India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు పూరీ ఆకాష్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు శ్రీ మఠం సహాయక పీఆర్‌ఓ హొన్నొళ్లి వ్యాసరాజాచార్, పురోహితులు కుర్డీ శ్రీపాదాచార్ స్వాగతం పలికారు. గ్రామ దేవత మంచాలమ్మను రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని మంగళ హారతులు స్వీకరించారు. అనంతరం శ్రీ మఠంలో జరిగిన రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగారు.
కర్నూలు జిల్లాలో రానున్న కాలంలో అన్ని రంగాల్లో దాదాపుగా 15% వృద్ధిరేటు సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం వంద రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లా, మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, తదితర వాటిలో అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు.
ఈనెల 20, 21వ తేదీల్లో కడప జిల్లా వేంపల్లిలో జరిగే 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ జట్లను హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి చిన్న సుంకన్న ప్రకటించారు. గురువారం కర్నూలు డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టుకు ఎంపికైన హ్యాండ్ బాల్ సబ్ జూనియర్స్ క్రీడాకారులకు టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.
కర్నూలు నుంచి విజయవాడ జంక్షన్‌కు రైలు సౌకర్యం కల్పించాలని రైల్వేశాఖ సహాయ మంత్రి వీ.సోమణ్ణను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమణ్ణను భరత్ కలిసి రైల్వే సమస్యలపై వినతిపత్రం అందించారు. కర్నూలు నుంచి విజయవాడకు ప్రతి రోజూ రైలు, కర్నూలు నుంచి ముంబైకి వారంలో ఒకటి లేదా రెండు సార్లు రైలు సౌకర్యం కల్పించాలని కోరారు.
శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు అందించిన విరాళాలు రూ.2,22,70,749ను సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబుకు ఈ మొత్తాన్ని అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వ్యాపారవేత్తలు, పొదుపు మహిళలు, విద్యార్థులు అందించిన మొత్తం సొమ్మును లెక్క చూపి ఆయనకు అందజేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..
కర్నూలు జిల్లాలో ఇసుక ఆన్లైన్ అమ్మకాలు ఈరోజు సాయంత్రం 3 గంటల నుంచి ప్రారంభమవుతాయని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ డీడీ రాజశేఖర్ తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇసుక బుకింగ్‌లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇసుక కొనుగోలుదారులు తహశీల్దారు కార్యాలయాలు, సచివాలయాల్లో బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపారు.
కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా ఆర్.జయలక్ష్మిని నియమిస్తూ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిషనర్ విజయ సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జయలక్ష్మి అనంతపురం మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు వ్యవసాయ మార్కెట్ సెలెక్షన్ గ్రేడ్ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుత కార్యదర్శి గోవిందును అనంతపురం బదిలీ చేశారు.
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఏపీకి నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించింది. నంద్యాల జిల్లా మహానంది మండలం నందిపల్లెకు చెందిన వంగల మనీషా రెడ్డి ఆ జాబితాలో ఉన్నారు. సొంత రాష్ట్రానికి ట్రైనీ ఐపీఎస్‌గా కేటాయించడంతో నందిపల్లి గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
శిరివెళ్లలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కాశిరెడ్డి నాయన దేవాలయం సమీపంలోని కాలువలో పడి శంకరయ్య(13) అనే బాలుడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన గురుమూర్తి, సుంకమ్మ కుమారుడు శంకరయ్య నిన్నటి నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు గాలిస్తుండగా ఆలయం పక్కన ఉన్న కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
Sorry, no posts matched your criteria.