Kurnool

News March 27, 2024

ఆదోని MLA అభ్యర్థిగా పీవీ పార్థసారథి

image

ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిపై జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పీవీ పార్థసారథిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీ టీడీపీ ఇన్‌ఛార్జ్ కే. మీనాక్షినాయుడు ఈ సీటును ఆశించిన విషయం తెలిసిందే.

News March 27, 2024

నంద్యాల జిల్లాలో 28న CM, 29న మాజీ CM పర్యటన

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ YCP, TDP అగ్రనేతలు గెలుపే ప్రధాన ఏజెండాగా పావులు కదుపుతున్నారు. ఈనెల 28న CM వైఎస్ జగన్ నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్ర చేపడుతుండగా, మరోవైపు మాజీ CM నారా చంద్రబాబు ఈనెల 29న ‘ప్రజాగళం’ పేరిట బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో YCP, TDP అధినేతలు జగన్, చంద్రబాబు తమ పార్టీ శ్రేణులలో వరుస కార్యక్రమాలతో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు.

News March 27, 2024

వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

image

వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కీలక ఆరోపణలు చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా తన హక్కులను ఇతరులకు బదిలీ చేస్తామన్నారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండమన్నారు. దీంతో గెలిచిన 4 నెలలకే రాజీనామా చేద్దామనే భావన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా’ అని వెల్లడించారు.

News March 27, 2024

కర్నూలు: చెత్తకుప్పలో ఓటరు కార్డులు.. వీఆర్వోపై సస్పెన్సన్ వేటు

image

పత్తికొండ మండలం బొందిమడుగుల గ్రామ శివారులో చెత్తకుప్పలో పడేసిన ఓటరు గుర్తింపు కార్డుల ఉదంతంపై బాధ్యుడైన అప్పటి వీఆర్ఎ శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఆస్పరి తహశీల్దారు కార్యాలయంలో వాచ్‌మెన్ విధులు నిర్వహిస్తున్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News March 27, 2024

కర్నూలు: 3 నుంచి ఏప్రిల్ నెల పింఛన్లు

image

ఏప్రిల్ నెల వైఎస్ఆర్ పెన్షన్ కానుక 3 రోజులు ఆలస్యం కానుందని డీఆర్డీఏ-వైకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ సలీమ్ బాషా మంగళవారం తెలిపారు. ఈనెల 31 ఆదివారం నాటితో ఆర్థిక సంవత్సరం ముగుస్తుందని, మరుసటి రోజు ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవు ఉందని, 2న పింఛన్ల బడ్జెట్‌ను ప్రభుత్వం బ్యాంకులకు విడుదల చేస్తుందని చెప్పారు. 3వ తేదీ నుంచి పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని పెన్షనర్లు గమనించాలని కోరారు.

News March 27, 2024

కర్నూలు: నిబంధనలు అతిక్రమిస్తే 6 నెలల జైలు, రూ.2,500 జరిమానా

image

ఎంసీసీ బృందం అనుమతి లేకుండా కరపత్రాలు, బ్యానర్లను ముద్రిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ సృజన ప్రింటర్లను హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమిస్తే 6 నెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ముద్రణ కోసం వచ్చే వ్యక్తి, అతనితో పాటు మరో ఇద్దరి సంతకాలు తీసుకోవాలని, వారికి ఎన్ని కాపీలు కావాలనే వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించి, అనుమతి ఇచ్చిన తరువాతే ముద్రించాలన్నారు.

News March 27, 2024

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా ధర్మవరం సుబ్బారెడ్డి

image

డోన్ టికెట్ ఆశించి భంగపాటుకు గురైన ధర్మవరం సుబ్బారెడ్డికి అధిష్ఠానం కీలక పదవి అప్పగించింది. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డోన్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం ధర్మవరం సుబ్బారెడ్డి ఎంతో కృషి చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు బాధ్యతలను చేపట్టి కార్యకర్తలకు, నాయకులకు అండగా ఉన్న సుబ్బారెడ్డికి పార్టీ ఈ బాధ్యతలు అప్పజెప్పింది.

News March 27, 2024

ప్రచురణకర్తలు నుంచి ధ్రువీకరణ పత్రం: కర్నూలు కలెక్టర్

image

ఎన్నికల పాంప్లెట్ల ముద్రణ, ప్రచారం నిమిత్తం ముద్రించబోయి ఏ పేపర్లు అయినా ప్రచురణకర్తలు తప్పనిసరిగా ధ్రువీకరణ పత్రం అందజేయాలని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. ప్రచురణకర్తతో తెలిసిన మరో ఇద్దరితో ధృవీకరణ పత్రం ప్రింటర్లకు ఇవ్వాలన్నారు. ప్రింటర్ కూడా ప్రచురణ కర్త ఇచ్చిన ధృవీకరణ పత్రం, ముద్రించిన దాఖలు నమూనా కాగితాలు 4 కాపీలు 3 రోజులలోగా కలెక్టరు కార్యాలయంలో అందజేయలన్నారు.

News March 26, 2024

రుద్రవరం: వడ దెబ్బతో 18 నెలల చిన్నారి మృతి

image

రుద్రవరం మండల కేంద్రంలోని బ్రహ్మయ్య ఆచారి, రాజేశ్వరి దంపతుల కుమారుడు లక్ష్మీ నరసయ్య ఆచారి 18 నెలలు వడదెబ్బ సోకి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. సోమవారం అహోబిలంలో జరిగిన బ్రహ్మోత్సవాలకు వెళ్లి తలనీలాలు ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చారు. ఉదయం చూస్తే చిన్నారి కదలక పోవడంతో స్థానిక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లగా వడదెబ్బతో మృతి చెందినట్లు తెలిపారు.

News March 26, 2024

ఉగాది మహోత్సవాల్లో భక్తులకు మల్లన్న అలంకార దర్శనమే: ఈవో

image

శ్రీశైలంలో ఏప్రిల్ 6 నుంచి 10 వరకు ఉగాది మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. మహోత్సవాల్లో స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. మంగళవారం కార్యాలయంలో కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన పాదయాత్ర భక్త బృందాలు, స్వచ్ఛంద సేవాసంస్థల భక్త బృందాలతో రెండవ విడత సమన్వయ సమావేశం నిర్వహించారు. అలంకార దర్శన విషయమై భక్త బృందాలు అవగాహన కల్పించాలన్నారు.