Kurnool

News July 21, 2024

కర్నూలులో దారుణహత్య.. నిందుతుడి అరెస్ట్

image

కర్నూలు నగరంలోని రైల్వేస్టేషన్‌ కూడలి వద్ద ఈ నెల 17న శ్రీరాముడు అనే యాచకుడిని <<13651796>>హత్య<<>> జరిగిన విషయం తెలిసందే. ఈ హత్య కేసులో నిందుతుడైన పరుశురాముడును కర్నూలు రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందుతుడు ఇతర ప్రాంతాలకు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

News July 21, 2024

కర్నూలు జోన్-4లో 52మంది ఎస్ఐలు బదిలీ

image

కర్నూలు: జోన్-4(కర్నూలు, అనంతపురం రేంజ్) పరిధిలో 52మంది ఎస్సైలను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శనివారం బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వీరిని నియమించామని ప్రస్తుతం ఎన్నికలు ఎలక్షన్ కోడ్ ముగియడంతో వారివారి స్థానాలకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు

News July 21, 2024

నంద్యాల: గన్ మిస్‌ఫైర్.. ఆర్మీ జవాన్ మృతి

image

అవుకు మండలం జూనుంతల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో సీఐఎస్‌ఎఫ్ ఆర్మీ జవాన్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్(34) ప్రమాదవశాత్తు గన్ మిస్‌ఫైర్ అయ్యి మృతిచెందినట్లు అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని అవుకు మండలంలోని స్వస్థలానికి తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News July 20, 2024

BREAKING: నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విష్ణు చరణ్

image

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సీ.విష్ణు చరణ్‌ను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న సీ.విష్ణు చరణ్‌ను నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. నంద్యాల జేసీగా ఉన్న టీ.రాహుల్ కుమార్ రెడ్డిని సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు.

News July 20, 2024

శ్రీశైలం డ్యాం తాజా సమాచారం

image

జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు గేట్లతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 99,894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 814.5 అడుగులుగా నీటి నిలువ సామర్థ్యం 37.0334 టీఎంసీలుగా నమోదైంది.

News July 20, 2024

BREAKING: కర్నూలు JC, మున్సిపల్ కమిషనర్ బదిలీ

image

కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 62 మంది IAS అధికారుల బదిలీల్లో భాగంగా మౌర్యను తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా, భార్గవ్ తేజను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

ముచ్చుమర్రి ఘటనలో మృతి.. అంబటి ట్వీట్

image

ముచ్చుమర్రి బాలిక హత్యాచార ఘటనలో అనుమానితుడు హుస్సేన్ మృతి చెందడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ‘ముచుమర్రి బాలిక ఉదంతంలో హుస్సేన్ అనే అనుమానితుడు లాకప్ డెత్ కావడంపై తక్షణమే విచారణ జరపాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు హుస్సేన్ లాకప్ డెత్ అయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.

News July 20, 2024

జిల్లాస్థాయి యోగా పోటీలు ప్రారంభం

image

కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియంలో జిల్లాస్థాయి యోగా ఎంపిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా కార్పొరేటర్ శ్వేతారెడ్డి, న్యాయవాది శ్రీధర్ రెడ్డి, డీఎస్డీఓ భూపతి రావు, యోగా సంఘం సభ్యులు బ్రహ్మానందరెడ్డి, సాయికృష్ణ, అవినాశ్ హాజరై ప్రారంభించారు. దైనందిక జీవితంలో యోగా అంతర్భాగమైనప్పుడే ఆరోగ్యంగా జీవించవచ్చని వారన్నారు. 450 క్రీడాకారులు పాల్గొన్నారు.

News July 20, 2024

తుపాకీ పేలి నంద్యాల జిల్లాకు చెందిన జవాన్ మృతి

image

BDL భానూరులో CISF జవాను శనివారం మృతిచెందారు. విధుల్లో ఉండగా తుపాకీ పేలి తూటా తలలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో జవాను వెంకటేశ్‌(34) అక్కడికక్కడే మృతిచెందారు. బస్సులో నుంచి కిందకు దిగుతున్న క్రమంలో ఆయన వద్ద ఉన్న గన్‌ మిస్‌ ఫైర్‌ అయి ప్రమాదం జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతల గ్రామానికి చెందిన వెంకటేశ్‌ హైదరాబాద్‌లోని సీఐఎస్‌ఎఫ్‌ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నారు.

News July 20, 2024

కర్నూలులో సినీ నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు

image

సినీ నటి శ్రీరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, హోం మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ బీసీ సెల్ నాయకుడు రాజుయాదవ్ ఫిర్యాదు మేరకు కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా వేదికగా తమ నేతలను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని రాజుయాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.