Kurnool

News March 28, 2024

నేడు నంద్యాలకు CM జగన్

image

నంద్యాల జిల్లా కేంద్రంలో ఇవాళ CM వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ‘మేమంతా సిద్ధం’ పేరిట చేపట్టిన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో CM జగన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం రేపు ఎమ్మిగనూరులో నిర్వహించే ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో CM పాల్గొననున్నారు.

News March 28, 2024

కర్నూలు: BSNL ల్యాండ్ లైన్ సేవలు కాపర్ నుంచి ఫైబర్‌లోకి మార్పు

image

కర్నూలు: BSNL కాపర్ ద్వారా అందిస్తున్న ల్యాండ్ లైన్ వాయిస్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా ఫైబర్‌లోకి మార్చే ప్రక్రియ కొనసాగుతుందని బీఎస్‌ఎన్‌ఎల్ కర్నూల్ బిజినెస్ ఏరియా జనరల్ మేనేజర్ జి.రమేష్ తెలిపారు. ప్రకాష్ నగర్‌లోని బీఎస్ఎన్ఎల్ భవన్‌లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఫైబర్‌లోకి మారితే కేవలం రూ.199కే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 1 జీబీ డేటాను 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో పొందవచ్చని తెలిపారు.

News March 28, 2024

కర్నూలు: ‘క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనల నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి’

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై మరింత ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సంబంధిత అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. బుధవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్‌లు, తహశీల్దార్లు, ఎంపిడిఓలతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో కోడ్ ఉల్లంఘనలకు సంబంధించిన నివేదికలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

News March 28, 2024

నంద్యాల:  ట్రాఫిక్ అంతరాయం కలగకుండా డైవర్షన్ పాయింట్లు

image

సీఎం జగన్ గురువారం నంద్యాల జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు డైవర్షన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం నుంచి వచ్చే వాహనాలు టౌన్‌లోకి అనుమతించకుండా  హైవే మీదుగా డైవర్షన్ చేయాలన్నారు. చామకాలువ నుంచి ఫ్లైఓవర్ మీదుగా బొమ్మల సత్రం, క్రాంతి నగర్‌లకు వెళ్లే వాహనాలను రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా మళ్లించారు. ఈ విషయాలను గమనించాలని కోరారు.

News March 27, 2024

నంద్యాల: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

బనగానపల్లె మండలంలోని కైప అప్పలాపురం గ్రామాల మధ్య ఆటో బోల్తాపడి ఒక వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం జరిగింది. టంగుటూరు గ్రామానికి చెందిన బాల చౌడయ్య(60) ఆటోలో స్వగ్రామానికి వెళుతుండగా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. దీంతో బాల చౌడయ్య మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలైనట్లు స్థానికులు వెల్లడించారు. బనగానపల్లె పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 27, 2024

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడింది: టీడీపీ ఎంపీ అభ్యర్థి

image

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు అన్నారు. బుధవారం కర్నూలు టీడీపీ కర్నూలు పార్లమెంట్ కార్యలయాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు  తమపై నమ్మకం ఉంచి కర్నూలు ఎంపీ సీటు ఇచ్చినందుకు రుణపడి ఉంటాను అన్నారు. ప్రజల మద్దతుతో ఎంపీగా గెలిచి చంద్రబాబుకు కనుక ఇస్తానన్నారు.

News March 27, 2024

ఆదోని MLA అభ్యర్థిగా పీవీ పార్థసారథి

image

ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిపై జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా పీవీ పార్థసారథిని బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీ టీడీపీ ఇన్‌ఛార్జ్ కే. మీనాక్షినాయుడు ఈ సీటును ఆశించిన విషయం తెలిసిందే.

News March 27, 2024

నంద్యాల జిల్లాలో 28న CM, 29న మాజీ CM పర్యటన

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ YCP, TDP అగ్రనేతలు గెలుపే ప్రధాన ఏజెండాగా పావులు కదుపుతున్నారు. ఈనెల 28న CM వైఎస్ జగన్ నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్ర చేపడుతుండగా, మరోవైపు మాజీ CM నారా చంద్రబాబు ఈనెల 29న ‘ప్రజాగళం’ పేరిట బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో YCP, TDP అధినేతలు జగన్, చంద్రబాబు తమ పార్టీ శ్రేణులలో వరుస కార్యక్రమాలతో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు.

News March 27, 2024

వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తీవ్ర ఆరోపణలు

image

వైసీపీపై నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కీలక ఆరోపణలు చేశారు. నంద్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యేగా తన హక్కులను ఇతరులకు బదిలీ చేస్తామన్నారు. తనను స్టిక్కర్ ఎమ్మెల్యేగా ఉండమన్నారు. దీంతో గెలిచిన 4 నెలలకే రాజీనామా చేద్దామనే భావన వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఉన్న అభిమానంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరా’ అని వెల్లడించారు.

News March 27, 2024

కర్నూలు: చెత్తకుప్పలో ఓటరు కార్డులు.. వీఆర్వోపై సస్పెన్సన్ వేటు

image

పత్తికొండ మండలం బొందిమడుగుల గ్రామ శివారులో చెత్తకుప్పలో పడేసిన ఓటరు గుర్తింపు కార్డుల ఉదంతంపై బాధ్యుడైన అప్పటి వీఆర్ఎ శ్రీనివాసులను సస్పెండ్ చేసినట్లు పత్తికొండ ఆర్డీవో రామలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసులు ఆస్పరి తహశీల్దారు కార్యాలయంలో వాచ్‌మెన్ విధులు నిర్వహిస్తున్నారు. విధులు పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.