India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నంద్యాలలోని డా.వైఎస్ఆర్ సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి వినతులను స్వీకరించారు. అర్జీలను యుద్ధ ప్రాతిపాదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు అలసత్వం వహించరాదని కలెక్టర్ హెచ్చరించారు. జేసీ టీ.రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పదో తరగతి అర్హతతో BPM/ABPM ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. కర్నూలు డివిజన్‌లో 37, నంద్యాల డివిజన్‌లో 35 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. SHARE IT
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సగటు దినసరి కూలీ రూ.300 కూలీ మొత్తానికి చేరుకునేలా పనులు కల్పించాలని కలెక్టర్ రాజకుమారి ఎంపీడీఓలు, సంబంధిత ఏపీడీలను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్‌లో ప్రజా సమస్య పరిష్కార వేదికలో భాగంగా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.250 వేతనాన్ని అధిగమించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. 161 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు. వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కర్నూలు నూతన ఎస్పీగా జీ.బిందు మాధవ్ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన ఏఆర్ పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు.
మద్దికేర మండల కేంద్రానికి సమీపాన ఉన్న మల్లప్ప గేటు దగ్గర సోమవారం తెల్లవారుజామున గూడ్స్ ట్రైన్ కిందపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ మేరకు గుంతకల్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. మృతిచెందిన వ్యక్తి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో గుర్తించలేకపోయామన్నారు. ఎవరైనా గుర్తిస్తే గుంతకల్లు ఆర్పీఎఫ్ స్టేషన్ ఫోన్ నంబర్‌కు 9550111589 తెలపాలని కోరారు.
చెల్లిపై అత్యాచారాని పాల్పడిన ఘటన అలస్యంగా వెలుగుచూసింది. DSP శ్రీనివాస్ వివరాలు..డోన్‌కు చెందిన కేశవులు ఉమ్మడి మహబూబ్‌నగర్(D) బిజినేపల్లి(M) కూలి పనికి వెళ్లాడు. వండి పెట్టేందుకు వెళ్లిన చెల్లిపై కేశవులు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లికి తెలియడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బలాన్‌పల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కేశవులుని పోలీసులు విచారించగా విషయం బయటపడింది. కేశవులును రిమాండ్ తరలించారు.
పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తెలిపారు. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో కాటసానిని విమర్శించినందుకు తనపై కక్ష పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిపై ఎస్పీ క్రిష్ణకాంత్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అవినీతిని బయటపెట్టి తీరుతామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన ప్యాపిలిలో మాట్లాడారు. బుగ్గన అధికారంలో ఉన్నప్పుడు ఆయన అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేశారన్నారు. ఇప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు.
నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ హాజరు కావాలని ఆమె తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.