India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆస్పరిలోని బొరుగుల బట్టి యజమాని ఇంటి ఆవరణలో చేతి గుర్తు ఉండే రక్తపు మరకలు, పక్కనే RCM చర్చి ఆవరణలోని వెనుక భాగంలో రక్తం మడుగులా ఉండటంతో CI హనుమంతప్ప సోమవారం పరిశీలించారు. ఆ రక్తపు మడుగును చీపురుతో కడిగే ప్రయత్నం చేశారని, అక్కడే సబ్బు ముక్కలు ఉన్నాయని తెలిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో విచారణ చేపట్టామని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. రక్తం మనిషిదా? జంతువుదా? తేలాల్సి ఉంది.
ఆదోని మండలం సంతేకుడ్లూరులో సోమవారం హోలీ సంబరాలు ఉత్సాహంగా సాగాయి. రతీ, మన్మథుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని యువకులు, పురుషులు మహిళల వేషధారణలో ముస్తాబై ఆలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు. ఐదు రోజులు సాగే సంబరాలకు గ్రామస్థులు ఎక్కడ ఉన్నా ఇక్కడికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చిన రతీ, మన్మథులను దర్శించుకున్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైలం క్షేత్రం సోమవారం భక్తజనంతో పోటెత్తింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వేలాది సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేపట్టారు. సాధారణ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
వడదెబ్బ తగిలి అయ్యన్న అనే రైతు మృతి చెందిన ఘటన కోసిగి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. కోసిగిలోని 2వ వార్డుకు చెందిన అయ్యన్న కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పొలం పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి పొలంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు కుమారులున్నారు.
పొత్తులో భాగంగా ఆదోని ఎమ్మెల్యే సీటు BJPకి కేటాయిస్తున్నారనే మీడియాలో ప్రచారం జరగడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మీనాక్షినాయుడు నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దయచేసి మీడియాలో వచ్చిన కథనాలను నమ్మొద్దని.. ఇంకా అధికారికంగా ప్రకటన కాలేదని తెలిపారు. ఆదోని ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి కేటాయించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
నందికొట్కూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు చెరుకుచెర్ల రఘురామయ్య 29న చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
సోమవారం ఆయన నందికొట్కూరులో మాట్లాడుతూ.. వైసీపీలో కష్టపడి పార్టీ కోసం సేవ చేసే వారికి గుర్తింపు లేకపోవడం వల్ల రాజీనామా చేశానన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామ చేశారు.
.
ఆదోని మండలం సంతేకుడ్లూరులో విచిత్ర ఆచారంతో హోలీ పండుగను జరుపుకుంటారు. 2 రోజుల పాటు సాగే ఈ వేడుకకు ఓ ప్రత్యేకత ఉంది. పురుషులంతా మహిళా వేషధారణలో రతీ మన్మధులను పూజిస్తారు. ఇలా పూజ చెయ్యటం వల్ల అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం. స్త్రీల మాదిరిగా పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలను చక్కగా అలంకరించుకుంటారు. గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండడానికి ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నామని చెప్తున్నారు.
ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్ టీడీపీలో చేరి అనంతపురం జిల్లా గుంతకల్లు టికెట్ ఆశించిన విషయం తెలిసిందే. అయితే అధిష్ఠానం ప్రకటించిన మూడో జాబితాలోనూ ఆయనకు టికెట్ కేటాయించలేదు. అక్కడి స్థానిక నేతల నుంచి వ్యతిరేకత, ఐవీఆర్ఎస్ సర్వేలో ప్రతికూలత రావడంతో గుమ్మనూరుకు టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆలూరుపై ఆశలు పెట్టుకున్న జయరాం కోట్ల సుజాతమ్మ మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
కర్నూలుకు చెందిన లతీఫ్ అనే వ్యక్తిపై 2టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. భార్యతో పాటు 8మంది ఆడ సంతానం కలిగిన ఇతను ఈనెల 1న 16 ఏళ్ల బాలికను నమ్మించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి పెళ్లి చేసుకునేందుకు యత్నించినట్లు సమాచారం. దీంతో తమ కూతురు కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు విషయం తెలిసి ఈనెల 21న బాలికను తిరిగి కర్నూలుకు తీసుకువచ్చాడు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో ప్రజల స్థిరాస్తులను లాక్కునేందుకు జగన్‌రెడ్డి కుట్ర పన్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆయన ఆదివారం కర్నూలులో మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారని, దీనికి జగన్‌రెడ్డి చేసిన చట్టమే కారణమన్నారు.
Sorry, no posts matched your criteria.