Kurnool

News April 20, 2024

నంద్యాల: నాడు ప్రత్యర్ధులు.. నేడు మిత్రులు

image

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు.. తాత్కాలికమే అనే వ్యాఖ్యకు ఈ చిత్రం దర్శనం ఇస్తుంది. రెండు దశాబ్దాలుగా రాజకీయ ప్రత్యర్ధులు ఒక్కటాయిన దృశ్యం ఇది. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా, ఏరాసు కుటుంబాల మధ్య రాజకీయ పోరు నడిచింది. 1994లో బుడ్డావెంగళరెడ్డి ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీ ప్రారంభమైంది. 1999, 2004, 2009లో పోటీపడ్డగా 3సార్లు కాంగ్రెస్ తరపున ఏరాసు ప్రతాప్‌రెడ్డి గెలుపొందారు.

News April 20, 2024

మహానందిలో ఘనంగా స్వామి అమ్మవార్ల పల్లకి సేవ

image

మహానంది క్షేత్రంలో శుక్రవారం రాత్రి పల్లకి సేవను ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి, ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో మేళతాళాలతో పల్లకి సేవ నిర్వహించారు. ఈ పల్లకి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.

News April 19, 2024

కుంభోత్సవం “క్షేత్ర రక్షణ” కోసం నిర్వహించే ఉత్సవం : ఈవో

image

శ్రీశైల క్షేత్రంలో ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తున్నట్లు, ఈ కుంభోత్సవం “క్షేత్ర రక్షణ” కోసం నిర్వహించే ఉత్సవం అని ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. కుంభోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక రెవెన్యూ, పోలీస్, దేవస్థాన శాఖాధిపతులు, అన్ని విభాగాల పర్యవేక్షకులు, దేవస్థాన వైదిక సిబ్బంది తదితర అధికారులతో శుక్రవారం ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలను చర్చించారు.

News April 19, 2024

నంద్యాల: జిల్లాలో రెండో రోజు ఆరుగురు నామినేషన్లు

image

నామినేషన్లలో భాగంగా రెండో రోజైన శుక్రవారం జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. అందుకు సంబంధించిన పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని జిల్లా ఎన్నికల అధికారి, డా.కె. శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. నంద్యాల పార్లమెంట్, ఆళ్లగడ్డ, డోన్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఎవరు వేయలేదని తెలిపారు.

News April 19, 2024

కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తుల విలువ ఎంతంటే..?

image

కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, ఆయన భార్య జయసుధ గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. నాగరాజు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన
అఫిడవిట్‌లో తన చర, స్థిరాస్తుల వివరాలను ప్రకటించారు. తనకు, తన భార్యకు కలిపి మొత్తం రూ.8,54,79,900 స్థిర, చరాస్తులు ఉన్నాయని
అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 19, 2024

ముఖ్య మంత్రులను అందించిన డోన్ గడ్డ

image

డోన్ రాష్ట్ర రాజకీయాల కేంద్ర బిందువుగా ఉన్న డోన్ గడ్డ ఇద్దరు ముఖ్యమంత్రులను అందించింది. 1952 సంవత్సరంలో డోన్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నీల సంజీవ రెడ్డి గెలుపొంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డోన్ నుంచి ఎన్నికైన నీల సంజీవరెడ్డి పనిచేశారు. అలాగే 1994 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం హోదాలో డోన్ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన డోన్ ఎమ్మెల్యే

News April 19, 2024

ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థికి రూ.77.82 లక్షల అప్పులు

image

➤ నియోజకవర్గం: ఎమ్మిగనూరు
➤ అభ్యర్థి: బీవీ జయనాగేశ్వరరెడ్డి ( టీడీపీ)
➤చరాస్తుల విలువ : రూ.1.42 కోట్లు
➤స్థిరాస్తుల విలువ: రూ.3.85 కోట్లు
➤బంగారం : 200 గ్రాములు
➤పొలాలు: 22.97 ఎకరాలు
➤ కేసులు:3
➤ అప్పులు: రూ.77.82 లక్షలు

News April 19, 2024

నంద్యాల జిల్లాలో షర్మిల పర్యటన

image

నంద్యాల పట్టణంలో ఈనెల 21వ తేదీన వైఎస్ షర్మిల పర్యటించనున్నట్లు ఆ పార్టీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పట్టణంలో రోడ్ షో, బహిరంగ సభ ఉంటుందన్నారు.

News April 19, 2024

చాగలమర్రి : రైతులకు రూ.2.34 కోట్ల టోకరా

image

చాగలమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన ఓ విత్తనాల వ్యాపారి రైతులకు కుచ్చుటోపి పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి మినుములు, మొక్కజొన్న తదితర విత్తనాలను, రూ.2.34 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు వాపోతున్నారు. రైతులకు ఐపీ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

News April 19, 2024

బుట్టా రేణుక ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థికంగా అంతంత మాత్రమే నని సీఎం జగన్ ఓ సభలో అన్నారు. అయితే ఆమె అఫిడవిట్ లో పేర్కొన్న ఆస్తి వివరాలు మాత్రం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఆమె భర్త శివ నీలకంఠ పేరిట చరాస్తులు రూ.141.46 కోట్లు, స్థిరాస్తులు రూ.18.75 కోట్లు ఉన్నాయి. అప్పులు రూ.7.82 కోట్లు ఉన్నాయి. కాగా 2014లో వీరి ఆస్తుల విలువ రూ. 242.60 కోట్లు ఉండేది.