Kurnool

News July 14, 2024

శ్రీ మఠంలో కార్తీక దీపం సీరియల్ నటి జోష్ణ

image

మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని కార్తీకదీపం సీరియల్ నటి జోష్ణ ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు శ్రీ మఠం అధికారులు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ దేవిని, గురు రాయల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సీరియల్ నటితో ఫొటోలు దిగడానికి ప్రేక్షకులు పోటీపడ్డారు. ఆమెకు శ్రీమఠం సెక్యూరిటీ సిబ్బంది భద్రత కల్పించారు.

News July 14, 2024

ఈనెల 18, 19న రాష్ట్రస్థాయి చెస్ పోటీలు

image

నంద్యాలలో ఈ నెల 18, 19న అండర్-19 రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆదివారం తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపిక అవుతారని తెలిపారు.

News July 14, 2024

రెండేళ్లలో కేఈ శ్యామ్ బాబుకు మంత్రి పదవి: మాజీ ఉప ముఖ్యమంత్రి

image

పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ బాబుకు రెండేళ్లలో మంత్రి పదవి వస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. పత్తికొండలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేఈ శ్యామ్ బాబుకు మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చోటు కల్పిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.

News July 14, 2024

‘అప్పుడు అరగంటలో పంపారు.. ఇప్పుడు నంద్యాల ఎస్పీగా వస్తున్నారు’

image

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేస్తున్న అధిరాజ్‌ సింగ్‌ రాణాను నంద్యాల ఎస్పీగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన 2018 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో ఆదోని ఏఎస్పీగా అధిరాజ్‌సింగ్‌ రాణాకు బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న అరగంటలోనే అప్పటి పాలకులు బదిలీ చేయించారు. ప్రస్తుతం నంద్యాలకు ఎస్పీగా రానున్నారు.

News July 14, 2024

కర్నూలు SPగా మొదటి పోస్టింగ్.. విమర్శలు, ప్రసంశలు

image

కర్నూలు SP కృష్ణకాంత్ నెల్లూరుకు బదిలీ అయ్యారు. ఈయన 2023 ఏప్రిల్ 12న కర్నూలు SPగా వచ్చారు. మొదటి పోస్టింగే అయినా అంతగా ప్రభావం చూపలేదనే విమర్శలు ఉన్నా.. నిత్యం ప్రజల్లో ఉండేవారని, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేశారనే ప్రసంశలూ అందుకున్నారు. YS వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు కర్నూలుకు వచ్చిన CBI అధికారులకు సహకరించలేదనే విమర్శలున్నాయి.

News July 14, 2024

నేడు ఇసుక డిపోకు సెలవు

image

కర్నూలు జిల్లా కౌతాళం మండలం గుడికంబాలి ఇసుక డిపోకు ఆదివారం సెలవు ఉంటుందని డిపో నిర్వహణ అధికారి, గ్రామ రెవెన్యూ కార్యదర్శి నాగార్జున తెలిపారు. గుడికంబాలి ఇసుక డిపో నుంచి 6వ రోజైన శనివారం 91 వాహనాల్లో 1,334 టన్నుల ఇసుకను విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు. డిపో వద్ద అక్రమంగా ఎత్తుకెళ్లకుండా పోలీసులు కాపలా ఉన్నట్లు వివరించారు.

News July 14, 2024

‘ఆలూరులో టీడీపీని బతికించండి’

image

ఆలూరు నియోజకవర్గంలో చతికిలపడ్డ టీడీపీని బతికించాలని శనివారం నియోజకవర్గానికి చెందిన నేతలు అధిష్ఠానానికి విన్నవించారు. అధినేత చంద్రబాబు, లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసును కలిసి పలు విషయాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వీరభద్ర గౌడ్ స్థానిక నాయకులను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లకపోవడం వల్లే 2024 ఎన్నికల్లో ఓటమి చెందారని, ఈయన స్థానంలో కొత్త ఇన్‌ఛార్జిని నియమించాలని కోరినట్లు వారు తెలిపారు.

News July 14, 2024

BREAKING: కర్నూలు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్

image

రాష్ట్రంలో ఐపీఎస్‌ల బదిలీల్లో భాగంగా బిందు మాధవ్‌ను కర్నూలు జిల్లా ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్న కృష్ణకాంత్‌ను నెల్లూరు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.

News July 13, 2024

నంద్యాల: బాలిక హత్యాచార ఘటనలో ట్విస్టుల మీద ట్విస్టులు

image

నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన బాలిక హత్యాచార ఘటనలో ట్విస్టులు మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మొదట ముగ్గురు బాలురు రేప్, అనంతరం హత్యచేసి మృతదేహాన్ని నీటిలో పడేశామని చెప్పగా.. పోలీసులు 5రోజులుగా గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో మరోసారి విచారించగా శ్మశానంలో పూడ్చి పెట్టామని చెప్పారు. అక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో, శనివారం జూపాడుబంగ్లా PSలో నిందితుల తల్లిందండ్రులను పోలీసులు విచారిస్తున్నారు.

News July 13, 2024

నంద్యాల: రైలు నుంచి కింద పడిన భార్య.. కాపాడే క్రమంలో భర్త మృతి

image

రైలు నుంచి కిందపడిన భార్యను కాపాడబోయి భర్త మృతిచెందిన ఘటన డోన్‌ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద జరిగింది. దంపతులు సయ్యద్‌ ఆసిఫ్‌, అసియాబాను ఫుట్‌బోర్డుపై కూర్చొని ప్రయాణిస్తుండగా నిద్రమత్తులో భార్య కిందపడింది. గమనించిన భర్త ఆమెను కాపాడేందుకు రైలు నుంచి దూకి మృతిచెందాడు. మహిళను డోన్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కర్ణాటకకు చెందిన వీరు.. 4 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.