Kurnool

News April 13, 2024

కర్నూలు: దున్నపోతు మాంసం కోసం యువకుల ఘర్షణ

image

జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం గ్రామంలో జరిగిన కర్రెమ్మ దేవత ఉత్సవాల సందర్భంగా దేవతకు బలి ఇచ్చిన దున్నపోతు మాంసం కోసం ఇరు వర్గాలకు చెందిన యువకులు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో పదిమందికి గాయాలయ్యాయి. అందులో ఒకరు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రి వద్ద కూడా యువకులు ఘర్షణ పడటంతో పోలీసులు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.

News April 13, 2024

మహానంది కోనేరుపై పరిశోధనలు

image

మహానంది కోనేరు నీటిలో పీహెచ్ స్థాయి 7.1గా ఉందని.. ఇలా ఉండటం అరుదని ఇంటాచ్ సంస్థ జిల్లా కన్వీనర్ ఎంవీ శివకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు పరిశోధనల సర్టిఫికెట్ పత్రాలను ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డికి అందించారు. మహానంది కోనేరుకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి తమవంతు కృషి చేస్తామన్నారు. కాల్షియం కార్బోనేట్, సల్ఫర్, మెగ్నీషియం తదితర పరీక్షలు చేశామని అన్నింట్లో ప్రథమ స్థానంలో ఉందన్నారు.

News April 13, 2024

నంద్యాల: గవర్నమెంట్ స్కూల్‌లో చదివి.. జిల్లా టాపర్‌‌గా

image

నంద్యాల ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఆయేషా (2422114695) అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా టాపర్‌గా నిలిచింది. ఇంటర్మీడియట్ ఫలితాలలో CEC విభాగం నుంచి 500కు గాను 486 మార్కులు సాధించింది. ఆమె నంద్యాలలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారు.

News April 13, 2024

కర్నూలు జిల్లా KGBVలలో ఉత్తమ ఫలితాలు

image

కర్నూలు జిల్లాలో 26 KGBVలలో ప్రథమ సంవత్సరంలో 588 మంది విద్యార్థినులకు గాను 372, ద్వితీయ సంవత్సరంలో 488 మందికి గాను 358 మంది పాసయ్యారు. ఆస్పరి, దేవనకొండ, కల్లూరు, నందవరం KGBVలో 100% ఉత్తీర్ణత సాధించారు. గూడూరు KGBVలో విజయలక్ష్మి 956(MPC), కోడుమూరు KGBVలో సుమలత 963(BiPC) ప్రథమ స్థానంలో నిలిచారు. ఆస్పరి KGBVలో BiPC చదువుతున్న నిర్మల 421 మార్కులతో ప్రథమ స్థానంలో నిలవగా కలెక్టర్ సృజన అభినందించారు.

News April 13, 2024

నకిలీ కథనాలపై నిఘా ఉంచుతున్నాం: కలెక్టర్

image

సార్వత్రిక, లోక్ సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లో భాగంగా సోషల్ మీడియాలో ప్రసారమయ్యే కథనాలపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షిస్తోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి.సృజన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ కథనాల ప్రచురణ, ప్రసారం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు.

News April 13, 2024

ఇంటర్ ఫలితాలు.. నంద్యాల టాపర్‌గా ఎలక్ట్రీషియన్ కుమారుడు

image

నంద్యాల విశ్వ నగర్‌కు చెందిన గిద్దలూరు సందీప్ ఇంటర్ ఎంపీసీ మొదటి సంవత్సరం ఫలితాల్లో టౌన్ టాపర్‌గా నిలిచాడు. 460/470 మార్కులు సాధించి సత్తా చాటాడు. పదో తరగతిలో కూడా అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఇంజినీరింగ్ చదవడం తన కల అని, ఆ కలను నిజం చేసుకుంటానని తెలిపాడు. తన తండ్రి మధు బాబు ఎలక్ట్రీషియన్ పని చేస్తారని పేర్కొన్నాడు. తన తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే తన ముందున్న లక్ష్యం అని తెలిపాడు.

News April 13, 2024

కర్నూలు: ఇంటర్‌లో సత్తా చాటిన రైతు బిడ్డ అనురాధ

image

కృష్ణగిరి మండలం యాగంటి పల్లెకు చెందిన ఎరుకల శంకర్ రైతు. మొదటి కూతురు అనురాధ గతేడాది వెల్దుర్తి బాలికల హాస్టల్‌లో ఉంటూ పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం పాణ్యం మండలం నెరవాడలో గల మహాత్మ గాంధి జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల కళాశాలలో ఇంటర్‌లో చేరింది. ఫస్టియర్ బైపీసీలో 425/440 మార్కులు సాధించి మండలంలోనే మొదటి స్థానాన్ని సాధించి ప్రతిభను చాటుకుంది.

News April 13, 2024

నంద్యాల: అటెండర్ కుమార్తెకు 910 మార్కులు

image

మహానంది క్షేత్రంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న వీరయ్య ఆచారి రెండో కుమార్తె నాగలక్ష్మి ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటింది. నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న నాగలక్ష్మి ఇంటర్ బైపీసీలో 910/1000 మార్కులు సాధించింది. ఈ మేరకు మహానందీశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవిశంకర్ అవధాని, ఆలయ ఈఓ కాపు చంద్రశేఖర్ రెడ్డి, సిబ్బంది విద్యార్థిని నాగలక్ష్మిని అభినందించారు.

News April 13, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూల్ జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా ఓర్వకల్లు మండలంలోని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన పాలకొలను గ్రామాన్ని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రమైన నన్నూరు గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు.

News April 12, 2024

ఓటు వేయడం మీ హక్కే కాదు, మీ బాధ్యత కూడా: కలెక్టర్

image

జిల్లా ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని, ఓటు అనే రెండక్షరాలు దేశ చరిత్రనే మార్చేస్తుందని, ఓటు వేయడం మీ హక్కు మాత్రమే కాదని, మీ బాధ్యత కూడా అని జిల్లా కలెక్టర్ డా జి.సృజన పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆధ్వర్యంలో ‘నేను తప్పక ఓటు వేస్తాను’ అనే స్లోగన్‌తో పాటు మోడల్ ఈవిఎమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.