India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అక్టోబర్ 4న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మిగనూరు MLA జయ నాగేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. 10వ తరగతి, ఇంటర్, బీటెక్, డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మహాత్మ గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శమని కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో మహాత్మ గాంధీ, భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి, శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించి చరిత్రలో జాతిపితగా నిలిచారన్నారు.
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను విహాయ యాత్రలకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. రొటీన్ లైఫ్ నుంచి వెరైటీ కోరుకునే వారికి మన జిల్లాలోనే ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అవి.. శ్రీశైలం, మహానంది, అహోబిళం, మంత్రాలయం, యాగంటి, యల్లర్తి దర్గా, నందవరం చౌడేశ్వరి దేవి దేవాలయం, బెలుం గుహలు, ఓర్వకల్ రాక్ గార్డెన్, సంగమేశ్వరం ఆలయం, సన్ టెంపుల్, ఓంకారం క్షేత్రం.
భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
#GandhiJayanti
భారత స్వాతంత్ర్యోద్యమ సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ 1921, 1929లో కర్నూల్ జిల్లాలో పర్యటించారు. 1921 SEP 29న తొలిసారి రైలులో కర్నూలు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో మహాత్ముడి ఉపన్యాసాలు లక్షలాది మందిలో ఉద్యమ స్ఫూర్తిని నింపాయి. స్వరాజ్య నిధికి భారీ విరాళాలు అందజేశారు. అప్పట్లో జనాలను ఉద్దేశించి హిందీలో ప్రసంగించగా ఆయన ఉపన్యాసాన్ని కొండా వెంకటప్పయ్య పంతులు తెలుగులో అనువాదం చేశారు.
#GandhiJayanti
గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుపై కలెక్టర్ రాజకుమారి మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్‌కు సంబంధించి షెడ్యూల్ కులాల హక్కులకు భంగం కలగకుండా డివిజనల్ కమిటీ సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.
బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో త్వరలోనే టమోటా ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పుతామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో సీఎంతో కలిసి ప్రజావేదిక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో టమోటా పంటను ఎక్కువగా సాగు చేస్తారన్నారు. యూనిట్ నెలకొల్పేందుకు ఉన్న వివాదాలను త్వరలోనే పరిష్కరిస్తామని సీఎం సమక్షంలో చెప్పారు.
పత్తికొండ ఏపీ మోడల్ స్కూలు సీఈసీ రెండో ఏడాది విద్యార్థి బోయ తేజేశ్వర్ రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్-19 పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని కళాశాల ప్రిన్సిపల్ విక్టర్ శామ్యూల్, పీడీ రాజశేఖర్ నాయక్ తెలిపారు. విద్యార్థిని కళాశాల బృందం అభినందించింది.
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు నందికొట్కూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ షేక్షావలి తెలిపారు. ఈనెల 25 నుంచి 28 వరకు కర్నూలు స్టేడియంలో జరిగిన ఎంపికలో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. తబస్సుమ్ (రగ్బీ), చరణ్ (ఖోఖో), సుధీర్ (కబడ్డీ), షాలెంరాజు (త్రోబాల్), పూజిత (రగ్బీ) ప్రతిభ కనబరిచారన్నారు.
Sorry, no posts matched your criteria.