India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పదో తరగతి విద్యార్థులు సోమవారం నుంచి పరీక్షలు రాయబోతున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికారులు 134 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ కేటగిరి సెంటర్లు 62 కాగా పోలీస్ స్టేషన్ దగ్గరగా, పోలీస్ స్టేషన్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న బీ సెంటర్లు 57, పోలీస్ స్టేషన్‌కు ఎనిమిది కిలోమీటర్లకు పైగా ఉన్న సెంటర్లో 15 ఉన్నాయి. ఉదయం 9:30 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
హైదరాబాద్ రాజు మన కర్నూలు ఎంపీగా పని చేశారని మీకు తెలుసా? ఇది నిజమే. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(6వ నిజాం) 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అలాగే 1962లో అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో కర్నూలులో ఎవరు ఎంపీగా గెలుస్తారని మీరు భావిస్తున్నారు?
కర్నూలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఉన్న రాయలసీమ వర్సిటీని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని వైస్ ఛాన్స్‌లర్ సుధీర్ ప్రేమ్ కుమార్ ప్రకటించారు. వర్సిటీలో చదివే విద్యార్థులకు తప్పనిసరిగా ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి త్వరలో కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ శనివారం సాయంత్రంతోనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో YCP, TDP-JSP-BJP, కాంగ్రెస్, తదితర పార్టీల నేతలు ఇకపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరగనున్నారు. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ప్రచార పర్వం ఊపందుకోనుంది. ఈసారి ఎన్నికలలో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు హామీలు ఇవ్వనున్నారు.
పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద వంటి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుమిగూడి ఉండొద్దన్నారు. నంద్యాల జిల్లాలో 134 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారన్నారు. పరీక్ష కేంద్రానికి దగ్గరలో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరవకూడదని ఆదేశించారు.
కర్నూలు జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ కె.శామ్యూల్ వెల్లడించారు. . విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులేకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 31,070 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 6,020 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. 162 పరీక్షా కేంద్రాలను గుర్తించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల షెడ్యూలు రావడంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. కాన్వాసింగ్, లౌడ్ స్పీకర్స్, ఊరేగింపులు, మీటింగులు, బ్యానర్లు, పోస్టర్లు, హోల్డింగుల కోసం అనుమతులకు ఆన్‌లైన్‌లో (https://suvidha.eci.gov.in) ఎలా అప్లై చేసుకోవాలో డెమో నిర్వహించి అవగాహన కల్పించారు.
కర్నూలు: ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినందున “స్పందన” కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో, డివిజన్ స్థాయిలో, మున్సిపాలిటీ పరిధిలో, మండల స్థాయిలో కూడా స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కలెక్టర్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఆల్ ఇండియా అంతర్ విశ్వవిద్యాలయాల సెపక్ తక్రా పోటీలను ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. ఒకే రోజు జరిగిన 24 పోటీల్లో శ్రీకాకుళంపై రాయలసీమ యూనివర్సిటీ, జై నారాయణ వ్యాస్ విశ్వ విద్యాలయంపై కొచ్చిన్ విశ్వవిద్యాలయం, జైపూర్ నిర్వాణ విశ్వ విద్యాలయంపై యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, మాధవ్ యూనివర్సిటీ పింద్వరాపై మౌలానా ఆజాద్ జోడ్‌పూర్ విజయం సాధించాయి.
కర్నూలు పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా రామచంద్రయ్యను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో సీఎం జగన్ ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆదివారం కర్నూలులో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అభ్యర్థిగా రామచంద్రయ్యను అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమంలో ఆస్పరి మండల కార్యదర్శి రమేష్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.