India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఎక్కడా వాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు పరీక్షకు 33,144 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా.. 32,334 మంది మాత్రమే హాజరయ్యారు. 810 మంది గైర్హాజరయ్యారు. సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు దాదాపుగా 44 పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.శామ్యూల్ వెల్లడించారు.
కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులను వివిధ మాధ్యమాల ద్వారా స్వీకరించడం జరుగుతోందని కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఫిర్యాదులను సీ-విజిల్ యాప్‌లో కానీ, హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కానీ, కర్నూలు జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 7755కు కానీ, కాల్ సెంటర్ 08518-220125కు కానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసే వారు డిఐపిఆర్ఓ_కర్నూలు ట్విట్టర్ అకౌంట్‌కు ఫిర్యాదును ట్యాగ్ చేయవచ్చన్నారు.
కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో పీజీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షకు సోమవారం నాడు 90 శాతం విద్యార్థులు హాజరైనట్లు యూనివర్శిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం 558 మంది విద్యార్థులకు గాను.. 53 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
జాతీయ సమ సమాజం పార్టీ నుంచి కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏపీ రామయ్య యాదవ్ తెలిపారు. సమాజ హితం కోసం సమసమాజ స్థాపనకై తమ పార్టీ ఆవిర్భవించిందని స్పష్టంచేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు ప్రజల తాగునీటి సమస్యను తీర్చి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే కర్నూలును అభివృద్ధి చేస్తానన్నారు.
కోడుమూరు మండలంలోని కొత్తూరు వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు వద్ద రోడ్డుపై వెళ్తున్న కొత్తూరు గ్రామానికి చెందిన ఎం.రామయ్య అనే(65) వ్యక్తిని కర్నూలు వైపు నుంచి కోడుమూరు వైపు వస్తున్న బొలెరో వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తప్పవని కలెక్టర్ జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే విధుల నుంచి తొలగిస్తామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారంలో పాల్గొంటే వెంటనే సస్పెండ్ చేస్తామన్నారు. అలా ఎవరైనా ప్రచారంలో పాల్గొంటే టోల్ ఫ్రీ నెంబర్: 1800 425 7755కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ వర్శిటీ, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సంయుక్తంగా ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్రా పోటీలు సోమవారం ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో రెండో రోజు కొనసాగాయి. రెండో రోజు Apj Abdul Kalam యూనివర్సిటీపై MJPR బరేలి యూనివర్సిటీ, శ్రీ కుషల్ దాస్ యూనివర్సిటీపై అన్నా విశ్వవిద్యాలయం, మాధవ్ యూనివర్సిటీపై ఉస్మానియా యూనివర్సిటీ, గొందావాన్ యూనివర్సిటీపై రాయలసీమ యూనివర్సిటీ జట్లు విజయం సాధించాయి.
నంద్యాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్, ఎస్పీజీ హైస్కూళ్లను వారు పరిశీలించి మాట్లాడారు. పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండానే ఎగరవేస్తామని ఆ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని పలు ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేనేత కార్మికులను కలిసి మగ్గం అల్లారు. మహిళలతో కలిసి కుట్టు మిషన్లు కుట్టారు. అభివృద్ధి, సంక్షేమం వైసీపీకి రెండు కళ్ళ లాంటివన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
ఆదోని ఎమ్మెల్యే టికెట్ పొత్తులో భాగంగా టీడీపీకే కేటాయించాలని ఆదోని జిల్లా సాధన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. టీడీపీని గెలిపించుకుని ఆదోనిలో ఆగిపోయిన అభివృద్ధిని మరలా కొనసాగించాలన్నారు. ఆదోని టికెట్టు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించరనే వార్తలు ప్రజలకు నిరాశ కలిగిస్తున్నాయన్నారు. చంద్రబాబు పునరాలోచన చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.