Kurnool

News April 20, 2024

కర్నూలు: విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై తాయప్ప(35) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పత్తికొండ పట్టణ శివారులోని రామకృష్ణారెడ్డి నగర్లో శనివారం జరిగింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షపు నీటిని తాయప్ప తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగకు తగిలాడని స్థానికులు తెలిపారు. దీంతో అతడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 20, 2024

సంజామలకు పిడుగుల హెచ్చరిక: APSDMA

image

సంజామల మండల వ్యాప్తంగా మరి కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, టవర్లు, పోల్స్, పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని APSDMA స్పష్టం చేసింది.

News April 20, 2024

కర్నూలు ఎంపీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్

image

కర్నూలు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా విజయభాస్కర్ రెడ్డిపోగు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. కర్నూలు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి/జిల్లా కలెక్టర్ డా జి.సృజన సంబంధిత నామినేషన్ పత్రాలను పరిశీలించారు. అనంతరం స్వతంత్ర అభ్యర్థి విజయభాస్కర్ రెడ్డిపోగు చేత జిల్లా ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు.

News April 20, 2024

ఫార్మ్-6, 8లను 22వ తేదిలోపు పరిష్కరించాలి: కలెక్టర్

image

పోలింగ్ కేంద్రాల్లో పీడబ్ల్యూడీ, సీనియర్ సిటిజన్ ఓటర్లు క్యూలో వేచి ఉండకుండా ఓటు వేసేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. జి.సృజన రిటర్నింగ్ అధికారులను అదేశించారు. శనివారం పోలింగ్ కేంద్రాల్లో కల్పించాల్సిన మౌలిక వసతులు, ఫార్మ్ డిస్పోజల్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫార్మ్-6, 8ను 22వ తేదిలోపు పరిష్కరించాలన్నారు.

News April 20, 2024

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బేతంచెర్ల చిన్నారికి చోటు

image

బేతంచెర్లకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గుండా గోపాల్ మనుమడు గుండా ఆయాన్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. 4వ తరగతి చదువుతున్న ఆయాన్ 100 నుంచి ఒకటి వరకు వెనక వైపు నుంచి అంకెలను 37 సెకండ్లలో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువురు అభినందించారు.

News April 20, 2024

కుంభోత్సవం సందర్భంగా జీవహింస పూర్తిగా నిషేధం: ఈవో పెద్దిరాజు

image

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఏప్రిల్ 26న కుంభోత్సవం సందర్భంగా జంతు, పక్షి బలులు, జీవహింస పూర్తిగా నిషేధమని ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈమేరకు పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులకు సూచించారు. నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని దేవస్థానం తరపున పూర్తి సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సున్నిపెంటలో రెండు రోజులు పాటు మద్యం షాపుల బంద్‌కు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తామన్నారు.

News April 20, 2024

కర్నూలు: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

image

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీనడంతో మహిళ మృతి చెందిన ఘటన శంషాబాద్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కర్నూలు బృందావన్ కాలనీకి చెందిన తల్లీకూతురు మాలతి, మౌలిక ఓ ఎలక్ట్రికల్ కారు అద్దెకి తీసుకొని HYDకి వచ్చారు. గచ్చిబౌలి నుంచి వస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై హమీదుల్లానగర్ శివారులో ప్రమాదం జరిగింది. మాలతి మృతి చెందగా.. మౌలిక, డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 20, 2024

నంద్యాల: పిడుగుపాటుతో ఒకరి మృతి

image

గడివేముల మండలం చిందుకూరు గ్రామ సమీపంలోని పంట పొలాల్లో గొర్రెలను మేపుకుంటున్న గొర్రెల కాపరి శేఖర్ పిడుగుపాటుకు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. ఆయన మండలంలోని డోన్ గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. దీంతోపాటు గడిరేవుల గ్రామంలో పిడుగుపాటుకు గురై 25 గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News April 20, 2024

కంగాటి శ్రీదేవి ఆస్తి వివరాలు

image

పత్తికొండ వైసీపీ ఎమ్మల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అఫిడవిట్‌లో తన ఆస్తి వివరాలను వెల్లడించారు. 2019లో రూ.3.06 కోట్ల స్థిర, చరాస్తులను చూపిన ఆమె ఈసారి రూ.2.55 కోట్ల సాగుభూమి, రూ.66 లక్షల విలువైన ఇళ్ల స్థలాలు చూపారు. ఆమెకు హైదరాబాద్‌లో ఇల్లు, కర్నూలు, వెల్దుర్తిలో ఇళ్ల స్థలాలు ఉన్నాయి. రూ.3.94 కోట్ల అప్పు చూపారు. తనకు వ్యవసాయం ద్వారా తప్ప వేరే వనరుల ద్వారా ఆదాయం లేదని పేర్కొన్నారు.

News April 20, 2024

నంద్యాల: జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు

image

నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం తేలికపాటి వర్షం కురిసింది. మహానంది పుణ్యక్షేత్రం పరిధిలో చిరుజల్లులు పడ్డాయి. కొలిమిగుండ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే ఆళ్లగడ్డ, రుద్రవరం, శ్రీశైలంలో ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన జిల్లా ప్రజలు సాయంత్రం చినుకులు, చలిగాలులు రావడంతో ఊపిరిపీల్చుకున్నారు.