India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇద్దరూ స్నేహితులు మరణంలోనూ స్నేహబంధాన్ని వీడలేదు. పత్తికొండ మండలం దూదేకొండ గ్రామానికి చెందిన సురేశ్(18), మణికుమార్(19) పత్తికొండ నుంచి సొంతూరుకు బయలుదేరారు. దూదేకొండ గ్రామ సమీపంలోని సుకాలి నాగమ్మ ఆలయం వద్ద ముందు వెళుతున్న ఎద్దుల బండిని ఢీకొట్టారు. స్థానికులు వారిని సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యుల తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉపాధి మార్గాలను అన్వేషించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి కల్పన అధికారులను ఆదేశించారు. మంగళవారం ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ప్రతాపరెడ్డి, జూనియర్ ఎంప్లాయిమెంట్ అధికారి సోమశివారెడ్డి తదితరులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారికి పలు సూచనలు చేశారు.
గుండెపోటుకు గురైన నంద్యాల జిల్లా వ్యక్తికి క్షణం ఆలస్యం చేయకుండా వైద్యం అందించి గుత్తి డాక్టర్లు బతికించారు. డోన్ మండలం కొత్త బురుజుల గ్రామానికి చెందిన చిన్న ఓబులేసు అనంతపురం వెళ్తుండగా గుత్తి సమీపంలో ఛాతీ నొప్పికి గురయ్యారు. వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎల్లప్ప గుండెపోటును నివారించే ఇంజక్షన్ ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించారు.
డేటింగ్ యాప్‌లతో యువతులకు వల విసిరి పెళ్లి చేసుకుంటానని మోసాలకు పాల్పడుతున్న నంద్యాల జిల్లా యువకుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సంజామల మండలానికి చెందిన చిన్ని రెడ్డి శ్రీనాథ్ రెడ్డి.. టిండర్, నీతో డేటింగ్ అనే యాప్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని నమ్మించి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. మోసపోయానని తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి బండారం బయటపడింది.
నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ఘటనలో బాలిక మృతదేహం ఇంకా దొరకలేదని జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ తెలిపారు. ‘బాలికను ముగ్గురు మైనర్లు అత్యాచారం చేశారు. ఆ తర్వాత హత్య చేశారు. మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేశాం. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో గాలిస్తున్నాం. మృతదేహం ఇంకా దొరకలేదు’ అని ఎస్పీ తెలిపారు.
శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రం తదుపరి ఈవోగా IAS అధికారిని నియమించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయం అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గతంలో IAS అధికారి డా.నారాయణ భరత్ గుప్తా ఈవోగా ఉండగా, ఆయనకు ప్రభుత్వం కమిషనర్ ర్యాంక్ అధికారాలను కల్పించింది. కాగా అత్యధికంగా గ్రూప్-1 ర్యాంక్ అధికారులు ఈవోలుగా పని చేశారు.
కర్నూలు జిల్లా ఎస్పీగా జీ.బిందు మాధవ్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడకు చెందిన బిందుమాధవ్ 2017 బ్యాచ్‌కు చెందిన IPS అధికారి. SVPNPAలో శిక్షణ తర్వాత మొదట ప్రకాశం జిల్లా గ్రేహౌండ్స్‌లో పని చేశారు. అనంతరం రంపచోడవరం ఏఎస్పీగా, గుంటూరు సెబ్ జాయింట్ డైరెక్టర్‌గా, పల్నాడు అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత గ్రేహౌండ్స్ ఎస్పీగా, పల్నాడు జిల్లా ఎస్పీగా పని చేశారు.
100 రోజుల కార్యచరణ ప్రణాళికలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకుంటానని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. సోమవారం కర్నూలు జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. అంతకుముందు ఏఆర్ సిబ్బందిచే గౌరవవందనం స్వీకరించారు.
నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్డులో అల్లుకుపోయిన పచ్చటి దట్టమైన చెట్లతో నల్లమల అడవి అబ్బురపరుస్తుంది. దీనికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచు దుప్పటి నల్లమలను కప్పేసింది. ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలను తలపించేలా పొగ మంచు అందాలు ప్రయాణికులు, పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. నంద్యాల నుంచి విజయవాడకు బస్సు, రైలు మార్గం ద్వారా ప్రయాణించే వారు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు.
వైసీపీ పాలనలో ‘సహజవనరుల దోపిడి’పై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 1.75లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 1145 ఎకరాలు పేదలకు చెందిన భూమిని 856మంది వైసీపీ నేతలు రాయించేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలకు రూ.300కోట్ల భూమిని 33ఏళ్లు లీజుకు తీసుకున్నారని వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.