Kurnool

News April 12, 2024

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన నంద్యాల జిల్లా బాలికలు

image

ఇంటర్మీడియట్ ఫలితాలలో నంద్యాల జిల్లాలో బాలికల హవా కొనసాగింది. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 6,547 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 4,252 మంది ఉత్తీర్ణత సాధించి 66 శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్‌లో 5,211 విద్యార్థినులు పరీక్ష రాయగా.. 3,947 మంది ఉత్తీర్ణత సాధించి 76 శాతంతో మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశారు. రాష్ట్రస్థాయి ఫలితాల పట్టికలో నంద్యాల జిల్లా 19వ స్థానంలో నిలిచింది.

News April 12, 2024

ఇంటర్ ఫలితాలు.. కర్నూలు జిల్లాలో బాలికలదే హవా..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలలో కర్నూలు జిల్లాలో మరోసారి బాలికల హవా కొనసాగింది. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 10,037 మంది బాలికలు పరీక్షలు రాయగా.. 7,406 మంది ఉత్తీర్ణత సాధించి 74 శాతంతో మొదటి స్థానంలో నిలిచారు. సెకండ్ ఇయర్ ఫలితాలలో 8,826 విద్యార్థినులు పరీక్ష రాయగా.. 7,147 మంది ఉత్తీర్ణత సాధించి 81 శాతంతో మరోసారి విజయకేతనాన్ని ఎగురవేశారు. ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ విభాగంలో 70%, సెకండ్ ఇయర్‌లో 74 శాతంతో నిలిచారు.

News April 12, 2024

ఈవీఎంలను పరిశీలించిన నంద్యాల కలెక్టర్

image

నంద్యాల జిల్లా కేంద్రంలోని టెక్కే మార్కెట్ యార్డులో భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను అధికారులు చేపట్టారు. నియోజకవర్గాల వారిగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.

News April 12, 2024

వైసీపీకి షాక్.. టీడీపీలోకి బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి

image

శ్రీశైలం మండలంలో వైసీపీకి షాక్ తగిలింది. మండల అధ్యక్షుడు, బీసీ సంఘం కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు, బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకా గుండయ్య యాదవ్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం ఆయన గృహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి సమక్షంలో తన అనుచర గణంతో టీడీపీలో చేరారు. నియోజకవర్గం నుంచి రాజన్న భారీ మెజార్టీతో గెలుస్తారని గుండయ్య ధీమా వ్యక్తం చేశారు.

News April 12, 2024

కర్నూల్: జగన్ సమక్షంలో వైసీపీలోకి ప్రకాశ్‌రెడ్డి

image

మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈయనతో పాటు కోట్ల హరిచక్రపాణి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ మసాల పద్మజ, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఏపీ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్ తదితరులు సైతం ఇదే దారిలో నడిచారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.  

News April 12, 2024

ఇంటర్ ఫలితాల్లో కర్నూల్, నంద్యాల జిల్లా స్థానాలు

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కర్నూల్ జిల్లా 68% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 10వ స్థానంలో, నంద్యాల 59% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 19818 మందికి 13394 మంది.. నంద్యాలలో 12022 మందికి 7102 మంది పాసయ్యారు. సెకండియర్లో కర్నూల్ 76% ఉత్తీర్ణతతో 12వ స్థానం, నంద్యాల జిల్లా 70% ఉత్తీర్ణతతో 19వ స్థానంలో నిలిచింది. కర్నూలులో 17294 మందికి 13210 మంది, నంద్యాలలో 9165 మందికి 6429 మంది పాసయ్యారు.

News April 12, 2024

రోడ్డు ప్రమాదంలో దంపతులు స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కొత్త పల్లె సమీపంలో గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాలకు చెందిన గంగావరపు రాజగోపాల్ రెడ్డి కుటుంబంతో గుంటూరులో ఉంటున్నాడు. బ్యాంక్ పనుల నిమిత్తం నంద్యాలకు వెళుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు గుంటూరు-కర్నూల్ జాతీయ రహదారిపై చెట్టును ఢీకొంది. ప్రమాదంలో రాజగోపాల రెడ్డి, లక్మీ దేవి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 12, 2024

కర్నూల్ జిల్లాలో ఇంటర్ ఫలితాల కోసం 47,412 మంది వెయిటింగ్

image

ఏపీ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను శుక్రవారం ఉ.11 గంటలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా 47,412 మంది విద్యార్థులు భవితవ్యం నేడు తేలనుంది. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 22,239 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు 25,173 మంది ఉన్నారు.

News April 12, 2024

నంద్యాల: 33 ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రత్యర్థులు.. గెలుపు ఖాయమేనా?

image

ప్రత్యర్థులు భూమా, ఇరిగెల కుటుంబాలు ఒక్కటయ్యాయి. 1992 ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి పోటీచేశారు. జమ్మలమడుగు MLA శివారెడ్డి, NMD ఫరూక్‌ మధ్యవర్తిత్వంతో ఇరిగెల కుటుంబం నాగిరెడ్డి విజయానికి కృషిచేసింది. ఆ 2 కుటుంబాల కలయితో గెలుపు నల్లేరుపై నడకగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఏకమవ్వడంతో అఖిలప్రియ గెలుపు సులభమేనని అంచనా వేస్తున్నారు.

News April 12, 2024

రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న సినీ నటుడు సుమన్

image

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని గురువారం సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించారు. అనంతరం శ్రీ మఠం రథోత్సవంలో సుమన్ పాల్గొన్నారు. శ్రీ మఠం పీఠాధిపతులు సుమన్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు.