Kurnool

News September 4, 2024

నంద్యాల: 196 మందికి ఉద్యోగాలు

image

నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో 196 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీవీ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 586 మంది యువతీ, యువకులు పాల్గొనగా 196 మంది ఎంపికయ్యారన్నారు. 8 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో ఎన్ఎండీ ఫిరోజ్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

News September 4, 2024

కానిస్టేబుల్‌కు గోల్డ్ మెడల్.. నంద్యాల ఎస్పీ అభినందన

image

నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఫర్హతుల్లా రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో బంగారు పతకం సాధించడం అభినందనీయమని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ను మంగళవారం ఎస్పీ కార్యాలయంలో అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పుదుచ్చేరిలో జరగబోయే జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

News September 4, 2024

కుందూ నది వరద ఉద్ధృతి పరిశీలించిన ఎస్పీ

image

నంద్యాల మీదుగా ప్రవహిస్తున్న కుందూ నది, మద్దిలేరు వాగు, పట్టణంలో గల చెరువును మంగళవారం ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా పరిశీలించారు. కుందూ నది, మద్దిలేరు వాగులలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ఎస్పీ వాటిని పరిశీలించి వరద ఉద్ధృతి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎస్పీతో పాటు స్పెషల్ బ్రాంచ్ DSP సంతోశ్, రెండో పట్టణ సీఐ ఇస్మాయిల్ ఉన్నారు.

News September 3, 2024

FLASH: వరద బాధితులకు మంత్రి భరత్ రూ.10 లక్షల సాయం

image

రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖ మంత్రి, కర్నూలు నియోజకవర్గ MLA టీజీ భరత్ విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచారు. TGV గ్రూప్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ తమ వంతు సాయంగా విజయవాడ వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు.

News September 3, 2024

విద్యుత్ తీగ తగిలి వ్యక్తి మృతి

image

నందవరం మండలం నాగులదిన్నెలో విషాదం చోటుచేసుకుంది. కోళ్ల ఫారంలో కూలీ పనికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి ఇమ్మానియేల్(50) అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ పెద్దదిక్కు మృతి చెందడంతో ఆ కుటుబంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.

News September 3, 2024

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్ రంజిత్ బాషా

image

అనకాపల్లి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో కర్నూలు జిల్లా క్రీడాకారులు 12 పతకాలు సాధించిన సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మంగళవారం తన చాంబర్‌లో అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడాకారులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. గెలుపే లక్ష్యంగా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజేతలుగా తిరిగి రావాలని ఆకాంక్షించారు. డీఎస్డీఓ పాల్గొన్నారు.

News September 3, 2024

వరద బాధితులకు అండగా కర్నూలు ఎంపీ

image

విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు, వస్తువుల పంపిణీ వాహనాన్ని కర్నూలు ఎంపీ నాగరాజు మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితులలో అండగా నిలవాలని కోరారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నారు.

News September 3, 2024

కర్నూలు: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 7న బంద్

image

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ వైన్ షాప్ ఉద్యోగులు 7న బంద్‌కు పిలుపు ఇస్తూ రాష్ట్ర యూనియన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జతిన్ రెడ్డి, అడ్వైసర్ నాగచంద్రు కలిసి జిల్లా మద్యం డిపో అధికారులకు బంద్ నోటీసులు ఇచ్చారు. తమకు మరో శాఖలో ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు.

News September 3, 2024

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 7న బంద్

image

తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ప్రభుత్వ వైన్ షాప్ ఉద్యోగులు 7న బంద్‌కు పిలుపు ఇస్తూ రాష్ట్ర యూనియన్ నిర్ణయం తీసుకుంది. సోమవారం జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జతిన్ రెడ్డి, అడ్వైసర్ నాగచంద్రు కలిసి జిల్లా మద్యం డిపో అధికారులకు బంద్ నోటీసులు ఇచ్చారు. తమకు మరో శాఖలో ఉపాధి కల్పించాలని కోరుతున్నామన్నారు.

News September 3, 2024

నృత్య ప్రదర్శనలో వరల్డ్ రికార్డ్ హోల్డర్‌గా విన్మయ శ్రీ

image

వారణాసిలో ఇంటర్నేషనల్ కార్నేటిక్ మెజీషియన్స్ అండ్ డాన్సర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఈవెంట్‌లో నందికొట్కూరుకు చెందిన విన్మయ శ్రీ శివతాండవం విభాగంలో అద్భుత నృత్య ప్రదర్శన చేసి అత్యుత్తమ ప్రతిభ చాటారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు విన్మయ శ్రీకి వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ మెడల్, ప్రశంసా పత్రాన్ని అందించి సన్మానించారు. విద్యార్థినిని పలువురు అభినందించారు.