Kurnool

News March 17, 2024

కర్నూలు: ఈనెల 20న సీఎం జగన్ రాక

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 20న సీఎం జగన్ ఆలూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు పార్టీ కార్యాలయం వెల్లడించింది. ఆలూరు నియోజకవర్గంలో రెండు దఫాలుగా వైసీపీ విజయం సాధిందించి. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను కాదని విరుపాక్షికి టికెట్ కేటాయించడంతో మూడోసారి వైసీపీ జెండా ఎగరాలని సీఎం పర్యటిస్తున్నట్లు నాయకులు చర్చించుకుంటున్నారు.

News March 16, 2024

ఎన్నికల నియమావళి అమలు: కలెక్టర్

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలని కలెక్టర్ జి.సృజన అధికారులను ఆదేశించారు. శనివారం ఎస్పీ కృష్ణ కాంత్‌తో కలిసి ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించడం జరుగుతుందన్నారు.

News March 16, 2024

నంద్యాల: ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో స్పందన రద్దు

image

దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఈ మేరకు ప్రతి సోమవారం నిర్వహించాల్సిన స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వ్యయ ప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

News March 16, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో MLA బరిలో ఇద్దరు మహిళలు

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 MLA స్థానాలు, 2 MP స్థానాలు ఉన్నాయి. వీటిలో YCP అధిష్ఠానం ఇద్దరు మహిళా నేతలకు MLA స్థానాలను కేటాయించింది. పత్తికొండ MLA అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని, ఎమ్మిగనూరు MLA అభ్యర్థిగా బుట్టా రేణుకను ప్రకటించింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను.. ఇద్దరు మహిళా నేతలను YCP పోటీలో నిలిపింది.

News March 16, 2024

అసంతృప్తితో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాఘవేంద్ర

image

బీజేపీలో కష్టపడి పని చేసిన పార్టీ అధిష్ఠానం గుర్తించడం లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర అన్నారు. శనివారంలోని నరసింహారెడ్డి నగర్‌లో ఆయన జన్మదిన వేడుకలు అనంతరం బీసీ నేతలతో సమావేశం నిర్వహించారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం దేనికైనా సిద్ధం అన్నారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్‌కు పోటీ చేయాలంటూ రాఘవేంద్రపై వర్గం ఒత్తిడి తీసుకువచ్చింది.

News March 16, 2024

జగన్‌కు ఈసారి ఆ సెంటిమెంట్ కలిసొచ్చి విజయం వరించేనా..?

image

మరికాసేపట్లో ఇడుపులపాయలో వైసీపీ అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నారు. జిల్లాకు చేరుకున్న సీఎం ఇడుపులపాయ బయలుదేరి వెళ్లారు. మహానేత సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి ధర్మాన ప్రసాదరావు, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌లు అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. గత 2019 ఎన్నికల సమయంలో వీరు ఇద్దరే ఎన్నికల అభ్యర్థులను ప్రకటించారు. మరి అదే సెంటిమెంట్ ఈసారి ఎన్నికలలో కలిసొస్తుందా చూడాలి.