పేరిట 245.6 ఎకరాల భూమి

image

కాటసాని రాంభూపాల్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.75.19 కోట్లుగా నామినేషన్ అఫిడవిట్‌లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కుటుంబం మెుత్తం చరాస్తుల విలువ రూ.26.95 కోట్లు, స్థిరాస్తులు విలువ రూ.48.24 కోట్లు.. అప్పులు రూ.3.01కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భూమి ఎకరాల్లో కాటసాని పేరుతో 10.87, ఆయన సతీమణికి 164.33, కుమారుడు, కుమార్తెల పేరిట 70.40 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాటసానిపై ఒక్క కేసు ఉంది.

News April 25, 2024

39 మంది అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల ఎంపీ స్థానానికి మంగళవారం నలుగురు, అసెంబ్లీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు నలుగురు, ఆళ్లగడ్డకు ఆరుగురు, శ్రీశైలానికి ఆరుగురు, నందికొట్కూరుకు నలుగురు, నంద్యాలకు 11 మంది, బనగానపల్లెకు ఆరుగురు, డోన్‌కు ఇద్దరు దాఖలు చేశారన్నారు.

News April 25, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు ఎస్పీ జి. కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. సి.బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన పోలకల్, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

News April 25, 2024

కర్నూలు: రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యం

image

ఆస్పరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కోతి సతీశ్(25) స్ఠానిక రైల్వే స్టేషన్ సమీపాన రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని రైల్వే ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 25, 2024

హోం ఓటింగ్ ప్రక్రియ మే 8 లోపు పూర్తి చేయండి: కలెక్టర్

image

మే 5 నుండి 8 తేదీల్లో నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ, హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. మంగళవారం పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 24, 2024

కర్నూలు: 3 రోజులు పనికి, మరో 3 రోజులు బడికి.. టెన్త్‌లో 509 మార్కులు

image

పదో తరగతి ఫలితాల్లో చిప్పగిరి మండలం బంటనహాల్‌కు చెందిన నవీన అనే విద్యార్థిని 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా ఇవే అత్యధిక మార్కులు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక నవీన వారంలో 3 రోజులు కూలీ పనులకు, మరో 3 రోజులు పాఠశాలకు వెళ్లేదని స్థానికులు తెలిపారు. నవీన తండ్రి వ్యవసాయ కూలీ కాగా, ఆమె తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని తెలిపారు.

News April 24, 2024

సాయి ప్రసాద్ రెడ్డి ఆస్తి వివరాలు

image

ఆదోని వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. దంపతుల ఆస్తి మెుత్తం రూ.13.77 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరాస్తి: రూ.1.85కోట్లు, స్థిరాస్తి:రూ.4.22కోట్లు, అప్పులు:రూ.1.22కోట్లు, నగదు:10.30లక్షలు ఉన్నాయి. అంతేగాక 25 తులాల బంగారం, రూ.3లక్షల విలువగల వెండి ఉన్నట్లు వెల్లడించారు. ఆయనకు వాహనం లేనట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆస్తి వివరాలు

image

డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి నామినేషన్ పత్రాలను ఆయన తరఫున ఆ పార్టీకి చెందిన లక్ష్మీనారయణ యాదవ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మహేశ్వర్ రెడ్డికి శనివారం సమర్పించారు. అఫిడవిట్‌లో కోట్ల పేరు మీద రూ.22.6కోట్లు ఆస్తులు, రూ.94.90 లక్షల అప్పు, రెండు ఇళ్లు, మూడు కార్లు, ఒక్క కేసు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన భార్య కోట్ల సుజాతమ్మ పేరపై రెండు కార్లు, 40 తులాల బంగారం, రూ.1.28 లక్షల నగదు ఉంది.

News April 24, 2024

కర్నూలు: 3రోజులు బడికి వెళ్లి 509 మార్కులు

image

చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వనూరమ్మల కుమార్తె బోయ నవీన పదో తరగతిలో 509 మార్కులు సాధించింది. తండ్రి వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఇంటి పరిస్థితుల కారణంగా వారంలో మూడు రోజులు కూలీ పనులకు వెళ్తూ.. మూడు రోజులు బడికి వెళ్లేది. చిప్పగిరి ఉన్నత పాఠశాలలో చదివి 509 మార్కులు సాధించింది.

News April 24, 2024

నంద్యాల: 596 మార్కులు సాధించిన విద్యార్థిని

image

నందికొట్కూరు ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ బాష కూతురు షేక్ రోషిని టెన్త్ పరీక్ష ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించింది. పరిక్షల ఫలితాల్లో 600కు గాను 596 మార్కులు సాధించి తన ప్రతిభ కనబరిచింది. తన కుతూరు ఈ మార్కులు సాధించడం గర్వకారణమని కుటుంబ సభ్యుడు రఫీ అహ్మద్ ప్రకటనలో తెలిపారు.