Kurnool

News April 15, 2024

రేపు కోసిగిలో బాలకృష్ణ పర్యటన

image

రేపు కోసిగిలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించనున్నారని జిల్లా TDP అధ్యక్షులు BT నాయుడు తెలిపారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా ఈనెల 16న సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా TDP అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని రాఘవేంద్ర రెడ్డి తెలిపారు.

News April 15, 2024

జగన్‌కు ఉమ్రాహ్ నీళ్లు, ఖర్జూర అందజేసిన ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

image

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉమ్రాహ్ (మక్కా) యాత్ర వెళ్లొచ్చిన సందర్భంగా సీఎం జగన్‌‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. పవిత్రమైన మక్కా జమ్-జమ్ నీళ్లు, ఖర్జూర ఇచ్చి జగన్‌కు అల్లాహ్ దీవెనలు ఉండాలని ప్రత్యేక దువా చేశారు. జగన్‌‌పై దాడి అనంతరం కేసరపల్లి క్యాంప్‌ వద్ద ముఖ్య నాయకులు ఆయనను కలిశారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. పెత్తందారుల కుట్రలను ఛేదించడానికి మళ్లీ జనంలోకి జగన్ వచ్చారన్నారు.

News April 15, 2024

17న శ్రీశైలంలో సీతారాముల కళ్యాణం

image

శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని శ్రీశైలం ఆలయంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ఈనెల 17వ తేదీన సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం ఈవో పెద్దిరాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. కళ్యాణోత్సవానికి ముందుగా లోక క్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్పం పఠించి గణపతి పూజ, గౌరీ పూజ, మాంగల్య పూజ, సీతారాముల కళ్యాణం ఉంటుందన్నారు.

News April 15, 2024

నేడు నందికొట్కూరులో బాలకృష్ణ రోడ్ షో

image

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నందికొట్కూరులో ఇవాళ సాయంత్రం 4 గంటలకు పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర’ పేరుతో ఆయన రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య, పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు కోసం నందికొట్కూరులో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అనంతరం కర్నూలులో పర్యటిస్తారు.

News April 15, 2024

కర్నూలు: గుండెపోటుతో మహిళ మృతి

image

క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామ పంచాయతీ మాదాపురంలో మాదిగ జమ్మక్క గుండెపోటుతో మృతి చెందారు. ఆమె భర్త గిడ్డన్న తెలిపిన వివరాల మేరకు.. నిన్న రాత్రి నిద్రపోవడానికి ముందు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పిందని, ఉదయం పలకరించినా మాట్లాడకపోవడంతో దగ్గరకు వెళ్లి చూడగా మృతిచెంది ఉందని తెలిపారు. జమ్మక్కకు నలుగురు కూతుర్లు ఉన్నారు.

News April 15, 2024

మొదట కర్నూలు ఎమ్మెల్యేగా ప్రకటన.. తరువాత పాణ్యానికి మార్పు

image

ఇండియా కూటమిలో భాగంగా పాణ్యం నుంచి సీపీఎం అభ్యర్థి గౌస్ దేశాయ్‌ని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా మొదట కర్నూలు సీటును సీపీఎంకు కేటాయించారు. దీంతో గౌస్ దేశాయ్ కర్నూలు నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. తరువాత కొన్ని చర్చల అనంతరం కర్నూలు టికెట్ కాంగ్రెస్ తీసుకుని పాణ్యం సీటు సీపీఎంకు కేటాయించింది. దీంతో సీపీఎం నేతలు ప్రచారం ముమ్మరం చేయనున్నారు.

News April 15, 2024

కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి తిక్కారెడ్డి

image

టీడీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడిగా మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు నియమించినట్లు తెలిపారు. కాగా తిక్కారెడ్డి మంత్రాలయం టికెట్ ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. టికెట్ దక్కని వారికి ఈ అవకాశాలు కల్పించారు.

News April 15, 2024

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద బాలకృష్ణ ప్రసంగం

image

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈనెల నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వెల్లడించారు. నేడు కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ ఆటో స్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కొండారెడ్డి బురుజు వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రికి కర్నూలులోనే బస చేసి, 16న ఎమ్మిగనూరులో సాయంత్రం 4 గంటలకు, కోసిగిలో సాయంత్రం 6 గంటలకు ప్రసంగిస్తారని వివరించారు.

News April 15, 2024

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీనాక్షి నాయుడు నియామకం

image

ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడిని టీడీపీ అధిష్ఠానం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించింది. దీంతో ఆ పార్టీ మైనార్టీ నాయకుడు ఇంతియాజ్ బాషా హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో కొనసాగుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారన్నారు. ఆయన సేవలను పార్టీ మరింతగా ఉపయోగించుకునేందుకు ఉపాధ్యక్షుడిగా నియమించడం పట్ల టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు.

News April 15, 2024

విద్యార్థినీ నిర్మలను అభినందించిన కర్నూలు కలెక్టర్

image

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో పేదరికంలో పుట్టి, బాల్య వివాహంను ఎదిరించి అధికారుల సహకారంతో ఇంటర్ టాపర్‌గా నిలిచిన నిర్మలను ఆదివారం జిల్లా కలెక్టర్ సృజన అభినందించారు. కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆస్పరి మండలం కేజీబీవీ కళాశాల విద్యార్థిని నిర్మల తన కుటుంబ సభ్యులతో కలెక్టర్‌ను కలిశారు. ఇంటర్మీడియట్ బైపీసీ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల్లో నిర్మల టాపర్‌గా నిలవడం అభినందనీయమన్నారు.