Kurnool

News July 19, 2024

కుష్టు వ్యాధిని నిర్మూలిద్దాం: డీఎంహెచ్‌వో

image

జిల్లా ప్రజలు, వైద్య ఆరోగ్య సిబ్బంది కలిసికట్టుగా పనిచేసి కుష్టు వ్యాధిని నిర్మూలిద్దామని నంద్యాల డీఎంహెచ్‌వో డాక్టర్ ఆర్.వెంకటరమణ పేర్కొన్నారు. గురువారం వైద్య సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి టెక్కే వరకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.

News July 18, 2024

కర్నూలు యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలు నియామకం

image

కర్నూలులో ఉన్న రెండు ప్రధానమైన యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమిస్తూ గురువారం ప్రభుత్వం జీవో విడుదల చేసింది. రాయలసీమ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వైస్ ఛాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ ఎన్‌టీకే నాయక్, డాక్టర్ అబ్దుల్ అక్ష ఉర్దూ యూనివర్సిటీకి కడప యోగి వేమన యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ పటాన్ షేక్ షాషావలి ఖాన్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News July 18, 2024

నంద్యాల: ఆ రెండు రైళ్ల పునరుద్ధరణ

image

రైల్వే డివిజన్ పరిధిలో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జులై 21 నుంచి నరసాపూర్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు – డోన్ ఎక్స్ ప్రెస్‌ను నడపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జులై 22 నుంచి డోన్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్, గుంటూరు-నరసాపూర్ ఎక్స్ ప్రెస్‌ను పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైల్వే ప్రయాణికులు గమనించాలని కోరారు.

News July 18, 2024

కర్నూలులో దారుణ హత్య.. UPDATE

image

కర్నూలులో నిన్న <<13648791>>హత్య<<>> జరిగిన విషయం తెలిసిందే. తాడిపత్రికి చెందిన శ్రీరాములు యాచకుడిగా జీవిస్తున్నారు. అదే వృత్తిలో ఉన్న ఫాతిమాతో పరిచయం ఏర్పడింది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉండగా ఒక కూతురు శ్రీరాములు ద్వారా జన్మించినట్లు తెలిసింది. శ్రీరాములు కూతురితో పరశురాం అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. గొడవ జరగ్గా శ్రీరాములిని బండరాయితో కొట్టి పరశురాం హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

News July 18, 2024

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు

image

కర్నూల్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.85 ఉండగా 94 పైసలు తగ్గి నేడు రూ.108.91కు చేరింది. డీజిల్ 87 పైసలు తగ్గి నేడు లీటర్ రూ.96.80గా ఉంది. నంద్యాల జిల్లాలో నిన్న లీటర్ పెట్రోల్ ధర రూ.109.89 ఉండగా 20 పైసలు పెరిగి నేటికి రూ.110.09కు చేరింది. 18 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్‌ ధర రూ.97.87గా ఉంది.

News July 18, 2024

నంద్యాల జిల్లాకు వర్ష సూచన

image

అల్పపీడనం ప్రభావంతో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగిలినచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు రైతులు, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News July 18, 2024

రహదారి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయండి: కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

image

రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్ర అభివృద్ధికి చక్కటి బాటలు వేయాలని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారులతో రాష్ట్రంలోని రహదారులను అనుసంధానం చేస్తూ వివిధ దశల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులు, భూ సేకరణ సమస్యలు, నూతనంగా నిర్మించాల్సిన రహదారులపై ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

News July 17, 2024

కర్నూలు జిల్లాలో మరోసారి చిరుత పులి పంజా

image

కర్నూలు జిల్లా కోసిగిలో బుధవారం చిరుత పులి సంచారం కలకలం రేపింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో రాముడు అనే వ్యక్తి గొర్రెల మందను ఏర్పాటు చేసుకున్నాడు. తెల్లవారుజామున చిరుత పులి గొర్రెల మందపై దాడి చేసింది. గమనించిన రాముడు కేకలు వేయడంతో పారిపోయింది. కాగా చిరుత దాడిలో ఒక గొర్రెపిల్ల మృతిచెందింది. చిరుత పులి తరచూ దాడులు చేస్తోందని, తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

News July 17, 2024

BIG BREAKING: ముచ్చుమరి ఘటనలో CI, SI సస్పెండ్

image

నంద్యాల జిల్లా ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో వాసంతి కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మిస్సింగ్ కేసు నమోదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకుగాను నందికొట్కూరు రూరల్ సీఐ ఓ.విజయ భాస్కర్, ముచ్చుమర్రి ఎస్ఐ ఆర్.జయశేఖర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కర్నూలు రేంజ్ డీఐజీ సీహెచ్.విజయరావు ఉత్తర్వులు జారీ చేశారు.

News July 17, 2024

నంద్యాల: ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2024 సంవత్సరానికి అర్హులైన ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సుధాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. http://nationalawardstoteacher.education.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.