Kurnool

News July 30, 2024

కృష్ణా నదిలో పడవలు నడపవద్దు: శ్రీశైలం సీఐ నోటీసులు

image

శ్రీశైలం డ్యామ్‌కు కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో శ్రీశైలం పోలీసులు అప్రమత్తమయ్యారు. జలాశయం బ్యాక్ వాటర్‌లో పడవలు నడపొద్దు అంటూ ఏపీ టూరిజం మేనేజర్‌కు, స్థానిక మత్స్యకార బోట్ ఆపరేటర్లకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు నోటీసులు అందజేశారు. వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందని, సందర్శకుల శ్రేయస్సు దృష్ట్యా నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పన్నారు.

News July 30, 2024

ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనానికి అనుమతి లేదు

image

నల్లమల అభయారణ్యంలో వెలసిన శ్రీ ఇష్టకామేశ్వరి దేవి అమ్మవారి దర్శనానికి ఆగస్టు 1 తేదీ నుంచి అనుమతి నిలిపివేశారు. ఎన్టీసీఏ న్యూఢిల్లీ ఆదేశాల మేరకు నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వులో నక్కంటి రేంజ్ పరిధిలో జంగిల్ రైడ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. పులులు, వన్యప్రాణుల సంయోగ సమయంగా (గర్భం దాల్చే) పరిగణిస్తూ నల్లమల అభయారణ్యంలోని పర్యాటక ప్రదేశాలకు అనుమతి నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

News July 30, 2024

కర్నూలు: పొలం తగదాలో ఘర్షణ.. వ్యక్తి మృతి

image

పొలం గట్టు విషయంలో ఘర్షణపడి దాయాదిని హత్య చేశారు. పోలీసుల వివరాలు.. ఎమ్మిగనూరు(M) గుడేకల్‌కి చెందిన గోపాల్‌‌ సోమవారం పొలం గట్టున రాళ్లను పాతుతుండగా బాబాయ్ కామయ్య అడ్డుచెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. కామయ్యపై గోపాల్, అతడి బంధువులు గడ్డపారతో దాడిచేయగా మృతిచెందాడు. మృతుడి కుమారుడు పెద్దయ్య ఫిర్యాదు మేరకు గోపాల్, వీరేశ్, రామకృష్ణ, మహదేవ, నాగిరెడ్డి, నారయణ, ఉరకుందమ్మపై కేసు నమోదుచేశారు.

News July 30, 2024

సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఖరారు

image

సీఎం చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం రానున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో ఉండవల్లి నివాసం నుంచి 10.30 సున్నిపెంట హెలిప్యాడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో శ్రీశైలం చేరుకొని మల్లన్న దర్శించుకొనున్నారు. అనంతరం డ్యామ్ వద్ద కృష్ణమ్మకు జల హారతి, తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. గత ఏప్రిల్ 22నే ఆయన శ్రీశైలం వచ్చారు.

News July 30, 2024

కర్నూలు: ఆస్తి వివాదం..సోదరుడి హత్య

image

అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఓ హత్యకు దారితీసింది. TG, రాజోలి(M) పెద్దధన్వాడకి చెందిన శేషిరెడ్డి, సోదరులు చిన్ననాగిరెడ్డి, మహేశ్వర్‌రెడ్డి మధ్య 20ఏళ్లుగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. చిన్నశేషిరెడ్డి తన సోదరులపై దాడికి పాల్పడినట్లు రాజోలిలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు <<13730370>>మృతదేహాన్ని<<>> బైక్‌పై తీసుకొచ్చి సి.బెళగల్(M) కొత్తకొటలో పడేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదుచేశారు.

News July 30, 2024

శ్రీశైల మల్లన్న సేవలో అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా

image

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఆర్కే మీనా సోమవారం దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు ఈవో పెద్దిరాజు, అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం దేవస్థానం తరఫున శేష వస్త్రం, లడ్డు ప్రసాదాలు, జ్ఞాపికతో సత్కరించారు. ఆయన వెంట శ్రీశైలం సీఐ జి.ప్రసాదరావు ఉన్నారు.

News July 29, 2024

ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు?

image

సీఎం చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు సమాచారం. ఈ విషయమై జిల్లా అధికారులతో పాటు శ్రీశైలం ప్రాజెక్ట్ జల వనరుల శాఖ అధికారులకు ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యామ్ వద్ద సీఎం ప్రత్యేక పూజలు నిర్వహించి కృష్ణమ్మకు జల హారతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ మేరకు అధికారులు డ్యామ్ వద్ద తగు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.

News July 29, 2024

కేబినెట్ సమావేశం.. పాల్గొననున్న జిల్లా మంత్రులు

image

రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 2న జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో ఉమ్మడి కర్నూల్ జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఫరూక్ పాల్గొననున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.

News July 29, 2024

హోం మంత్రి అమిత్ షాను కలిసిన నంద్యాల ఎంపీ

image

నంద్యాల ఎంపీ డా.బైరెడ్డి శబరి కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాను సోమవారం కలిశారు. ఢిల్లీలోని కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ శబరి నంద్యాల పార్లమెంట్ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. పార్లమెంట్ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేయగా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ శబరి తెలిపారు.

News July 29, 2024

పేరుకే బహుళార్థక సాధక ప్రాజెక్టు.. నిర్వహణకు నిధులు నిల్.?

image

కృష్ణానదిపై నిర్మించిన రెండో అతిపెద్ద ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు.అప్పటి ప్రధాని నెహ్రూ ముందుచూపు ఏపీ తొలి సీఎం నీలం సంజీవరెడ్డి ఆలోచన ఇంజినీర్ల మేథోశక్తి కలగలిపిన అద్భుత కట్టడం. ‘నేడు నిర్వాహణకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో అరకొర నిధులు మంజూరయ్యాయి. గ్రీజుకు కూడా అధికారులు డబ్బులు పెట్టుకునే దుస్థితి వచ్చింది. లిఫ్ట్ కూడా పనిచేయటం లేదు’ పలువురు విమర్శిస్తున్నారు.