Kurnool

News March 17, 2024

కర్నూలు: CM జగన్ బహిరంగ సభ వాయిదా

image

ఆలూరులో ఈనెల 20వ తేదీ నిర్వహించవలసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఆలూరు వైసీపీ అబ్జర్వర్ తెర్నేకల్ సురేందర్ రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. సీఎం బహిరంగ సభను ఎప్పుడు ఎక్కడ నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు.

News March 17, 2024

మ 3గం.లోపు అన్ని క్లియర్ చేయండి: నంద్యాల జిల్లా కలెక్టర్

image

నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన వేళ ఈ మ.3 గం.లోపు సచివాలయాలు, RBKలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని ప్రజా ప్రతినిధుల చిత్రపటాలను తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలన్నారు.

News March 17, 2024

కర్నూలు: ఆరోగ్యశ్రీ పేరుతో భారీ కుంభకోణం.. కేసులు నమోదు

image

కర్నూలులోని శ్రీగాయత్రీ ఆసుపత్రి నిర్వాహకుడు జిలానీబాషా, జ్యోతి డయాగ్నస్టిక్ మేనేజర్ కిరణ్‌పై నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌లో శనివారం కేసునమోదైంది. వైఎస్సా‌ర్ ఆసరా పథకం కింద 2022 ఏప్రిల్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 1,470మందికి పైగా పక్షవాత రోగులకు చికిత్స చేసినట్లు తప్పుడు నివేదికలతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.రూ.5.28 కోట్లు అవినీతికి పాల్పడినట్లు విచారణలో బయటపడటంతో ఆసుపత్రి అనుమతిని రద్దు చేశారు.

News March 17, 2024

కర్నూలు జిల్లా YCPలోనే అత్యధిక మార్పులు

image

కర్నూలు జిల్లా YCPలో భారీగా MLA, MP అభ్యర్థుల మార్పులు చోటు చేసుకున్నాయి. నంద్యాల జిల్లాలో నందికొట్కూరు MLA అభ్యర్థిని మాత్రమే CM జగన్ మార్చారు. కాగా కర్నూలు జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలకు గాను నలుగురు MLA, MP అభ్యర్థిని మార్చడం చర్చనీయాంశంగా మారింది. MP అభ్యర్థి బీవై రామయ్యతో పాటు, ఇంతియాజ్, బుట్టా రేణుక, డా.సతీష్, విరూపాక్షి MLA అభ్యర్థిత్వానికి కొత్తవారు కావడం గమనార్హం.

News March 17, 2024

నంద్యాల జిల్లాలో ఒక అభ్యర్థి మినహా.. అందరూ రెడ్డిలే

image

నంద్యాల జిల్లాలోని నందికొట్కూర్ అభ్యర్థి డా.ధారా సుధీర్(SC) మినహా మిగిలిన వారందరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం గమనర్హం. డోన్-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, BPL-కాటసాని రామిరెడ్డి, NDL-శిల్పా రవిరెడ్డి, PNM-కాటసాని రాంభూపాల్ రెడ్డి, ALG -గంగుల బ్రిజేంద్రారెడ్డి, SRLM-శిల్పా చక్రపాణి రెడ్డి MLA అభ్యర్థులుగా వైసీపీ ప్రకటించింది. నంద్యాల MP అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి ఆ సామాజికవర్గం వారే.

News March 17, 2024

కర్నూలు: ఈనెల 20న సీఎం జగన్ రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న సీఎం జగన్ ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఆలూరు నియోజకవర్గంలో రెండు దఫాలుగా వైసీపీ విజయం సాధిందించి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కాదని విరుపాక్షికి టికెట్ కేటాయించడంతో మూడోసారి వైసీపీ జెండా ఎగరాలని సీఎం పర్యటిస్తున్నట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.

News March 16, 2024

ఎన్నికల నియమావళి అమలు: కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కృష్ణ కాంత్‌తో కలిసి ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించడం జరుగుతుందన్నారు.

News March 16, 2024

నంద్యాల: ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో స్పందన రద్దు

image

దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఈ మేరకు ప్రతి సోమవారం నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వ్యయ ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

News March 16, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో MLA బరిలో ఇద్దరు మహిళలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 MLA స్థానాలు, 2 MP స్థానాలు ఉన్నాయి. వీటిలో YCP అధిష్ఠానం ఇద్దరు మహిళా నేతలకు MLA స్థానాలను కేటాయించింది. పత్తికొండ MLA అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని, ఎమ్మిగనూరు MLA అభ్యర్థిగా బుట్టా రేణుకను ప్రకటించింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను.. ఇద్దరు మహిళా నేతలను YCP పోటీలో నిలిపింది.

News March 16, 2024

అసంతృప్తితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవేంద్ర

image

బీజేపీలో కష్టపడి పని చేసిన పార్టీ అధిష్ఠానం గుర్తించడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. శనివారంలోని నరసింహారెడ్డి నగర్‌లో ఆయన జన్మదిన వేడుకలు అనంతరం బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్‌కు పోటీ చేయాలంటూ రాఘవేంద్రపై వర్గం ఒత్తిడి తీసుకువచ్చింది.