Kurnool

News April 14, 2024

కర్నూలు: టీడీపీ ఎన్నికల సమన్వయకర్తలను వీరే

image

రానున్న ఎన్నికల్లో నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. అందులో భాగంగా కర్నూల్ పార్లమెంట్‌కు జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, నంద్యాల నియోజకవర్గానికి ఏరాసు ప్రతాపరెడ్డి, కోడుమూరు, ఎమ్మిగనూరుకు సంజీవ్ కుమార్‌ను నియమించింది. ఆలూరు, పత్తికొండలకు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆళ్లగడ్డకు కేవీ సుబ్బారెడ్డిలు ఉన్నారు.

News April 14, 2024

గొడవలు జరిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి: నంద్యాల ఎస్పీ

image

నంద్యాల జిల్లాలో ఎక్కడైనా అల్లర్లు, గొడవలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏదైనా ప్రమాదంలో ఉంటే అత్యవసర పోలీసు సేవలు పొందాలనుకునే వారు వెంటనే 08514-225097 నంబరుకు ఫోన్ చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. పై నంబర్లో పోలీసు అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు.

News April 14, 2024

రేపు, ఎల్లుండి కర్నూలు జిల్లాలో బాలకృష్ణ పర్యటన: బీటీ నాయుడు

image

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈనెల 15, 16వ తేదీలలో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు వెల్లడించారు. 15న కర్నూలులోని కిమ్స్ హాస్పిటల్ ఆటో స్టాండ్ నుంచి ర్యాలీ ప్రారంభమై కొండరెడ్డి బురుజు వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాత్రికి కర్నూలులోనే బస చేసి, 16న ఎమ్మిగనూరులో సాయంత్రం 4 గంటలకు, కోసిగిలో సాయంత్రం 6 గంటలకు ప్రసంగిస్తారని వివరించారు.

News April 14, 2024

చంద్రబాబు, లోకేశ్‌ ప్రోద్బలంతోనే సీఎంపై దాడి: విరుపాక్షి

image

చంద్రబాబు, లోకేశ్‌ ప్రోద్బలంతోనే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగిందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి ఆరోపించారు. ఆదివారం ఆలూరులో అయన విలేకర్లతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరగడం దారుణమని, ప్రతిపక్ష నాయకులు ఓటమి భయాన్ని తట్టుకోలేక దాడులకు పాల్పడ్డారని అన్నారు. మరొకసారి వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెడతారని ధీమా వ్యక్తం చేశారు.

News April 14, 2024

అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దాం: కలెక్టర్

image

రాజ్యాంగ స్ఫూర్తితో అంబేడ్కర్ సేవలను కొని అడుగుదామని కలెక్టర్ డా.జి.సృజన అన్నారు. భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం కర్నూలులోని పెద్ద బస్టాండ్‌లో ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువతరం అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధికి కృషి చేయాలన్నారు.

News April 14, 2024

కర్నూలు: 27 దరఖాస్తుల తిరస్కరణ

image

కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి డాక్యుమెంటేషన్ సరిగా లేనందున ప్రచార అనుమతుల కోసం వచ్చిన వాటిలో 27 దరఖాస్తులను తిరస్కరించినట్లు నోడల్ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. మొత్తం 54 దరఖాస్తులు వచ్చాయని, 27 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. పబ్లిక్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, కరపత్రాల పంపిణీ, హోల్డింగ్‌ల ఏర్పాటు.. ఇలా 20 రకాల కార్యక్రమాలకు అనుమతులు తప్పనిసరని అన్నారు.

News April 14, 2024

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

image

వెల్దుర్తి మండల కేంద్రంలోని సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న అదే గ్రామానికి చెందిన చంద్రనారాయణ (జేఎల్ఎమ్), డోన్‌లో నివాసముంటున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ స్రవంతి శుక్రవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. శనివారం స్రవంతి తమ్ముడు, తల్లి, మరికొందరు వెల్దుర్తికి వచ్చి చంద్రనారాయణ ఇంటి వద్ద గొడవ చేశారు. దీంతో తమకు రక్షణ కల్పించాలని ఆ జంట కర్నూలు పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించింది.

News April 14, 2024

ఇంటర్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థిని

image

దేవనకొండ మండలం తెర్నెకల్‌లోని పేద కుటుంబానికి చెందిన కిరణ్, జయలక్ష్మి దంపతుల కూతురు అనూష ఆరెకల్‌లోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతోంది. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 965 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. మంచి మార్కులు సాధించి గ్రామానికి మంచి పేరు తీసుకురావడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2024

ఓటు హక్కు నమోదు చేసుకోవాలి: కలెక్టర్

image

ఓటు హక్కును నమోదు చేసుకోనివారు నమోదుకు మూడు రోజులు మాత్రమే గడువు ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి.సృజన శనివారం పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుందన్నారు. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవాలని సూచించారు.

News April 13, 2024

జాతీయ స్థాయి క్యారమ్స్ న్యాయ నిర్ణేతగా నాగేంద్ర

image

ఆల్ ఇండియా క్యారమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గత నెలలో వారణాసిలో జరిగిన జాతీయస్థాయి క్యారమ్స్ న్యాయం నిర్ణేతలు పరీక్షలో కర్నూలు జిల్లాకు చెందిన నాగేంద్ర హాజరై పరీక్షల ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా సంఘం కార్యదర్శి చెన్నకేశవరాజు తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ.. జాతీయ స్థాయి న్యాయం నిర్ణేతగా అర్హత సాధించిన రెండో జిల్లా వాసిగా గర్వకారణం ఉందన్నారు.