Kurnool

News November 7, 2024

యురేనియం తవ్వకాలపై దుష్ప్రచారం: ఎంపీ నాగరాజు

image

కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలంటూ ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఎంపీ నాగరాజు మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్న దురుద్దేశంతోనే వైసీపీ నాయకులు ఈ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. యురేనియం లభ్యత, పరిశోధన కోసం ఎలాంటి బోర్ల తవ్వకాలు జరగడం లేదని అన్నారు. మరోవైపు యురేనియం తవ్వకాలంటూ అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ హెచ్చరించారు.

News November 7, 2024

కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయండి: కమిషనర్

image

కర్నూలులో ఈ నెల 15న వినాయక ఘాట్‌ వద్ద నిర్వహించనున్న కార్తీక దీపోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో కమిషనర్ ఛాంబర్‌లో నగరపాలక, ఫైర్, విద్యుత్, ట్రాన్స్‌కో, జలవనరుల, మత్సకార, పోలీసు శాఖల అధికారులతో పాటు కార్తీక దీపోత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కార్తీక దీపోత్సవం నాడు సమన్వయంతో పనిచేయాలన్నారు.

News November 6, 2024

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం

image

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. R&B కాంట్రాక్ట్ బిడ్‌లకు అర్హత కాల పరిమితిని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయంతో చిన్న, మధ్య తరగతి R&B కాంట్రాక్టర్లకు భారీ ఊరట లభించనుంది.

News November 6, 2024

ఆంగ్లో ఇండియన్స్ సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి ఫరూక్

image

రాష్ట్రంలో ఉన్న ఇండియన్స్ కుటుంబాల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ఆంగ్లో ఇండియన్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం మంత్రిని కలిసింది. గత ప్రభుత్వం ఆంగ్లో ఇండియన్స్ సమస్యలను విస్మరించిందని మంత్రి ఫరూక్ అన్నారు.

News November 6, 2024

కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్‌లో యురేనియం తవ్వకాలు లేవు: ఎస్పీ

image

దేవనకొండ మండలం, కప్పట్రాళ్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుపక్క గ్రామాల్లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం తవ్వకాలు లేవని ఎస్పీ తెలిపారు. యురేనియం తవ్వకాల గురించి వస్తోన్న వదంతులను ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.

News November 6, 2024

ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ కీలక వ్యాఖ్యలు!

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో వ్యక్తిగత అజెండాలకు తావులేదని, మన ఐక్యతకు భంగం కలిగించే శక్తులను తరిమికొడదామని కూటమి నేతలకు పిలుపునిచ్చారు. వ్యక్తిగత స్వార్థాలు పక్కన పెట్టి, పార్టీ మార్గదర్శకాలను గౌరవిస్తూ ముందుకు సాగడం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలు మన నాయకత్వాన్ని, మన కృషిని నిశితంగా పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.

News November 6, 2024

నంద్యాల IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

నంద్యాలకు చెందిన ఓ యువతి శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (ట్రిపుల్ ఐటీ)లో ఆత్మహత్యాయత్నం చేసింది. విష ద్రావణం తాగిన విద్యార్థిని వసతి గృహం సిబ్బంది గుర్తించి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ యువతి ప్రస్తుతం ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 6, 2024

నల్లమలలో మైమర్చిపోయేలా రైలు ప్రయాణం

image

నంద్యాల-గిద్దలూరు సమీపంలో గల నల్లమల అటవీ ప్రాంతంలోని రైలు మార్గం ప్రయాణికులు మైమరిచిపోయేలా ఉంటుంది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురియడంతో రైలు మార్గానికి ఇరువైపులా నల్లమల పచ్చటి అందాలతో కనువిందు చేస్తోంది. ఈ అపురూప దృశ్యాన్ని నల్లమల కొండల నుంచి చూస్తే ఎంతో ఆకట్టుకుంటోంది. బ్రిటిష్ కాలం నుంచి ఈ రైలు మార్గం అందుబాటులో ఉంది.

News November 6, 2024

‘ఈనెల 18న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి’

image

తమ సమస్యలను పరిష్కరించాలని గూడూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మెడికల్ ఆఫీసర్ ప్రత్యూషకు వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి జే.మోహన్, ఆశా వర్కర్స్ యూనియన్ మండల నాయకురాలు శేషమ్మ మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను అమలు చేయాలన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 18న కర్నూలు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆశా వర్కర్లకు పిలుపునిచ్చారు.

News November 5, 2024

ఈనెల 9న CM చంద్రబాబు శ్రీశైలం పర్యటన

image

ఈ నెల 9న నంద్యాల జిల్లాలో CM చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు CM శ్రీశైలం పర్యటన ఖరారైంది. 9న విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ సేవలను CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి CM పర్యటనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.