India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పత్తికొండలో రేపు (మంగళవారం) కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, ఎస్పీ కృష్ణకాంత్ పర్యటన ఉంటుందని పత్తికొండ ఆర్డీఓ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి సోమవారం తెలిపారు. ఉదయం 10:30 గంటలకు పత్తికొండ ఆర్టీసీ బస్టాండ్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కలెక్టర్, ఎస్పీ పాల్గొంటారని వెల్లడించారు.
హోళగుంద: గంజహళ్లిలో అంగన్వాడీ విద్యార్థి మల్లప్పపై అన్నం గంజి పడి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. అంగన్వాడీ సెంటర్-2లో మల్లప్ప యూరిన్ పోసి వస్తుండగా.. ఆ సమయంలో ఆయా లక్ష్మి అన్నం గంజిని విసిరినట్లు తెలిసింది. చూసుకోకుండా విసిరినట్లు అంగన్వాడీ ఆయా తెలుపగా.. తల్లిదండ్రులు మాత్రం నిర్లక్ష్యం కారణంగానే తన బిడ్డపై గంజి పోసిందంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
డోన్ మండలం గోసానిపల్లె సమీపంలో కరివేపాకు తోట మలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొనడంతో ప్యాపిలి మండలం కోటకొండకు చెందిన వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు అక్కడికక్కడే మృతిచెందారు. అతని కుమారుడికి, ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు.
గెలుపే లక్ష్యంగా అనేక సర్వేల అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 MP, 13 అసెంబ్లీ స్థానాలకు TDP, ఒక (ఆదోని) స్థానానికి BJP అధినేతలు అభ్యర్థులను ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జిల్లాలో YCP క్లీన్ స్వీప్ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. సర్వేల రిపోర్టును బట్టి YCP బలాలు, బలహీనతల దృష్ట్యా పలుచోట్ల అభ్యర్థులను మార్చారు. చంద్రబాబు నిర్ణయాలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.
నందికొట్కూరు మండలం అల్లూరులో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఐపీఎస్, టీడీపీ నేత ఇన్ఛార్జ్ శివానందరెడ్డి ఇంటికి 2012లో నమోదయిన ఓ కేసు విచారణ నిమిత్తం తెలంగాణ పోలీసులు చేరకున్నారు. అయితే తనకు నోటీసు ఇచ్చి విచారించాలంటూ శివానందరెడ్డి పోలీసులను కోరారు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు తయారు చేసేలోపే ఆయన తన ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా పీవో, ఏపీవో శిక్షణ తరగతులకు పలువురు గైర్హాజరు కావడంపై కలెక్టర్ సృజన సీరియస్ అయ్యారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్తికొండ నియోజకవర్గంలో 16 మంది, ఎమ్మిగనూరులో 12 మంది, ఆలూరులో తొమ్మిది మంది, మంత్రాలయంలో ఏడుగురు.. మొత్తంగా 44 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
మార్చి 29న ఎమ్మిగనూరులో జరిగిన సీఎం జగన్ సిద్ధం సభకు వెళ్లినట్లు తేలటంతో ఇద్దరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించినట్లు పత్తికొండ ఎంపీడీవో డి.రామారావు తెలిపారు. మండలానికి చెందిన బుల్లేని పాండు, ఎర్రమల శివ నిబంధనలను అతిక్రమించి సిద్ధం సభకు వెళ్లడంతో విధుల నుంచి తొలగించామన్నారు. కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దన్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీస్ కవాతు నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతును నిర్వహించామన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విధుల్లో పాల్గొనే 33 శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పిస్తుందని కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. విధుల్లో ఉంటూ ఓటు వేయలేని వారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారన్నారు.
మద్దికేర మండల కేంద్రంలోని కోతులుమాను దగ్గర టాటా ఏసీ టైర్ పగిలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరిని కర్నూలుకు తరలించారు. రోజు వారిగా చిప్పగిరి మండలానికి మిరప పంట కోతకు వెళ్లేవారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.