India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్పీ రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసుల కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం, పోలీసు సిబ్బందికి అనారోగ్య సమస్యల నుంచి తొలగిపోయి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.

చికెన్ ముక్క తిని రెండేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లా సుగాలి తండాకు చెందిన కృష్ణయ్య, మణి దంపతులు రాజంపేటలోని మన్నూరు సాతవీధిలో కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం వారు చికెన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అనంతరం పనుల్లో నిమగ్నమవ్వగా బాలుడు సుశాంక్(2) చికెన్ ముక్క మింగాడు. తర్వాత ఊపిరాడక మృతి చెందాడు.

పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. మిడుతూరుకు చెందిన ఓ యువతి ఇంటర్ చదువుతోంది. ఇటీవల బంధువుల నుంచి పెళ్లి సంబంధం వచ్చింది. దీంతో తనకు పెళ్లి చేస్తారేమో అని మనస్తాపం చెందిన యువతి విష ద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాణాసంచా స్టాల్స్ ఏర్పాటుకు లైసెన్స్‌లను అధికారులు నిబంధనల ప్రకారం మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిపై ఏమైనా నేర చరిత్ర ఉందా, లేదా అని పరిశీలించి లైసెన్స్ ఇవ్వాలని తెలిపారు. దుకాణాల మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూడాలన్నారు. ఒక క్లస్టర్‌లో 50 దుకాణాలకు మించి ఉండకూడదన్నారు.

రాష్ట్రంలోని ప్రముఖ కళా సంస్థలను ఆహ్వానించి ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటకాలు నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. ఆదివారం రాత్రి కర్నూలు టీజీవి కళాక్షేత్రంలో ఆరాధన ఆర్ట్స్ గుంటూరు వారిచే నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ‘మరీ అంత వద్దు’ సాంఘిక నాటికను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాటిక దర్శకుడు నడింపల్లి వెంకటేశ్వరరావును సత్కారించారు.

రాష్ట్రంలో నెలకొన్న విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి ఉద్యమాలే శరణ్యమని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గోకారి పేర్కొన్నారు. ఆదివారం కర్నూలులోని సలాం ఖాన్ భవనంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైనా రాష్ట్రంలోని 11 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.

మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించిన వ్యక్తికి దేహశుద్ధి చేశారు. ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్ సమీపంలో అరువు మీద భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుతుండగా.. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. భర్త అడ్డుకోవడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటాడి పట్టుకుని బాధిత మహిళ, భర్త ఇద్దరు కలిసి అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి పాతాళ గంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి మల్లన్న దర్శనానికి బారులు తీరారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.

నంద్యాల జిల్లా రుద్రవరంలో డయేరియా ప్రబలింది. స్థానిక ఎస్సీ కాలనీ, చంద్రుడుపేటలో ఇద్దరు మహిళలకు డయేరియా వ్యాధి సోకింది. వారిని నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఇటీవలే విజయనగం జిల్లా గుర్లలో డయేరియా ప్రబలిన విషయం తెలిసిందే.

డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ఎన్‌టీకే నాయక్ తెలిపారు. అభ్యర్థులు ఫలితాలను యూనివర్సిటీ <
Sorry, no posts matched your criteria.