Kurnool

News April 25, 2024

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

image

కర్నూలు జిల్లా వెల్దుర్తిలోని ఫ్యాక్షన్ గ్రామాల పికెట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా విధులు నిర్వహించాలని
సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

News April 25, 2024

కర్నూలు టీడీపీ అభ్యర్థి ఆస్తి విలువ రూ.278.27 కోట్లు

image

కర్నూలు టీడీపీ అభ్యర్థిగా టీజీ భరత్ మంగళవారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. టీజీ భరత్ మెుత్తం ఆస్తుల విలువ రూ.278.27 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. చరస్తుల విలువ రూ.83.08కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.195.19 కోట్లుగా పేర్కొన్నారు. అప్పులు రూ.19.38 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

News April 25, 2024

పాణ్యంలో గెలుపునకు వారే కీలకం

image

పాణ్యం, గడివేముల, ఓర్వకల్లు, కల్లూరు మండల పరిధిలో కర్నూలు కార్పొరేషన్‌లోని 16 వార్డులు కలిపి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. కాగా పాణ్యం మండలంలో 36,893 ఓటర్లు, ఓర్వకల్లు మండలం 48,121, గడివేముల 34,411, కల్లూరు మండలంలో 2,03,068 మంది ఓటర్లతో కలిపి మెుత్తం ఓటర్లు 3,22,493 ఉన్నారు. పాణ్యం నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపులో కల్లూరు మండల ఓటర్లు కీలక పాత్ర వహించనున్నాయి.

News April 25, 2024

REWIND: ఆలూరు ఏకైక మహిళా ఎమ్మెల్యే నీరజారెడ్డి

image

ఆలూరు నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఎన్నికయ్యారు. 1955 నుంచి 2019 వరకు ఎన్నికల వరకు అందరూ పురుషులే ఎమ్మెల్యేలు కాగా నీరజారెడ్డి మాత్రమే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంపై విజయం సాధించారు. 2004లో మసాల పద్మజ, 2014లో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్, 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు

News April 25, 2024

కాటసాని కుటుంబం పేరిట 245.6 ఎకరాల భూమి

image

కాటసాని రాంభూపాల్ రెడ్డి మొత్తం ఆస్తుల విలువ రూ.75.19 కోట్లుగా నామినేషన్ అఫిడవిట్‌లో ఎన్నికల అధికారులకు సమర్పించారు. కుటుంబం మెుత్తం చరాస్తుల విలువ రూ.26.95 కోట్లు, స్థిరాస్తులు విలువ రూ.48.24 కోట్లు.. అప్పులు రూ.3.01కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భూమి ఎకరాల్లో కాటసాని పేరుతో 10.87, ఆయన సతీమణికి 164.33, కుమారుడు, కుమార్తెల పేరిట 70.40 ఎకరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. కాటసానిపై ఒక్క కేసు ఉంది.

News April 25, 2024

39 మంది అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్

image

నంద్యాల ఎంపీ స్థానానికి మంగళవారం నలుగురు, అసెంబ్లీ స్థానాలకు 35 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారని పేర్కొన్నారు. నంద్యాల పార్లమెంట్‌కు నలుగురు, ఆళ్లగడ్డకు ఆరుగురు, శ్రీశైలానికి ఆరుగురు, నందికొట్కూరుకు నలుగురు, నంద్యాలకు 11 మంది, బనగానపల్లెకు ఆరుగురు, డోన్‌కు ఇద్దరు దాఖలు చేశారన్నారు.

News April 25, 2024

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం: ఎస్పీ

image

ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కర్నూలు ఎస్పీ జి. కృష్ణ కాంత్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. సి.బెలగళ్ పోలీసుస్టేషన్ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలైన పోలకల్, గొల్లల దొడ్డి గ్రామాలను సందర్శించి పరిశీలించారు. అక్కడ భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

News April 25, 2024

కర్నూలు: రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యం

image

ఆస్పరి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన కోతి సతీశ్(25) స్ఠానిక రైల్వే స్టేషన్ సమీపాన రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆదోని రైల్వే ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 25, 2024

హోం ఓటింగ్ ప్రక్రియ మే 8 లోపు పూర్తి చేయండి: కలెక్టర్

image

మే 5 నుండి 8 తేదీల్లో నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ, హోం ఓటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. మంగళవారం పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులతో, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News April 24, 2024

కర్నూలు: 3 రోజులు పనికి, మరో 3 రోజులు బడికి.. టెన్త్‌లో 509 మార్కులు

image

పదో తరగతి ఫలితాల్లో చిప్పగిరి మండలం బంటనహాల్‌కు చెందిన నవీన అనే విద్యార్థిని 509 మార్కులు సాధించింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కెల్లా ఇవే అత్యధిక మార్కులు. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేక నవీన వారంలో 3 రోజులు కూలీ పనులకు, మరో 3 రోజులు పాఠశాలకు వెళ్లేదని స్థానికులు తెలిపారు. నవీన తండ్రి వ్యవసాయ కూలీ కాగా, ఆమె తల్లి కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని తెలిపారు.