India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీశైలం మహా క్షేత్రంలోని దక్షిణ మాడ వీధిలో నిత్య కళారాధన వేదికపై మంగళవారం జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో కళాకారులు విశేషంగా ఆకట్టుకున్నారు. వివిధ గేయాలకు నృత్యాలు చేసి అలరించారు. కాగా శ్రీశైలంలో స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు సజావుగా జరగాలని, లోక కళ్యాణార్థం కోసం ప్రతిరోజు నిత్య కళారాధన వేదిక ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు.
శ్రీశైలంలో మంగళవారం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన హుండీల లెక్కింపులో రూ.4,14,15,623ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 18 వరకు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా అందులో ఈ నగదుతోపాటు 322 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 8 కేజీల 520 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా ఇతర దేశాలకు చెందిన కరెన్సీలు కూడా సమకూరాయి. దేవస్థానం అధికారులు హుండీ లెక్కింపును పగడ్బందీగా చేపట్టారు.
శ్రీశైలంలో మంగళవారం దేవస్థానం ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆధ్వర్యంలో జరిగిన హుండీల లెక్కింపులో రూ.4,14,15,623ల ఆదాయం సమకూరింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 18 భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా అందులో ఈ నగదుతో పాటు 322 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారు, 8 కేజీల 520 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా ఇతర దేశాలకు చెందిన కరెన్సీలు కూడా సమకూరాయి. దేవస్థానం అధికారులు హుండీ లెక్కింపును పగడ్బందీగా చేపట్టారు.
న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తదితరులతో కలిసి ఆమె UNGA సమావేశాలకు హాజరయ్యారు. ఈ అసెంబ్లీ సెషన్లో భాగమైనందుకు సంతోషంగా ఉందని శబరి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పాల్గొన్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశారు. 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగుతాయి.
ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రంజిత్ బాషా లబ్ధిదారులకు టాయిలెట్స్ ఉత్తర్వులను మంజూరు చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని పిలుపునిచ్చారు.
నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్ రెడ్డి సెటైరికల్ ట్వీట్ చేశారు. జనాభాను పెంచే ఉద్దేశ్యంతో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు శాసన సభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ‘స్థానిక సంస్థల అర్హత నిబంధనల్లో సడలింపు చేస్తే జనాభా పెరుగుతుంది అంటా’ అంటూ శిల్పా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
నంద్యాల జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా FRS హాజరు వేయాలని, దాని ఆధారంగానే జీతభత్యాల చెల్లింపు ఉంటుందని స్పష్టం చేశారు. ZP డిప్యూటీ సీఈఓ, ఎంపీడీవోలు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు.
రూ.100 కోసం వ్యక్తిని చంపిన ఘటన కర్నూలులో సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. మమతానగర్కు చెందిన కృపానందం(27), రోజావీధికి చెందిన అజీజ్ ఇద్దరూ కల్లు తాగేచోట ఫ్రెండ్స్ అయ్యారు. సోమవారం కల్లు తాగి సంకల్బాగ్లోని ఓస్కూలు వద్ద బొమ్మ, బొరుసు ఆట ఆడారు. కృపానందం రూ.100 గెలుచుకోవడంతో తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని అజీజ్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో కృపానందం తలపై అజీజ్ రాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై త్వరితగతిన స్పందించి, పరిష్కరించాలని ఎస్పీ జి.బిందు మాధవ్ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 90 ఫిర్యాదులు వచ్చాయని ఎస్పీ తెలిపారు. వాటిని సంబంధిత అధికారులకు పంపించారు.
టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ఈ నెల 26వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలస్య రుసుం రూ.50 చెల్లింపుతో డిసెంబర్ 2 వరకు, రూ.200 రుసుంతో 9, రూ.500 రుసుంతో డిసెంబర్ 26వ వరకు గడువు ఉందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.