India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మండల కేంద్రమైన దేవనకొండలో మొండి గోడలకే పరిమితమైన ఉర్దూ పాఠశాల నిర్మాణ గదులు పూర్తిచేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కాకర్ల శాంతి కుమార్ కోరారు. ఈ మేరకు మంగళవారం డీఈవో శ్యాముల్ పాల్‌కు వినతిపత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాల భవనం ఏర్పాటు కోసం దేవనకొండ సంతమార్కెట్ వద్ద గ్రామ పంచాయతీ స్థలం ఇచ్చిందని, 2014లో నిర్మాణ పనులు ప్రారంభించి మొండి గోడలకే పరిమితం చేశారన్నారు.

గోనెగండ్ల మండల పరిధిలోని ఎస్.లింగందిన్నె వద్ద కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. అనంతపురం జిల్లా కొనకండ్లకు చెందిన కుమ్మరి హేమాద్రి, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి మంగళవారం కర్నూలుకు వెళ్తుండగా ఎస్.లింగందిన్నె సమీపంలో లారీ రివర్స్‌లో వచ్చి కారును ఢీకొంది. హేమాద్రికి తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక హేమాద్రి(38) మృతి చెందాడు.

ప్రభుత్వం తరఫున ట్రాన్స్ జెండర్లకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ట్రాన్స్ జెండర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ట్రాన్స్ జెండర్‌కు పెన్షన్ అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయంలో పదోన్నతులు పొందిన 11 మంది ఎస్ఐలు డీఐజీ కోయ ప్రవీణ్‌ను మంగళవారం కలిశారు. పదోన్నతులు రావడం అభినందనీయమని, మిగిలిన సర్వీసును కూడా రిమార్కు లేకుండా పూర్తి చేయాలని డీఐజీ వారికి సూచించారు. విధులలో మంచి ప్రతిభ కనబరచి మరిన్ని పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఐజీ మేనేజర్ విజయరాజు ఉన్నారు.

నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న పెండింగ్ కేసులపై కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ మంగళవారం సమీక్ష చేశారు. ముందుగా నంద్యాలకు వచ్చిన ఆయనకు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఘన స్వాగతం పలికారు. సాయుధ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. కేసుల పరిష్కారంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభం కానుంది. అర్హులకు ఏడాదికి 3సిలిండర్లు ఇవ్వనున్నారు. ‘దీపం పథకం’ కింద ఈ దీపావళికి తొలి సిలిండర్ అందజేయనుండగా నేటి నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభం కానుందని నంద్యాల JC విష్ణు చరణ్ తెలిపారు. లబ్ధిదారులు ముందుగా సొమ్ము చెల్లించాలని, సిలిండర్ డెలివరీ అయిన తర్వాత 24 నుంచి 48 గంటలలోపు తిరిగి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నగదు జమవుతుందని పేర్కొన్నారు.

రుద్రవరం మండలంలో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేసి క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేస్తూ డయేరియాను నియంత్రణలోకి తీసుకురావాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీవో, గ్రామీణ నీటి సరఫరా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా పీజీఆర్ఎస్, ఏపీ సేవా సర్వీసులు, నైపుణ్య గణన, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఫిర్యాదుదారుల నుంచి 115 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.

ఇసుకకు సీనరేజీ ఫీజు, డీఎంఎఫ్, మెరిట్ కింద మెట్రిక్ టన్నుకు రూ.88 ఉండగా, ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ పీ.రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

అక్టోబర్ 30 నుంచి నవంబర్ 3వ తేదీ వరకు చెన్నైలోని ఎస్ఆర్ఎం ఐఎస్టీలో జరుగుతున్న సౌత్ జోన్ కబడ్డీ పోటీలకు రాయలసీమ యూనివర్సిటీ జట్టు పయనమైంది. సోమవారం యూనివర్సిటీ హాల్లో ఎంపికైన జట్టుకు రాయలసీమ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఎన్టీకే నాయక్ క్రీడా దుస్తులను అందించి వీడ్కోలు పలికారు. స్పోర్ట్స్ డైరెక్టర్ శివ కిషోర్ కూడా పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.