Kurnool

News April 11, 2024

వైసీపీలోకి కోట్ల హరి చక్రపాణి రెడ్డి..?

image

దేవనకొండ మాజీ జడ్పీటీసీ సభ్యులు కోట్ల హరి చక్రపాణి రెడ్డి ఐదేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆలూరు నియోజకవర్గంలో ప్రాధాన్యత నెలకొంది. 12న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం. కోట్ల హరికి ఆలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.

News April 11, 2024

కర్నూల్ నగరంలో చిన్నారుల రంజాన్ వేడుకలు

image

కర్నూలులో గురువారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని ఆయా మసీదుల దగ్గరకు ముస్లింలు చేరుకొని ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని సమైక్యత భావాన్ని చాటుకున్నారు. రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో పాత సంతోష్ నగర్‌లోని కొత్త ఈద్గా వద్ద చిన్నారుల రంజాన్ ప్రార్థనలు పలువురిని ఆకట్టుకున్నాయి.

News April 11, 2024

ఇనుప రథం ప్రభ లాగడమే ప్రమాదానికి కారణమా?

image

కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉగాది పర్వదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రభ లాగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రతి ఏడాది చెక్క రథంతో చేసి ప్రభ లాగేవారు. ఈ ఏడాది మాత్రం ఇందుకు భిన్నంగా ఇనుప రథంతో చేసిన ప్రభ లాగడంతో హైటెన్షన్ వైర్లు తగలి రథంపై ఉన్న సుమారు 17 మంది చిన్నారులు విద్యుత్ షాక్‌కు గురయ్యారు.

News April 11, 2024

జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర అనుసరణీయం: కలెక్టర్

image

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర అనుసరణీయమని కలెక్టర్ డాక్టర్ జి.సృజన అన్నారు. గురువారం ఆయన జయంతిని పురస్కరించుకుని కర్నూలులోని శరీన్ నగర్‌లో ఉన్న పూలేతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు విశేష కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.

News April 11, 2024

BPL: రెండు బైకులు ఢీ .. ఒకరి మృతి

image

బనగానపల్లె పట్టణంలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైనట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. చాగలమర్రి మండల కేంద్రానికి చెందిన జమాల్ బాషా(27) పని నిమిత్తం బైక్‌పై బనగానపల్లెకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో, ఎదురుగా వస్తున్న బైక్ ఈయన్ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో జమాల్ బాషా అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.

News April 11, 2024

కర్నూలు: రేపు ఇంటర్ ఫలితాల విడుదల

image

ఇంటర్ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 22,239, ద్వితీయ సంవత్సరం 25,173 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నెల18న ప్రారంభమైన మూల్యాంకనం అదేనెల 31వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల ఈనెల 4వ తేదీతో ఈ కార్యక్రమం ముగిసింది.

News April 11, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్ సృజన

image

పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సృజన నోడల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో పోలింగ్ రోజున కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

News April 10, 2024

264 మంది వాలంటీర్ల రాజీనామాలకు ఆమోదం: కలెక్టర్ సృజన

image

జిల్లా వ్యాప్తంగా 11 మండలాలకు చెందిన 264 మంది వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించినట్లు కలెక్టర్ డాక్టర్ సృజన బుధవారం తెలిపారు. అత్యధికంగా క్రిష్ణగిరి మండలంలో 59 మంది, మద్దికేర మండలంలో 48, వెల్దుర్తిలో 37, పత్తికొండలో 32, తుగ్గలిలో 23, ఆదోనిలో 5, అత్యల్పంగా ఆస్పరి, కర్నూలు మండలాలకు చెందిన వాలంటీర్లు రాజీనామా చేశారన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 

News April 10, 2024

TDP తీర్థం పుచ్చుకున్న ఇక్బాల్

image

ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన మహ్మద్ ఇక్బాల్ TDP తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవాళ ఆయన TDPలో చేరారు. ఇక్బాల్ కు పసుపు కండువా కప్పి చంద్రబాబు తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. కాగా అనంతపురం (D) హిందూపురం MLA టికెట్ ను CM జగన్ దీపికకు కేటాయించడంతో అసంతృప్తితో ఉన్న ఆయన YCPకి గుడ్ బై చెప్పారు.

News April 10, 2024

కర్నూలు జిల్లాలో ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేదెవరు..?

image

ముస్లిం ఓటర్లను ఆకర్షించేందుకు YCP, TDP అధినేతలు జగన్, చంద్రబాబు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే ముస్లిం ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారనేది జూన్ 4న తేలనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధిక ముస్లిం ఓటర్ల కలిగిన నియోజకవర్గాల్లో.. కర్నూలు-85,000,
నంద్యాల-70,000, ఆదోని, పాణ్యం, ఆళ్లగడ్డ-50,000, శ్రీశైలం-47,000, బనగానపల్లె, నందికొట్కూరు-40,000, కోడుమూరు, ఎమ్మిగనూరు-32,000, డోన్-30,000 ఉన్నారు.