India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి అయోధ్యలోని శ్రీ బాల రాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రామరాజ్య పాలన కొనసాగుతుందన్నారు. వీరికి మరింత పరిపాలన శక్తి అనుగ్రహించాలని అయోధ్య రామునికి పూజలు చేశానన్నారు.
నందికొట్కూరు మండలం మల్యాల గ్రామానికి ఈ నెల 22న (రేపు) రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రానున్నారు. ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా మండలంలోని హంద్రీనీవా ఎత్తిపోతల పథకాన్ని పరిశీలిస్తారని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ నిర్వహణ, పనితీరుపై సమీక్షించనున్నారు. రైలుమార్గంలో ఉదయం డోన్ చేరుకుంటారు. అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వ అతిథి గృహం చేరుకొని ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు.
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని సినీ హీరో ఆకాశ్ పూరీ దర్శించుకున్నారు. ఆయనకు శ్రీమఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. గ్రామ దేవత శ్రీ మంచాలమ్మ దేవి, గురు రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీమఠం పీఠాధిపతులు ఫలమంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు.
రాష్ట్రంలో మదనపల్లి తర్వాత కర్నూలు జిల్లాలోని పత్తికొండ టమాటా మార్కెట్ అతిపెద్దది. జిల్లాలోని తుగ్గలి, మద్దికేర, ఆలూరు, ఆస్పరి తదితర మండలాల నుంచి పత్తికొండ మార్కెట్‌కు రైతులు పెద్ద ఎత్తున టమాటాలు తీసుకొస్తారు. వారం రోజులుగా ఈ మార్కెట్‌లో ధరలు నిలకడగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కిలో గరిష్ఠంగా రూ.30పైనే పలుకుతున్నాయి. నిన్న క్వింటా టమాటా గరిష్ఠంగా రూ.3,200 పలికింది.
విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల సహాయార్థం అందించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు ఇచ్చిన రూ.11,675ల మొత్తాన్ని శుక్రవారం కలెక్టర్ రాజకుమారికి అందించారు. ఉన్నతాధికారులు విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులు తాము దాచుకున్న పాకెట్ మనీని వరద బాధితుల సహాయార్థం అందించడం అభినందనీయమని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు. జూపాడుబంగ్లా మండలంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులు దాచుకున్న రూ.11,675 చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందించారు. ఉన్నతాధికారులు విద్యార్థులను అభినందించారు.
కర్నూలు జిల్లా పరిధిలో రూ.1,33,70,000 విలువ చేసే 587 మొబైల్స్‌ను ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మొబైల్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి రుసుము లేకుండా అందజేశామన్నారు. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన ముచ్చట్ల ఆలయ పూజారి చంద్రమోహన్ రావు, వరలక్ష్మీ దంపతుల కుమార్తె ఇందు ప్రసన్నలక్ష్మీ కర్నూలు మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. నీట్ ఫలితాల్లో 720 మార్కులు గాను 644 మార్కులు సాధించింది. గ్రామీణ విద్యార్థికి MBBSలో సీటు రావడం పట్ల గ్రామస్థులుచ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలపై నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రజా వేదికలు నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను అందజేసి, కరపత్రంలోని విషయాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాష్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం సహాయక పీఆర్‌ఓ హొన్నొళ్లి వ్యాసరాజాచార్, పురోహితులు కుర్డీ శ్రీపాదాచార్ స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠంలో జరిగిన రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు.
Sorry, no posts matched your criteria.