Kurnool

News March 31, 2024

రూ.2.49 కోట్లు స్వాధీనం: నంద్యాల కలెక్టర్

image

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై రూ.1.74 కోట్ల నగదు, రూ.59 లక్షల విలువైన మద్యం, రూ.16 లక్షల విలువ చేసే వస్తువులు.. మొత్తం కలిపి రూ.2.49 కోట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని నంద్యాల కలెక్టర్ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ను పటిష్ఠంగా అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు. ఎంసీసీ ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.

News March 31, 2024

కొలిమిగుండ్లలో కార్మికుడు మృతి

image

పొట్టకూటి కోసం క్లీనర్ పని చేసుకోవడానికి లారీ వెంట వచ్చిన కార్మికుడు గుండె పోటుతో మృతి చెందిన సంఘటన కొలిమిగుండ్ల మండలం అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా బూడిదపాడు గ్రామానికి చెందిన గురక రామిరెడ్డి(48) ఉన్నట్టుండి కుప్పకూలి మృతి చెందారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు PC నరసింహులు తెలిపారు.

News March 31, 2024

కర్నూలులో ఏడాది క్రితం మిస్సైన మూడు కూనలు హైదరాబాద్‌లో సేఫ్

image

కర్నూలు జిల్లాలో 2023 మార్చిలో నాలుగు పులి పిల్లలు మిస్ అయ్యాయి. అయితే వాటిని తిరుపతి SV జూ పార్క్‌కు తరలించి అధికారులు సంరక్షించారు. వాటిలో ఒకటి మరణించగా మరో మూడింటికీ రుద్రమ్మ, అనంత, హరిణి అని పేరు పెట్టారు. వీటిని ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కి చెందిన జీఏఆర్ సంస్థ ఏడాది పాటు దత్తత తీసుకుంది. గడువు ముగిస్తే మళ్లీ అధికారుల ఆదేశాలతో నిర్ణయం తీసుకుంటామని SVజూపార్క్ క్యూరేటర్ సెల్వం తెలిపారు.

News March 31, 2024

తాగునీటి సమస్యల పరిష్కారానికి ఫిర్యాదుల విభాగం ఏర్పాటు: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో వేసవికాలంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్‌ను కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ తాగునీటి సమస్య ఏర్పడినా 08514-244424కు కాల్ చేసిన వెంటనే సంబంధిత అధికారులతో తనిఖీలు చేయించాలన్నారు. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News March 30, 2024

మోడల్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పొడగింపు: డీఈఓ

image

కర్నూలు జిల్లాలోని మోడల్ స్కూళ్లలో ఆరవ తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News March 30, 2024

శ్రీశైలానికి పాదయాత్రగా వస్తూ కన్నడ భక్తుడి మృతి

image

మంత్రాలయం మండలం చిలకలడోన – బూదూరు గ్రామాల మధ్య కర్ణాటక రాష్ట్రం బెలగాం ప్రాంతానికి చెందిన బసప్ప(22) మృతి చెందినట్లు ఎస్సై గోపీనాథ్ తెలిపారు. ప్రతి ఏడాది లాగే బసప్ప, వారి కుటుంబ సభ్యులు ఈనెల 24న పాదయాత్రగా సొంత గ్రామం నుంచి శ్రీశైలానికి బయలుదేరారు. మార్గమధ్యలో హఠాత్తుగా మృతిచెండంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు.

News March 30, 2024

ప్రతాపరెడ్డి కుటుంబానికి అండగా ఉంటా: తుగ్గలిలో సీఎం జగన్

image

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే దివంగత నేత తమ్మారెడ్డి కుమారులు ప్రతాపరెడ్డి, ప్రహల్లాద రెడ్డి ఒకేసారి అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడంతో బాధాకరమని సీఎం జగన్ అన్నారు. తుగ్గలి సిద్ధం బస్సు యాత్రకు శనివారం వచ్చిన జగన్ వారి ఫొటోలకు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతాపరెడ్డి, ప్రహల్లాద రెడ్డి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకునికి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

News March 30, 2024

నేను లోకల్ వ్యక్తినే: డాక్టర్ పీవీ పార్థసారథి

image

ఆదోని MLA టికెట్ కూటమి బీజేపీ అభ్యర్థి డాక్టర్ పీవీ పార్థసారథికి ఖరారు అయిన విషయం తెలిసిందే. నియోజకవర్గంలో నాయకులు ఆయనను నాన్ లోకల్ అన్న విమర్శకు కౌంటర్ ఇచ్చారు. తాను లోకల్ వ్యక్తినే అని గత 10 ఏళ్లుగా ఇక్కడ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నానని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలు తనకు బాగా తెలుసు అన్నారు. నాయకులు వారి రాజకీయ స్వలాభం కోసం చేస్తున్న విమర్శలు తన విజయాన్ని ఆపలేవు అన్నారు.

News March 30, 2024

పత్తికొండ: అత్యధిక మెజార్టీ ఆ మహిళకే…!

image

పత్తికొండ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరగిన అసెంబ్లీ ఎన్నికలలో కంటే 2019 ఎన్నికలలో కే. శ్రీదేవీ YCP నుంచి పోటీచేసి TDP అభ్యర్థి కే.ఈ శ్యాంబాబుపై 42.065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలకు కూడా YCP అధిష్ఠానం ఈమెకే మళ్లీ అవకాశమిచ్చింది. ఈమెకు ప్రత్యర్థిగా TDP అధిష్ఠానం కూడా కే. ఈ శ్యాంబాబును బరిలో దింపింది. మరి వీరిద్దరిలో గెలుపు ఎవరి సొంతమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 30, 2024

కర్నూలు : బైకు చక్రంలో చున్నీ చుట్టుకుని మహిళ మృతి

image

కర్నూలు జిల్లాకు చెందిన మాధవీలత(25) తెలంగాణలో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు మరికల్ మండలంలో భర్తతో కలిసి గ్యాస్ పొయ్యి మరమ్మతులు చేస్తూ గుడిసెలో జీవించేవారు. అయితే శుక్రవారం కోయిలసాగర్ జలాశయం వద్ద బైకుకు చున్నీ చుట్టుకుని కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.