India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లాలో వైరల్ ఫీవర్లతో పెద్దలు, పిల్లలు అని తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల బాట పడుతున్నారు. కర్నూలు అర్బన్‌లో 63కేసులు, దేవనకొండలో 14, సి.బెళగల్‌లో 13తో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 211 డెంగీ కేసులు నమోదైనట్లు సమాచారం. దీంతో పాటు మలేరియా జ్వరాలూ పెరగడం కలవరపెడుతోంది. జిల్లాలో దోమల వ్యాప్తి పెరగకుండా చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు మలేరియా అధికారి నూకరాజు తెలిపారు.
డోన్ పట్టణంలో ఆదివారం చికెన్ కిలో రూ.120కే విక్రయించారు. పట్టణంలో ఓ కొత్త దుకాణం ఏర్పాటు చేసి కిలోకు నాలుగు గుడ్లు ఫ్రీగా ఇచ్చారు. దీంతో ఓ మాంసం దుకాణ యజమాని పాత బస్టాండ్ సమీపంలో ఇలాగే విక్రయించాడు. దీంతో సిండికేట్ వ్యాపారులు విడిపోయి చికెన్ ధరలు తగ్గించి అమ్మారు. ఓ షాపు దగ్గర కిలో రూ.120, మరో దుకాణం వద్ద రూ.140వరకు విక్రయించారు. దీంతో మాంసం ప్రియులు ఎగబడి కొనుగోలు చేశారు.
శాంతిభద్రతలను పరిరక్షిస్తూ, నేర నివారణ లక్ష్యంగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేయాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశించారు. నంద్యాల జిల్లా పరిధిలో ఆదివారం చట్టవ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎక్కడైనా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలని పోలీసులకు సూచించారు.
నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.15.4 కోట్ల నిధులు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగా కర్నూలు మున్సిపాలిటీలోని గార్గేయపురం నగర వరం అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో పచ్చదనం సుమారు 50 శాతం ఉండాలని, నగర వనాలపై దృష్టి సారించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించనున్నారు.
ఈనెల 26న కృష్ణాష్టమి పండుగ సంధర్బంగా నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్దగల జిల్లా పోలీస్ కార్యాలయంలో జరగబోయే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కలిక వాయిదా వేసినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా శనివారం తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలతో రావొద్దని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించగలరని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
ఈనెల 26న జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు ఎస్పీ జీ.బిందు మాధవ్ ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా వాయిదా వేసినట్లు వెల్లడించారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
ఉచిత ఇసుక పంపిణీ ప్రక్రియలో భాగంగా అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి నియంత్రణలోకి తీసుకురావాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉచిత ఇసుక విధాన పటిష్ట అమలుపై ఎస్పీ అధిరాజ్ సింగ్, జాయింట్ కలెక్టర్ సీ.విష్ణుచరణ్‌తో కలిసి స్టాండ్ కమిటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వినతులు స్వీకరించారు. బనగానపల్లె టీడీపీ కార్యాలయానికి నంద్యాల జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన ప్రజలతో మంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను తక్షణం పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వం ఇటీవల గ్రామ పంచాయతీలకు రూ.16.85 కోట్లు విడుదల చేసిందని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామానికి మంజూరైన నిధులతో పెండింగ్‌లో ఉన్న పనులను చేసుకునే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లోని సమస్యలను చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. గ్రామాల్లోని వనరులను వినియోగించుకుంటూ ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.
శ్రీశైలం మండల కేంద్రం సున్నిపెంటలోని బండ్ల బజారులో శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో చిరుత పులి కలకలం రేపింది. ఇళ్ల మధ్యకు చిరుత రావటాన్ని గమనించిన ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఓ ఇంటిపై నుంచి దూకి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇటీవల తరచూ చిరుత సంచారం స్థానికులను ఆందోళకు గురిచేస్తోంది.
Sorry, no posts matched your criteria.