Kurnool

News November 11, 2024

కర్నూలు: 1988-1993 పూర్వ విద్యార్థుల సమ్మేళ్లనం

image

తుగ్గలి మండలం పెండేకల్ (ఆర్.ఎస్.) జెడ్.పి.హెచ్.యస్ లో 1988-1993 వరకు చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. గురువుల సమక్షంలో సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తమతో పాటు విద్యను అభ్యసించి మృతి చెందిన 9 మంది విద్యార్థులను స్మరించుకొని వారికి నివాళులర్పించారు. పాఠశాలకు ప్రింటింగ్ ప్రెస్ జిరాక్స్ మిషన్‌ను బహుకరించారు.

News November 11, 2024

కర్నూలు జిల్లాలో TODAY TOP NEWS

image

* నందవరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
* శ్రీశైలంలో డ్రోన్ కలకలం.. ఆలయ సిబ్బంది అదుపులో యువకులు
* ఆదోనిలో వైసీపీ నుంచి బీజేపీలోకి చేరికలు
* ఎమ్మిగనూరు: గుండెపోటుతో యువకుడు మృతి
* ఎమ్మిగనూరులో ఈ నెల12న జాబ్ మేళా
* నంద్యాల: రేపు ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ: కలెక్టర్ రాజకుమారి గణియా
* కర్నూలు: టీడీపీ యాదవులకు తీరని అన్యాయం చేసింది: అయ్యన్న యాదవ్

News November 10, 2024

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసింది: ఎంపీ

image

వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను గాలికి వదిలేసిందని ఎంపీ నాగరాజు అన్నారు. ఆదివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ మోడల్ హైస్కూలులో జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, ఎంఈఓ, హెచ్ఎంలను సన్మానించారు. ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యారంగం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. డీఈవో శామ్యూల్ పాల్, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు పాల్గొన్నారు.

News November 10, 2024

‘మచిలీపట్నం-ధర్మవరం రైలు బెంగళూరు వరకు పొడిగించండి’

image

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం రైలును బెంగళూరు వరకు పొడిగించాలని సౌత్ వెస్ట్రన్ రైల్వేను దక్షిణ మధ్య రైల్వే కోరింది. ఈ రైలు ధర్మవరం చేరుకున్న తర్వాత 7.40 గంటల పాటు ట్రాక్‌పై ఉండటం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ రైలును బెంగళూరు వరకు పొడిగించాలని అభ్యర్థించింది. SWR అంగీకారంతో ఇది సాకారం కానుంది.

News November 10, 2024

గుడిసె కృష్ణమ్మకు నిరాశ

image

సీఎం చంద్రబాబు ప్రకటించిన నామినేటెడ్ పదవుల రెండో విడత జాబితాలోనూ ఆదోనికి చెందిన టీడీపీ నాయకురాలు గుడిసె కృష్ణమ్మకు పదవి వరించలేదు. నామినేటెడ్ పదవి దక్కుందని భావించిన కృష్ణమ్మకు మరోసారి నిరాశే మిగిలింది. మంత్రి లోకేశ్ గతంలో చేపట్టిన యువగళం పాదయాత్రలో కృష్ణమ్మకు హామీ ఇచ్చినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ పదవి అయినా దక్కుతుందని ఆమె వర్గం ఆశిస్తోంది.

News November 10, 2024

కర్నూలు, నంద్యాల జిల్లాలో రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్లు వీరే..!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీరికి రాష్ట్రస్థాయి బెస్ట్ టీచర్ అవార్డులు దక్కాయి. ☞  హెచ్.సత్యనారాయణ రావు (HM, జడ్పీ హై స్కూల్-వెలుగోడు)☞ డా.తొగట సురేశ్ (HM, డోన్)☞ ఎం.ఖాజా బేగ్ (SA-హిందీ, ZPHS ఎస్.బోయినపల్లి, వెల్దుర్తి మండలం)☞ కే.సత్యప్రకాశ్ (SGT, MPPS KASBA బనగానపల్లె)☞ బీ.నాన్సీ మేరీ (SA-సోషల్, ZPHS ఎర్రగుంట్ల, సిరివెళ్ల మండలం)☞ ML ప్రేమకాంత్ బాబు (SGT, MPUPS పుసులూరు, నంద్యాల మండలం)

News November 10, 2024

సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు రెండోసారి వరించిన పదవి

image

కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్మన్‌గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు నియామకమయ్యారు. 1982 నుంచి టీడీపీలో చేరిన ఆయన పార్టీ పట్ల అంకితభావంతో పనిచేస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక 2016లో కుడా తొలి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయన సేవలను గుర్తించి రెండోసారి కుడా ఛైర్మన్‌గా నియమించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 10, 2024

శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు త్వరలో కమిటీ

image

శ్రీశైలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని CM చంద్రబాబు అన్నారు. ‘శ్రీశైలం సమీపంలో గుహలు, కొండలు ఉన్నాయి. సమీప కొండల వద్ద ట్రెక్కింగ్, ధ్యాన కేంద్రం ఉన్నాయి. శ్రీశైలంలో రోడ్ల వెడల్పుతో పాటు రింగ్ రోడ్డును నిర్మించాం. త్వరలో శ్రీశైలం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మంత్రులు పవన్, బీసీ జనార్దన్ రెడ్డి, ఆనం, దుర్గేశ్‌తో ఓ కమిటీ ఏర్పాటు చేస్తాం’ అని CM చంద్రబాబు స్పష్టం చేశారు.

News November 10, 2024

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి : ఎస్పీ

image

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ అన్నారు. శనివారం కర్నూల్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ట్రాఫిక్ అవేర్నెస్, కౌన్సెలింగ్ సెంటర్ ను జిల్లా ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రతా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కర్నూలు డిఎస్పీ, సీఐలు పాల్గొన్నారు.

News November 9, 2024

కర్నూలు: 30 ఏళ్లకు ఇంటికి చేరాడు

image

ఎమ్మిగనూరుకు చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి 30 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల వెతికినప్పటికీ ప్రయోజనం లేదు. అయితే 30 ఏళ్ల తర్వాత నేపాల్ నుంచి శనివారం ఎమ్మిగనూరులోని సొంత వాళ్లను కలుసుకున్నారు. నేపాల్‌లో ఆశ్రమ నిర్వాహకులు, ఎమ్మిగనూరులోని వేదాస్ నిరాశ్రయుల వసతి గృహం డైరెక్టర్ సునీల్‌తో వివరాలు తెలుసుకొని ఏకంగా సొంతవాళ్లకు అప్పగించారు.