India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మంత్రాలయం నుంచి తిక్కారెడ్డి 2014, 2019లో TDP తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. అయితే 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన ఆయనకు కాదని ఈసారి రాఘవేంద్రరెడ్డికి టికెట్ కేటాయించారు. దీంతో తిక్కారెడ్డి వర్గం నిరసనలు చేపట్టింది. మూడో జాబితాలో అయినా తననే అభ్యర్థిగా ప్రకటిస్తారేమోనని ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో తిక్కారెడ్డి TDPలోనే కొనసాగుతారా? లేక వేరే పార్టీలోకి వెళ్తారా అనే చర్చ నడుస్తోంది.
నంద్యాల: ఎన్నికలు ముగిసే వరకు నాయకులు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుటకు పోలీస్ శాఖ వారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలకు అభ్యర్థులు, నాయకులు సహకరించాలన కోరారు.
గోనెగండ్లలోని లక్ష్మీపేటలో జరిగే ఒక పెళ్లికి ఎమ్మిగనూరు మండలం మల్కాపురానికి చెందిన ఎల్లారెడ్డి కుటుంబంతో పాటు వారి కుమారుడు అరుణ్ కుమార్(6) వచ్చాడు. పెళ్లి సందడిలో ఉండగా అరుణ్ కుమార్ కొంతమంది పిల్లలతో కలిసి సమీపంలోని ఎల్‌ఎల్‌సీ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈతకు దిగి ప్రమాదవశాత్తు నీట మునిగిపోయాడు. స్థానికులు బాలుడిని వెలికితీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ జి సృజన హెచ్చరించారు. శుక్రవారం ఎన్నికల అంశాలపై ఆర్వోలు, మునిసిపల్ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీ విజిల్ ఫిర్యాదులను నిర్దేశిత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు. కోడ్ ఉల్లంఘనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కర్నూలు పార్లమెంట్ స్థానాన్ని కురువలకు కేటాయించడం పట్ల కురువ, వాల్మీకి సంఘ నాయకులు శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ అభ్యర్థిగా కురువ కులస్థుడైన బస్తిపాటి నాగరాజు.. మంత్రాలయం అసెంబ్లీకి వాల్మీకి కులస్థుడైన రాఘవేంద్రరెడ్డికి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు MP, మంత్రాలయం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబుకు కానుకగా ఇస్తామన్నారు.
రుద్రవరం మండలంలోని శ్రీరంగాపురానికి చెందిన దండు గోపాలకృష్ణ అనే వ్యక్తికి హత్యాయత్నం కేసులో 5ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా కోర్టు విధించినట్లు ఎస్సై నిరంజన్ రెడ్డి తెలిపారు. 2017లో అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తిపై డబ్బుల విషయంలో హత్యాయత్నానికి పాల్పడడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ అనంతరం జడ్జి జైలు శిక్ష జరిమాన విధిస్తూ తీర్పనిచ్చారు
ఉమ్మడి కర్నూలు రాజకీయాల్లో బైరెడ్డి కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. తాజాగా నంద్యాల TDP MP అభ్యర్థిగా బైరెడ్డి శబరి ఖరారయ్యారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆమె నందికొట్కూరు మాజీ MLA బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె. మరోవైపు మాజీ మంత్రి బైరెడ్డి శేష శయనారెడ్డి, మాజీ MLA నరసింహరెడ్డికి మనవరాలు. కాగా ఆమె ఇటీవలే BJPకి గుడ్ బై చెప్పి, TDP చీఫ్ చంద్రబాబు సమక్షంలో TDPలో చేరారు.
టీడీపీ మూడో జాబితా విడుదల చేసింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్తిపాడు నాగరాజును ప్రకటించింది. నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు.
పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి 22 మంది లబ్ధిదారులకు బుధవారం సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ ఫొటోలు వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో హల్చల్ చేశాయి. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వ్యవహరించిన ఎమ్మెల్యేకి పత్తికొండ రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి గురువారం షో కాజ్ నోటీసులు జారీ చేశారు. కోడ్ ఉల్లంఘనపై 24గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఈ నోటీసును రెవెన్యూ అధికారులు ఆమెకు అందజేశారు.
టీడీపీ మూడో జాబితా ఇవాళ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో కర్నూలు ఎంపీ సీట్లు ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ టీడీపీ నాయకులలో నెలకొంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, నంద్యాల ఎంపీ అభ్యర్థిగా శబిరి పేర్లు ఉన్నట్లు సమాచారం. టీడీపీ అధికారిక ప్రకటనలో వారి పేర్లు ఉంటాయా..? లేదా ఎవరికి ఇచ్చే అవకాశం ఉందో కామెంట్ చేయండి.
Sorry, no posts matched your criteria.