India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పత్తికొండ మం. పుచ్చకాయలమడకు CM చంద్రబాబు వరాలు కురిపించారు. 203 మందికి ఇళ్ల మంజూరు, 48 మందికి కొత్త పెన్షన్లు, 15 రేషన్ కార్డులు, ఐదుగురికి NREGC జాబ్ కార్డులు, 3 రేషన్ కార్డులు మంజూరు. 135 ఇళ్లకు ట్యాప్, ఒక ఇంటికి కరెంటు కనెక్షన్, 105 ఇళ్లకు మరుగుదొడ్లు, 1.7 KM డ్రైనేజీ కాలువ, 10.7 KM CC రోడ్డు, 22 మినీ గోకుళాలు.. వీటన్నింటికీ రూ.2.83 కోట్లు మంజూరు. మద్దికెర, పత్తికొండ, హోసూరుకు రోడ్లనిర్మాణం.
పుచ్చకాయలమడ గ్రామంలోని సమస్యలను తెలుసుకున్నామని, ముఖ్యంగా ఇళ్ల సమస్య తన దృష్టికి వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పుచ్చకాయలమడ గ్రామంలో 203 మందికి ఇంటి జాగాలు కొని ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం తెలిపారు. 48 మందికి పెన్షన్లు లేవని, వారికి పెన్షన్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని అన్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండగలా కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు జిల్లాలో 96.43%, నంద్యాల జిల్లాలో 94.26% పంపిణీ పూర్తయింది. కర్నూలు జిల్లాలో 2,41,843 మందికి గానూ 2,33,204 మందికి, నంద్యాల జిల్లాలో 2,18,225 మందికి గానూ 2,05,691 మందికి పింఛన్ల సొమ్ము అందింది.
అక్టోబర్ 1.. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం. రక్తదానంపై చైతన్యం కలిగించేందుకు 1975 నుంచి ఏటా నిర్వహిస్తున్నారు. రక్తదానం అన్ని దానాల కంటే ముఖ్యమైనది. ‘రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి’ అన్న నినాదాన్ని తరచూ వింటుంటాం. ఇదే స్ఫూర్తిగా జిల్లాలోని రక్తదాతలు ఆపద వేళ మేమున్నామంటూ ఎంతో మందికి పునర్జన్మనిస్తున్నారు. కొందరు పదుల సార్లు రక్తదానం చేసి అండగా నిలుస్తున్నారు. మరి మీరు ఒక్కసారైనా రక్తదానం చేశారా?
కర్నూలులోని వన్‌టౌన్ పరిధిలో కుక్కలు దాడి చేయడంతో 30 మందికిపైగా చిన్నారులు గాయపడ్డారు. వన్‌టౌన్ పరిధిలోని బండిమెట్ట, గడ్డా వీధి, చిత్తారి వీధి, గరీబ్ నగర్ ప్రాంతాల్లో సోమవారం రాత్రి కుక్కలు దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత చిన్నారులను మంత్రి భరత్, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పరామర్శించారు. గాయపడిన ఒక్కో చిన్నారికి రూ.10వేల పరిహారం అందిస్తామన్నారు.
కర్నూలు (D) పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఉ.11:40 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి 12:30కు ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్ఏ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 12:40 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 1:05 నిమిషాలకు పుచ్చకాయలమడ గ్రామానికి చేరుకుంటారు. అనంతరం గ్రామంలో పింఛన్ పంపిణీ చేస్తారు. సీఎం పర్యటనకు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమడలో నేడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎస్పీ బిందు మాధవ్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. DSPలు-5, CIలు-38, SIలు-40, ASI, HCలు-160, PCలు-213, హోంగార్డులు-106 మందితో పాటుగా 3 ఏఆర్, 5 స్పెషల్ పార్టీ బృందాలను బందోబస్తు విధులకు కేటాయించినట్లు ఈమేరకు ఎస్పీ వెల్లడించారు.
కర్నూలు మార్కెట్‌కు రైతులు ఉల్లి సరకు తీసుకురావద్దని రైతులకు, కమిషన్ దారులకు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మార్కెట్‌లో అత్యధికంగా ఉల్లి వచ్చినందున మార్కెట్‌లో ఎక్కడా స్థలం కూడా ఖాళీ లేదని చెప్పారు. లారీలు వచ్చి వెళ్లడానికి కూడా ట్రాఫిక్ సమస్య ఉందని తెలిపారు.
నంద్యాల పట్టణంలోని చెరువులో నెల వయసున్న శిశువు మృతదేహం సోమవారం కలకలం సృష్టించింది. అటుగా వెళుతున్న కొందరు సమాచారాన్ని పోలీసులకు అందించారు. చెరువు దగ్గరికి వచ్చి శిశువును పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. చెరువులో బతికి ఉన్న శిశువును పడేశారా లేదా చనిపోయిన శిశువును పడేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.
Sorry, no posts matched your criteria.