Kurnool

News July 24, 2024

తాగునీటికి క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించాలి: కర్నూలు కలెక్టర్

image

వర్షాకాలం ముగిసేంతవరకు దాదాపు మరో నెల దాకా జిల్లాలో శానిటేషన్ డ్రైవ్‌ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో శానిటేషన్ డ్రైవ్ పై టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తాగునీటికి క్లోరినేషన్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.

News July 23, 2024

కర్నూలు: బోల్తాపడిన ఎరువుల లారీ..

image

ఎరువుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి బెళగల్ కస్తూర్బా పాఠశాల వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఏలాంటి ప్రమాదం జరగలేదు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కర్నూలు నుంచి బెళగల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎస్ఐ తిమ్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

News July 23, 2024

ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌‌తో వేల ఉద్యోగాలు

image

HYD-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా <<13688589>>ఓర్వకల్లు<<>> మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ ప్రాజెక్టుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీకారం చుట్టారు. 10,900 ఎకరాలను 11 గ్రామాల పరిధిలో సేకరించి ఏపీఐఐసీకి అప్పగించగా నోడ్‌ పాయింట్‌గా కేంద్రం 2020లో నోటిఫై చేసింది. ఇక్కడ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా వెయ్యి, పరోక్షంగా 3వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.

News July 23, 2024

ఓర్వకల్లుకు నిధులు ఇస్తాం: నిర్మలా సీతారామన్‌

image

ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని తెలిపారు. నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు అందజేస్తామన్నారు.

News July 23, 2024

కర్నూలు: దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు

image

కర్నూలు జిల్లా కోసిగిలో సోమవారం అర్ధరాత్రి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంకటేశ్ నాలుగు రోజుల కిందట కుటుంబంతో కలిసి వేరే ఊరెళ్లారు. గ్రామానికి చెందిన భీమయ్యతో పాటు మరో ఇద్దరు చోరీకి యత్నించారు. ఇది గమనించిన స్థానికులు భీమయ్యను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చోరీకి యత్నించిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

News July 23, 2024

డోన్‌లో గురుకులం సూపర్వైజర్ ఆత్మహత్యాయత్నం

image

డోన్ పట్టణ సమీపంలోని అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల సూపర్వైజర్ సుప్రజ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. గురుకులంలో విద్యార్థులచే చెత్త తొలగింపు పనులు చేపట్టడంతో ఆ వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారాయి. విద్యార్థులతో పని చేయించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు నెటిజన్లు వాట్సాప్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రిన్సిపల్ సూపర్వైజర్‌ను మందలించడంతో ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం.

News July 23, 2024

డెమో రైలు ప్రయాణికులకు గమనిక

image

నంద్యాల-రేణిగుంట డెమో రైలు (07284) జులై 22 నుంచి 26 వరకు కడప వరకు మాత్రమే వెళ్తుందని నంద్యాల రైల్వే స్టేషన్ మేనేజరు దొరస్వామి పేర్కొన్నారు. గుత్తి-రేణిగుంట మార్గంలో రైల్వే ఆధునికీకరణ పనులు జరుగుతున్నందున రైలు రేణిగుంట వరకు వెళ్లకుండా కడపలో ఆగుతుందని తెలిపారు. రేణిగుంట నుంచి బయలుదేరేందుకు బదులుగా కడప నుంచి రైలు (07285) బయలు దేరుతుందన్నారు. రైల్వే ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News July 23, 2024

భూ దందా మితిమీరిపోయింది: బైరెడ్డి

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ, పోరంబోకు అన్ని రకాల భూములలో అవకతవకలు జరిగాయని ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కర్నూలులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో విలువైన భూములను సర్వే నంబర్లు మార్చి వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు.

News July 23, 2024

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ

image

క్రెడిట్ కార్డు మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా సూచించారు. సైబర్ నేరగాళ్లు తాము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు ఇన్సూరెన్స్ యాడ్ చేస్తామని ఒక యాప్ లింక్ పంపి దాంట్లో మీ క్రెడిట్ కార్డు వివరాలు నమోదు చేయాలని అడుగుతారన్నారు. వివరాలు తెలపగానే క్రెడిట్ కార్డు నుంచి డబ్బులు మాయం చేస్తారని తెలిపారు. ఎవరైనా ఫోన్ ద్వారా వ్యక్తిగత వివరాలు అడిగితే చెప్పవద్దన్నారు.

News July 22, 2024

ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరిస్తాం: ఎస్పీ

image

నంద్యాలలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి 115 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎస్పీ అధిరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. CIలు రవీంద్ర, దస్తగిరి బాబు పాల్గొన్నారు.