India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాల ఎస్పీ కార్యాలయంలో నేడు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఎస్పీ కార్యాలయానికి సమస్యల కోసం వచ్చే ప్రజలు రావద్దని ఆయన సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో ప్రజలు తమ సమస్యలను వస్తారని ఈ విషయాన్ని గమనించి ఎవరూ రావద్దని ఆయన సూచించారు.
విజయవాడ వరద బాధితులకు కోసం రూ.కోటి విలువైన 10 వేల నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేసినట్లు మంత్రి టీజీ భరత్, టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, నాయకుల సహకారంతో వీటిని తయారు చేసినట్లు చెప్పారు. ఒక్కో కిట్‌లో 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ చక్కెర, ఉప్మారవ్వ, కారంపొడి, తదితర వస్తువులు ఉన్నాయన్నారు.
కర్నూలులో ఈనెల 15న జరగబోయే వినాయక నిమజ్జన మహోత్సవాన్ని అధికారులు ప్రణాళికలతో ఏర్పాటు చేయాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఆదివారం రాంబోట్ల దేవాలయం, బాదం మాస్క్ మీదుగా, కింగ్ మార్కెట్, కొండారెడ్డి బురుజు మీదుగా అంబేడ్కర్ సర్కిల్, రాజ్ విహార్ మీదుగా వెళ్లే వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రాంతాలను పరిశీలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.
డోన్ పట్టణంలో జరిగిన వినాయక చవితి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని తారకరామా నగర్‌కు చెందిన కమ్మరి కౌశిక్ శనివారం రాత్రి గణేశ్ మండపానికి ప్లాస్టిక్ కవర్ కప్పబోయి విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తోటి వారు డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మరణించినట్లు తెలిపారు. దీంతో పండగ పూట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సంజామల పాలేరు వాగు పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి శనివారం పరిశీలించారు. రైతులు ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. పంట నష్టపరిహారంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఎంపీ నాగరాజు కోరారు. కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి ఎంపీ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గణేష్ మండపాలతో కళకళలాడాల్సిన సమయంలో విజయవాడలో కురిసిన భారీ వర్షాలు, వరదలు అక్కడి ప్రజలను తీవ్ర కష్టాలపాలు చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జే.లక్ష్మీ నరసింహ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, MP కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈయన గత ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సంజామల పాలేరు వాగు పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను శనివారం మంత్రి బీసీ పరిశీలించారు. రైతులు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భరోసా ఇచ్చారు. పంట నష్టపరిహారంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి బీసీ ఆదేశించారు.
కోడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణను కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం నియమించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ.. కార్యకర్తలను అందర్నీ కలుపుకొని పార్టీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని అన్నారు. కర్నూలు నగర అధ్యక్షుడిగా జిలానీని నియమించారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకొని పత్తికొండకు చెందిన కళాకారుడు హర్షవర్ధన్ తన ప్రతిభకు పనిచెప్పారు. పెన్సిల్ ముక్కపై వినాయకుడి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. తన భక్తిని చాటుకున్నారు. మైక్రో ఆర్ట్ రూపంలో చిత్రీకరించినట్లు కళాకారుడు తెలిపారు. ఇది వరకు జాతీయ పండుగలు, ప్రత్యేక పర్వదినాల సందర్భంగా పలు చిత్రాలను గీసిన హర్షవర్ధన్ రాష్ట్రస్థాయిలో అవార్డులు అందుకున్నారు.
Sorry, no posts matched your criteria.