India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
క్రిష్ణగిరి మండలం కంబాలపాడుకు చెందిన దూదేకుల రంజిత్ కర్నూలు మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు. తల్లిదండ్రులు రెహమాన్, మహబూబ్ బీ వ్యవసాయం చేసుకుంటూ జీవినం సాగిస్తున్నారు. తన కుమారుడు రంజిత్ నీట్‌లో 582/720 మార్కులు సాధించి మొదట విడత కౌన్సెలింగ్‌లోనే సీటు సాధించాడని ఆనందం వ్యక్తం చేశారు. రంజిత్‌ను పలువురు అభినందించారు.
ఆళ్లగడ్డలో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. పట్టణానికి చెందిన ఆవుల స్వప్న అనే గర్భిణి పురిటి నొప్పులతో ఇవాళ ఉదయం డా.వెంకట సుబ్బారెడ్డి ఆసుపత్రిలో (శివమ్మ ఆసుపత్రి)లో చేరారు. డా.హనీషా, డా.యశ్వంత్ రెడ్డితో కూడిన వైద్యుల బృందం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా కాన్పు చేయగా ముగ్గురు శిశువులు జన్మించారు. వారిలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు ఉన్నారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.
కర్నూలు జల్లా గోనెగండ్ల మండలంలోని బైలుప్పల గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి చాకలి తిక్కన్న (35) అనే వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటన సోమవారం జరిగింది. తిక్కన్న ఇంటి సమీపంలోని మేకల షెడ్డులో విద్యుత్ వైర్లను సరి చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు తిక్కన్నకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈనెల 14-15వ తేదీ వరకు భీమిలిలో జరిగిన 49వ రాష్ట్రస్థాయి యోగా పోటీలలో 149 పాయింట్లతో కర్నూలు జిల్లా జట్టు మూడో స్థానం సాధించినట్లు రాష్ట్ర యోగా సంఘం ప్రధాన కార్యదర్శి అవినాశ్ శెట్టి తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులు అక్టోబర్ 24-27వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరగబోయే 49వ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్నారు.
కోసిగి గ్రామానికి చెందిన బలకుందు కోసిగయ్య(52) సోమవారం మధ్యాహ్నం కోసిగి నుంచి ఐరనగల్ 523/40-42 కిలోమీటర్ వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కోసిగయ్య తాగుడుకు బానిసై, కుటుంబ కలహాలతో గూడ్స్ రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మొండెం నుంచి తల తెగిపడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదోని రైల్వే పోలీసులు తెలిపారు.
నంద్యాలలో తనపై జరిగిన దాడి దురదృష్టకరమని, ఇలాంటి సంఘటనలను తమ కుటుంబం కానీ నంద్యాల పట్టణ ప్రజలు కానీ సహించబోరని నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ సోమవారం తెలిపారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీలోని మరో వర్గానికి చెందిన తమ నాయకుడు ఫొటో లేదని పదేపదే ఫోన్ చేస్తూ బెదిరింపులకు దిగారని ఫిరోజ్ తెలిపారు.
కోసిగిలోని రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రైల్వే గేట్ సమీపంలో బాలప్ప తోట వద్ద పట్టాలపై తల, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. మృతుడు పట్టణంలోని బులొల్లి గేరికి చెందిన బంగారి కోసిగయ్యగా స్థానికులు గుర్తించారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పక్కా వ్యూహంతోనే ఓ క్రియాశీలక టీడీపీ నాయకుడి అనుచరులు తనపై దాడికి పాల్పడ్డారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ విషయంపై టీడీపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి ఘటనను ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఫిరోజ్ పేర్కొన్నారు.
☛ ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవలందించింది?
☛ కొండారెడ్డి బురుజును ఎవరు నిర్మించారు?
☛ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మించిన గ్రామం పేరేంటి?
☛ పూర్వం నంద్యాలను ఏ పేరుతో పిలిచేవారు?
☛ వరల్డ్‌బుక్ ఆఫ్రికార్డ్స్లో శ్రీశైలం ఆలయానికి చోటు దక్కడానికి కారణమేంటి?
★ పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.
నంద్యాలలో ఆదివారం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌పై నలుగురు దుండగులు దాడి చేశారు. రాజ్ థియేటర్ నుంచి వాహనంలో వెళ్తుండగా మోటార్ బైక్‌పై వెంబడించిన నలుగురు ఫిరోజ్ వెహికల్‌పై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్.. వాహనం దిగి దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.