India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి కర్నూలు జిల్లా ప్రముఖ రాజకీయ నేత. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా, రెండుసార్లు సీఎంగా సేవలందించారు. విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలనలో తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు శాసనసభ, ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికై 1999 ఎన్నికలలో ఓటమితో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. 81 ఏళ్ల వయసులో 2001లో తుదిశ్వాస విడిచారు. ఆయనెవరో గుర్తుపట్టారా? ఆయన జన్మించిన గ్రామం పేరేంటి? కామెంట్ చేయండి.
కర్నూలు జిల్లాలో వివిధ శాఖలకు అధికారులను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నూతన డీఆర్డీఏ పీడీగా ప్రతాపరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిగా రామనాథరెడ్డి, జిల్లా సివిల్ సప్లై మేనేజర్‌గా నాగసుధను నియమించారు. ప్రస్తుతం డీఆర్డీఏ పీడీగా పనిచేస్తున్న సలాం బాషాను సంబంధిత శాఖ రాష్ట్ర కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మంత్రాలయంలో కుండపోత వర్షానికి డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ వర్షంపై కొందరు రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొంత మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న పత్తి, మిర్చి, ఉల్లి, సజ్జ తదితర పంటలు తడిసి ముద్దై నష్టపోతున్నామని చెబుతున్నారు. మరోవైపు జిల్లాలో నేడూ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మహానంది డిప్యూటీ కమిషనర్‌గా రాష్ట్ర దేవదాయశాఖ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న డీసీ.శోభారాణిని నియమిస్తూ దేవదాయశాఖ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మహానంది ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డికి పల్నాడు జిల్లాలోని అమరేశ్వరస్వామి దేవస్థానం ఈవోగా బదిలీ చేశారు.
ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ను ఆదివారం నంద్యాల MP, లోక్‌సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డా.బైరెడ్డి శబరి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల ఫొటో, అభిషేకం లడ్డూను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ దస్త్రాలు క్లియర్ చేసేందుకు సహకరించాలని కోరారు.
నంద్యాల పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో మైనారిటీ, న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వాటిని బలోపేతం చేసి అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలోని కేసీ కెనాల్ లాకుల వద్ద జలవనరుల శాఖ అధికారులు ఆదివారం గుర్రపు డెక్క, వినాయక నిమజ్జనం వ్యర్థాలు తొలగించారు. మంత్రి నిమ్మల రామానాయుడు వస్తున్న నేపథ్యంలోనే పనులు చేసినట్లు సమాచారం. కేసీ కెనాల్‌పై వెళ్తున్న మంత్రి తన కారు ఆపి.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఏమి చేశారని ప్రశ్నించారు.
మాజీ సీఎం జగన్ కారణంగానే రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని.. ఇక్కడి ప్రాజెక్టులకు కేటాయించిన నిధులను దోచుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మల్యాల ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గంగమ్మకు జలహారతి ఇచ్చారు. ఆయన వెంట నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య, పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబు ఉన్నారు.
కర్నూలులో యువతి మృతి కలకలం రేపింది. ధర్మపేటకు చెందిన అనురాధ(24) డిగ్రీ పూర్తి చేసింది. NBS నగర్‌కు చెందిన మహబూబ్ బాషా అలియాస్ చోటును ఆమె ప్రేమించగా వీరి పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారు. ఈక్రమంలో బ్యూటీషియన్ కోర్సు నేర్చుకోవడానికి HYD వెళ్తానని చెప్పిన అనురాధ NRపేటలో చోటుతో కలిసి నివసిస్తోంది. ఈక్రమంలో శుక్రవారం రాత్రి అనురాధ తల్లిదండ్రులకు చోటు ఫోన్ చేసి అనురాధ ఉరేసుకున్నట్లు చెప్పాడు.
కేంద్ర ప్రభుత్వ పథకాలను కర్నూలు జిల్లా అభివృద్ధికి సమర్థవంతంగా వినియోగించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ.భరత్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.